Foods to Avoid for a Healthy Heart : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదంటే ప్రాణాలు ఇట్టేపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు హార్ట్ ఎటాక్‌లు ఓ వయసు వారికి వచ్చేవి. ఇప్పుడు వయసు తేడా లేకుండా చాలా మంది గుండె సమస్యలతో కన్నుమూస్తున్నారు. కార్డియోవాస్కులర్తో ఏటా 18.5 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు మరణాల్లో ఒకటి గుండె సమస్య వల్లే సంభవిస్తుందట. అందుకే గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఏటా సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ హృదయ దినోత్సవం (World Heart Day 2024) జరుపుతున్నారు.
గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ.. హార్ట్‌ని జాగ్రత్తగా చూసుకునేలా ప్రేరేపిస్తూ.. ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డేని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా అందరికీ గుండె ఆరోగ్యం అనే థీమ్‌తో ముందుకు వస్తున్నారు. అయితే గుండె విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో.. ఎలాంటి ఫుడ్‌కి దూరంగా ఉండాలో ఇప్పుడు చూసేద్దాం.
జీవనశైలిలో మార్పులు..
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. క్రమం తప్పుకుండా వ్యాయామం చేయాలి. ఎక్కువ, కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివాటిని రోజుకో అరగంట చేస్తే మంచిది. బరువు అదుపు తప్పితే.. గుండె మాట వినదు. కాబట్టి బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒత్తిడి కూడా గుండెపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి ధ్యానం, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి.
వాటికి దూరంగా ఉండాలి..
రోజుకు కనీసం ఏడు నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర లేకుంటే గుండె సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముంది. స్మోకింగ్ అలవాటు మానేయాలి. మద్యం లిమిట్ చేస్తే ఇంకా మంచిది. రెగ్యూలర్‌గా రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను చెక్ చేసుకోవాలి. వైద్యులు అందించే సూచనలు, సలహాలు పాటించాలి.
ఈ ఫుడ్‌ని కచ్చితంగా తీసుకోవాలి..
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో కొన్ని ఫుడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. బచ్చలికూర, కాలే, గ్రీన్ వెజిటేబుల్స్ గుండె ఆరోగ్యానికి మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి పూర్తిగా ఫైబర్‌తో నిండి ఉంటాయి. చేపల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.
అవకాడోల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ బ్రెడ్, చిక్కుళ్లు, బ్లాక్ బీన్స్‌లో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆలివ్ ఆయిల్లో కూడా హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. పసుపు, అల్లం, దాల్చినచెక్కతో హెర్బల్ టీలు చేసుకుని తాగితే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
తినకూడని ఫుడ్స్ ఇవే..
హార్ట్ హెల్తీగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. పూర్తిగా మానలేకపోయినా వాటిని పరిమితం చేయాలి. అలాంటి వాటిలో ప్రాసెస్ చేసిన మీట్స్ ఒకటి. షుగర్ డ్రింక్స్, సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు, అధిక సోడియం ఉన్న ఆహారాలు కేవలం గుండెకే కాదు పూర్తి ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి.
మరిన్ని టిప్స్
స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తే మంచిది. సామాజికంగా కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఒంటరితనం కూడా గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రెగ్యూలర్‌గా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి. దీనివల్ల గుండె సమస్యలనే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఆదిలోనే గుర్తించి.. వాటికి చెక్ పెట్టొచ్చు. అయితే మీరు ఏది ఫాలో అవ్వాలన్నా.. ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకుంటేనే మంచిది.
Also Read : వానల్లో, వరదల్లో తిరుగుతున్నారా? అయితే జాగ్రత్త.. మాంసాన్ని తినేసే బాక్టీరియా సోకొచ్చు.. విజయవాడలో ఏమైందంటే