తమలపాకు లేనిదే ఏ పూజ పూర్తవ్వదు.ఎంతో మందికి భోజనం చేశాక తాంబూలం వేసుకునే అలవాటు ఉంటుంది.కనీసం రెండు తమలపాకులైనా నమిలేస్తారు. పూర్వకాలం నుంచి మనం ఆచరిస్తున్న సంప్రదాయాలు, అలవాట్ల వెనుక చాలా అర్థాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన కారణాలు ఉంటాయి. అప్పట్లో పెద్దలు అన్నీ ఆలోచించే ఇలాంటి ఆచారాలు పెట్టి ఉంటారు. భోజనం చేశాక తమలపాకులు తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. 


భోజనం తరువాత తింటే...
మనదేశంలో చాలా రాష్ట్రాల్లో భోజనం తరువాత తమలపాకులు నమిలే అలవాటు ఉంది. అవి మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతాయి. భోజనం చేశాక  ఆహారం తాలూకు చిన్న చిన్న భాగాలు పళ్లలో ఇరుక్కునే అవకాశం ఉంది. అవి అలాగే అక్కడ ఉండే పాచిగా మారుతాయి. చివరికి నోటి దుర్వాసనకు కారణమవుతుంది. అందుకే భోజనం చేశాక తమలపాకులను నమిలితే నోరు క్లీన్ అవుతుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో తమలపాకులు ముందుంటాయి. 


ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఆరోగ్యపరంగా చూస్తే తమలపాకుతో ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. 


1.తమలపాకు రోజూ తినడం చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ఈ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముసలితనపు ఛాయలను కనిపించకుండా చేస్తాయి. 
2. తమలపాకులో ఉండే చెవికాల్ అనే పదార్థం బ్యాక్టరియాను అడ్డుకుంటుంది. అందుకే దీన్ని తినడం బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. 
3.రోజుకు రెండు ఆకులను మించి తినకపోవడమే మంచిది. అధికబరువు తగ్గాలనుకునేవారు రోజూ ఒక తమలపాకులో రెండు మిరియాలు కలుపుకుని నమిలితే మంచి ఫలితం ఉంటుంది. 
4. ఈ ఆకుల్లో విటమిన్ ఎ, సితో పాటూ కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి రోజుకో ఆకు నమలడం వల్ల చాలా లాభం. 
5. డిప్రెషన్, మానసిక ఆందోళన వంటి సమస్యల బారిన పడిన వారు రోజూ తమలపాకు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
6. ఈ ఆకులు రోజూ తినేవారిలో దగ్గు, జలుబు వంటి సమస్యలు రావు. కఫం కూడా పట్టదు.    


తమలపాకు అలా పుట్టిందా?
దేవతలు,రాక్షసులు సముద్రమధనం చేస్తున్న సమయంలోనే తమలపాకు పుట్టిందని, దాన్ని దేవతలు పొందరానే నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే శ్రీరాముడి సందేశాన్ని సీతాదేవికి హనుమంతుడు తెలియజేసినప్పుడు ఆమె సంతోషంతో హనుమంతుడిని తమలపాకుతో అలంకరించినట్టు కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఆ ఆకు వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. 


Also read: బార్లీ జావ తాగితే వడదెబ్బే కాదు, ఈ వ్యాధులు కూడా రావు


Also read: ప్లాస్టిక్ కణాలు పొట్టలో చేరకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే