క వ్యక్తి చనిపోతూ మరోకరికి ప్రాణం పోయడమంటే విచిత్రంగానే ఉంటుంది. కానీ, అది నిజం. కేవలం ‘అవయవదానం’ వల్లే అది సాధ్యమవుతుంది. చనిపోయిన వ్యక్తి తన అవయవదానాలు చెయ్యడం వల్ల ఏంతో మంది ప్రాణాలు నిలబడతాయి. కిడ్నీలు, గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, బ్రెయిన్ ఇలా అన్ని ఆర్గాన్స్ దానం చేసి.. అవసరాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఇంతక ముందు అయితే అవయవదానం చెయ్యాలంటే అసలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే, దీనిపై అవగాహన చాలా అవసరం. అందుకే, ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవాదానం దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  అవయవదానం ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేస్తున్నారు. 


అవయవదానం ఎలా మొదలైంది?


1954లో యూఎస్ లో తొలి అవయవదానం విజయవంతంగా జరిగింది. డాక్టర్ జోసఫ్ ముర్రే ఈ ఆపరేషన్ ని చేశారు. కవల సోదరులైన రోనాల్డ్, రిచర్డ్ హెర్రిక్‌లకు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి ప్రాణాలు కాపాడినందుకు గాను 1990లో సైకాలజీ, మెడిసిన్ విభాగంలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు.


అవయవదానం ఎవరు చెయ్యొచ్చు?


హెచ్ ఐవీ, గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తులకి సంబంధించిన ఎటువంటి దీర్ఘకాలిక జబ్బులు లేని ఎవరైనా అవయవాదానం చెయ్యొచ్చు. దీనికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. కానీ అవయవాదానం చేసే వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.


అవయవదానం రకాలు


అవయవదానం రెండు రకాలు. మనిషి ఒక కిడ్నీ, లివర్ తో జీవించగలడు. మనిషి బతికి ఉన్నప్పుడే ఆ అవయవాలను తీసి మరొకరికి అమర్చుతారు. రెండో విధానంలో.. దాత మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని దానం చేస్తారు. ఆ శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన అవయవాలను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు మార్చవచ్చు.


❂ ఎవరైనా అవయవదానం చెయ్యొచ్చు. ఇందుకు కులం, మతం ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.


❂ ఒక మనిషి చనిపోతే గుండె ఆగిపోయిన తర్వాత అవయవాలు పనికిరాకుండా పోతాయి. కొంతమంది బ్రెయిన్ పని చెయ్యడం ఆగిపోయినప్పుడు గుండె పని చేస్తూనే ఉంటుంది. నిర్ణీత సమయంలో మాత్రమే వాటిని తొలగించి మార్పిడి చెయ్యడానికి వీలవుతుంది.


❂ అవయవాలని తొలగించిన తర్వాత శరీరాన్ని చెల్లాచెదురుగా పడేస్తారని అపోహ ఉంటుంది. కానీ అవసరమైన అవయవాలు తీసుకున్న తర్వాత మానవ శరీరాన్ని చక్కగా కుట్టేస్తారు. దానికి మళ్ళీ సాధారణ రూపం తీసుకొస్తారు.


❂ మన దేశంలో అవయవ మార్పిడి చట్టం ఉంది. ఎవరైనా బయట వ్యక్తులు అ అవయవాలను అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరం. కేవలం దగ్గర బంధువులు మాత్రమే అవసరమైన వారికి అవయవదానం చెయ్యొచ్చు.


❂ చాలా మంది అవయవదానం చేసిన తర్వాత అనారోగ్యానికి గురవుతారని అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. నిజానికి సాధారణ వ్యక్తులు మాదిరిగానే అవయవదానం చేసిన వ్యక్తులు కూడా మామూలుగానే ఉంటారు. అవయవ మార్పిడి చేసే ముందు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు అన్ని పరీక్షలు చేస్తారు. రిపోర్ట్స్ అన్ని సక్రమంగా ఉంటేనే అవయవదానానికి వైద్యులు అంగీకరిస్తారు.


❂ ఆడవాళ్ళ అవయవాలని పురుషులకి మార్చడం సాద్యం కాదనే అపోహ ఉంది. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. మగ, ఆడవారి కాలేయం, కిడ్నీ ఒకేలా ఉంటాయి అందువల్ల వాటిని సురక్షితంగా మార్పిడి చెయ్యవచ్చు.


❂ 60 ఏళ్లు దాటిన వాళ్ళు అవయవదానం చేయడానికి కుదరదు. కాలానుగుణంగా దాత శరీర అవయవాలు పనితీరు సక్రమంగా ఉండాలి. అప్పుడే దానం చేసేందుకు అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి శరీర అవయవాల పనితీరు మందగిస్తుంది.  


Also read: ఆస్తమా ఉన్న వాళ్లు రాత్రి పూట పెరుగు తినవచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?


Also read: మీరు ఎంత తిన్నా బరువు పెరగని ఆహారాలు ఇవన్నీ,భయపడకుండా నచ్చినంత తినండి