అదనపు బరువు పెరగకుండా ఉండాలంటే కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినాలి. కానీ ఎలాంటి ఆహారాలు తినాలో మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు. అదనపు కేలరీలు లేని ఆహారాన్ని తింటేనే బరువు పెరగకుండా ఉంటారు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల బరువు అధికంగా పెరగకపోవడమే కాదు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. 


సీజనల్ పండ్లు
సీజన్లో లభించే పండ్లు ఏవి ఎంత తిన్నా కూడా మీరు బరువు పెరగరు. అవి శరీరానికి చాలా శక్తినిస్తాయి కూడా. పోషణను కూడా అందిస్తాయి. తాజా పండ్లను హోల్‌గ్రెయిన్ తృణధాన్యాలతో కలిపి తింటే చాలా రుచిగా కూడా ఉంటాయి. 


నట్స్
నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులను, ప్రొటీన్లతో నిండి ఉంటాయి. కనుక వీటిని తరచూ తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు వాల్‌నట్‌లు, బాదం పప్పులు, వేరు శెనగలు, పిస్తాలు రోజుకు రెండు పూటలా తింటే ఎంతో మంచిది. 


ఓట్స్ 
ఓట్స్ లో ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండానే పొట్ట నిండిన ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఓట్స్ లో కాస్త పాలు, పండ్లు కలిపి తింటే ఎంతో ఆరోగ్యం. ఇలా మీరు పొట్ట నిండా తిన్నా కూడా బరువు పెరగరు.  


పెరుగు 
పెరుగులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వెన్న తీసిన పాలతో తయారైన పెరుగు తినడం మంచిది. అదనపు రుచి కోసం పండ్లు జతచేయచ్చు. తాజా పండ్ల ముక్కలు కూడా వేసుకోవచ్చు. 


చిక్‌పీస్
కొమ్ము శెనగల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రుచిగా కూడా ఉంటాయి. వాటిని నానబెట్టి నూనెలో వేయించి ఉప్పు, మిరియాల పొడి వేసి వండుకుని తింటే ఆ రుచే వేరు. ఆకలిగా ఉన్నప్పుడు తినడం వల్ల శక్తి కూడా అందుతుంది. 


పాప్‌కార్న్
పాప్ కార్న్ జంక్ ఫుడ్ కాదు. కాబట్టి పిల్లలతో పాటూ పెద్దలు కూడా లాగించవచ్చు. ఇది బరువు పెంచదు కూడా, ఎందుకంటే దీని ద్వారా అంతే కేలరీలు చాలా తక్కువ. ఇది గ్లూటెన్ రహిత చిరుతిండి. ఇంట్లో తయారుచేసుకుని పాప్ కార్న్ తింటే మరీ రుచిగా ఉంటుంది. 


అవకాడోలు 
అవకాడో పండ్లు మనకు పండవు కానీ బాగానే దిగుమతి అవుతాయి. ప్రతి సూపర్ మార్కెట్లోనూ అవి అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండవు కానీ చాలా ఆరోగ్యం. అవకాడో ముక్కలు, ఉల్లిపాయలు, టొమాటోలు నిమ్మరసం కలిపి తింటే బాగుంటుంది.  


పీనట్ బటర్
పీనట్ బటర్ ప్రొటీన్లతో నిండి ఉంటుంది. ఇది చాలా శక్తిని అందిస్తుంది. అందుకే పిల్లల కోసమే ఆ ఆహారం అనుకోకుండా పెద్దవాళ్లు కూడా తినాలి. దీన్ని తినడం వల్ల కూడా బరువు పెరగరు. 


Also read: యుక్త వయసును వృథా చేస్తే అంధకారమే, ఇలాంటి పనులు చేస్తే త్వరగా ముసలివాళ్లయిపోతారు


Also read: విటమిన్ బి6 ట్యాబ్లెట్లు అతిగా మింగితే అంత డేంజరా? ఇతడికి ఏమైందో చూడండి