కాలం ఆగదు, 
మన పయనం కూడా ఆపకూడదు
ఎదురుపడిన ప్రతి ముల్లును దాటుకుంటూ, రాళ్ల దొంతరలను తొక్కుకుంటూ ముందుకు సాగాల్సిందే.
యుక్తవయసులో ఎంతో మంది చిన్న చిన్న ఒత్తిళ్లకే లొంగిపోయి ఏం చేయకుండా సోమరులుగా మారిపోతున్నారు. యుక్త వయసులో వృథా చేసే ప్రతి క్షణం మిమ్మల్ని ముసలితనానికి దగ్గర చేస్తుంది. రేపటి కాలం బావుండాలంటే ఈరోజు మీరు మితిమీరిన సరదాలకు, ఆకతాయి పనులకు పుల్ స్టాప్ పెట్టి, కెరీర్‌ పై దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీరు కష్టపడితేనే తరువాత సుఖపడేది. యుక్త వయసులో సుఖపడితే తరువాత కష్టాలే మిగులుతాయి. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యువతరం కోసమే ప్రతి ఏడాది ఆగస్టు 12న ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం’ నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువ దినోత్సవం 2000 సంవత్సరంలో జరిగింది. 


ఫోన్ వదిలి పుస్తకాలు పట్టండి
సెల్‌ఫోన్ వచ్చినప్పట్నించి యువత తీరే మారిపోయింది. ఆన్‌లైన్ గేమ్‌లకు డేటింగ్ సైట్లకు అలవాటు పడిపోతున్నారు. కేవలం కమ్యూనికేషన్ కోసం వాడాల్సిన మొబైల్‌ను జీవితంలో భాగం చేసుకున్నారు. నిత్యం వీడియోలు, టిక్‌టాక్ వంటి యాప్‌లతో గడిపేస్తున్నారు. మనసును, మెదడును చురుకుగా, ప్రభావవంతంగా మార్చే పుస్తకానలు చదవడం ఎప్పుడో మానివేశారు. రోజులో కనీసం ఒక్క గంటైనా మహనీయులు రాసిన పుస్తకాలు చదవండి. అవి మీలో ఎంతో మార్పును కలిగిస్తాయి. 


ఈ పనులు చేయవద్దు...
కొన్ని రకాల పనులు మిమ్మల్ని త్వరగా ముసలి వాళ్లుగా మార్చేస్తాయి. ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా మీరు చేసే ఇలాంటి మీలో చాలా చెడు మార్పును తీసుకొస్తాయి. 


ధూమపానం
ప్రపంచంలో ఎన్నో మరణాలకు కారణం ధూమపానం, ఇది అనేక రోగాలకు స్వాగతం పలుకుతుంది. అకాల వృద్ధాప్యాన్ని ఆహ్వానిస్తుంది. అతిగా ధూమపానం చేసేవారు 20లలోనే 30 వయసు దాటినట్టు కనిపిస్తారు. 


పెద్ద శబ్ధాలు
బిగ్గర శబ్ధాలు మీ ఆలోచనతీరుపైనే కాదు చెవుల పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తాయి. పబ్‌లు, పార్టీలలో పెద్ద శబ్ధాలతో మ్యూజిక్ పెట్టుకునే డ్యాన్సులు మీలో ఉత్సాహాన్ని నింపవచ్చు కానీ మీకు తెలియకుండా మిమ్మల్ని ముసలితనానికి దగ్గర చేస్తుంది. 


ఒత్తిడి
ఒత్తిడి శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శారరకంగా, మానసికంగా దెబ్బకొడుతుంది. దీర్ఘకాలంగా ఒత్తిడికి గురైతే అకాల వృద్ధాప్యం రావడం ఖాయం. అందుకే ఒత్తిడికి గురయ్యే సందర్భాలు ఎదురైతే కొన్ని నిమిషాల పాటూ చేస్తున్న పనిని వదిలి మీకు ఇష్టమైన పని చేయండి. 


Also read: విటమిన్ బి6 ట్యాబ్లెట్లు అతిగా మింగితే అంత డేంజరా? ఇతడికి ఏమైందో చూడండి


Also read: ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఆడవాళ్ల కన్నా మగవారిలోనే ఎక్కువ



















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.