భారతీయ ఆహారంలో పెరుగుది ప్రత్యేక స్థానం. చివరలో పెరుగుతో అన్నం తిననిదే భోజనం పూర్తి కాదు తెలుగువారికి.  మధ్యాహ్నం అయినా, రాత్రయినా కూడా పెరుగుతో ముగించాల్సిందే. పెరుగు తిన్న వెంటనే శరీరానికి హాయిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి. అయితే ఒక్కటే సందేహం? రాత్రిపూట పెరుగు తినవచ్చా?


ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే రాత్రిపూట పెరుగు తినకూడదు. కొన్ని సమయాల్లో తీసుకున్న ఆహారాలు శరీర పనితీరును దెబ్బతీస్తాయి. వాటిలో పెరుగు కూడా ఒకటి. పెరుగులో తీపి, పుల్లని రుచినిచ్చే గుణాలు ఉంటాయి. దాన్ని రాత్రిపూట తినడం వల్ల నాసికా మార్గంలో అధిక శ్లేష్మం ఏర్పడటానికి కారణం అవుతుంది. అలాగే మరెన్నో సమస్యలకు కారణం అవుతుంది. 


ఆస్తమాను పెంచేస్తుంది
మీకు ఉబ్బసం, అలెర్జీలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటే పెరుగును తినకూడదు. తినడం ఆ సమస్యలు అధికం అవుతాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు రాత్రిపూట పెరుగును దూరం పెట్టాల్సిందే. ఒక్కోసారి తీవ్రమైన లక్షణాలను దారతీసే ప్రమాదం ఉంది. అనేక సైడ్ ఎఫెక్టులు కూడా కలిగే అవకాశం ఉంది. 


పొట్ట నిండుగా...
పెరుగన్నం తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల నిద్రపోవడం ఇబ్బందిగా మారుతుంది, పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోలేరు. పెరుగు తినాల్సి వస్తే మజ్జిగలా చేసుకుని తినడం ఉత్తమం. పెరుగులో ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. ఈ బ్యాక్టిరియాలు మన శరీరానికి అవసరం కాబట్టి మధ్యాహ్నం పూట, బ్రేక్ పాస్ట్ సమయంలో పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. 


కఫ దోషం
ఆయుర్వేదం ప్రకారం పెరుగను రాత్రి పూట తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది అసమతుల్యతలకు కారణం అవుతుంది. ముక్కులో అధికంగా శ్లేష్మం పెరిగేలా చేస్తుంది. దగ్గు జలుబుకు కారణం అవుతుంది. 


అసిడిటీ వస్తుంది
కొందరిలో అసిడిటీ త్వరగా వచ్చేస్తుంది. అలాంటి వారు రాత్రి పూట పెరుగు తినడానికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు రాత్రిపూట పెరుగు తినడం ఎసిడిటీ సమస్యను పెంచుతుంది. 


Also read: మీరు ఎంత తిన్నా బరువు పెరగని ఆహారాలు ఇవన్నీ,భయపడకుండా నచ్చినంత తినండి


Also read: యుక్త వయసును వృథా చేస్తే అంధకారమే, ఇలాంటి పనులు చేస్తే త్వరగా ముసలివాళ్లయిపోతారు




















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.