ఎన్నో గొప్ప ఔషధాలు కలిగిన పండుగా అంజూర చాలా ప్రసిద్ధి చెందింది. అంజూర లేదా అంజిర్ అని పిలిస్తారు. ఎండిన లేదా తాజా పండుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి కొవ్వు రహిత, కొలెస్ట్రాల్ లేని ఆహార పదార్థాలు. ఎండిన అంజీరా చూడటానికి కొంచెం అరటిపండు మాదిరిగా అనిపిస్తుంది. ఇందులో విటమిన్స్ ఎ, సి, కాలిష్యం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. హై బ్లడ్ షుగర్ లేవల్స్ తో బాధపడే వాళ్లు వీటిని ఎక్కువ మోతాదులో తినకుండా ఉండటమే మంచిది. బరువు తగ్గే దగ్గర నుంచి జుట్టు పెరిగేంత వరకు అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది.


బరువు తగ్గిస్తుంది 
అంజీరా పండ్లు తినడం వల్ల బరువు తగ్గొచ్చు. ఆకలిని అరికట్టేందుకు మీ భోజనానికి మధ్య వీటిని తీసుకోవడం మంచిది. ఇది తినడం వల్ల ఎక్కువ సేపు మీ పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. దాని వల్ల మీకు త్వరగా ఆకలి కాకుండా చేస్తుంది.


జుట్టు పెరుగుతుంది 
అంజీర్ లో జుట్టుకు మేలు చేసే మెగ్నీషియం, విటమిన్ సి, ఇ ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలని ప్రోత్సాహిస్తాయి. ఈ పోషకాలు స్కాల్ఫ్ లో రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టు పెరుగుదలను వేగవంతం చెయ్యడంలో సహాయపడుతుంది.


రక్తపోటు నియంత్రణ 
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. పొటాషియం అసమతుల్యత వల్ల, సోడియం ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అంజీరాలో పొటాషియం అధికంగా లభిస్తుంది దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.  


జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది 
ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం, అతిసారం, జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. అధిక ఫిబర్ కంటెంట్ తో పాటు ఇందులో ప్రీ బయాటిక్స్ ఉంటాయి. ఇవి పేగులని శుభ్రం చెయ్యడంలో సహాయపడుతుంది.


శక్తిని ఇస్తుంది 
అంజీరాలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల శక్తిని పెంచుతాయి. శక్తి తక్కువగా ఉన్నటుగా అనిపిస్తే పొద్దునే ఒక గ్లాసు పాలతో పాటు అంజీరా పండును వేసి మరిగించి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.


నిద్రకి సహకరిస్తుంది
అంజీరా శరీరంలో మెలటోనిన్ విడుదల వేగవంతం చేస్తాయి. ఇవి నిద్ర వచ్చేందుకు సహకరించేందుకు బాధ్యత వహిస్తాయి. అంజీరా మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. నిద్ర లేమి నుంచి బయటపడేందుకు సహకరిస్తుంది.


మొటిమల నివారణ
కొన్ని అధ్యయనాల ప్రకారం అంజీరా మొటిమలను నిరోధిస్తుంది. అంజీరా పండ్లు, ఆకుల రసం యాంటియాక్నే చర్యను చూపుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.  


రోజుకి ఎన్ని తినొచ్చు? 
ఒక మీడియం సైజ్ అంజీరాలో 37 కేలరీలు, 8 గ్రాముల చక్కెర, 10 గ్రాముల పిండి పదార్థాలు శరీరానికి అందుతాయి. ఆరోగ్యం కదా అని అదేపనిగా వాటిని తింటే మాత్రం షుగర్ లేవల్స్ పెరుగుతాయి. అందుకో రోజుకి 2-3 పండ్లు వరకి తినొచ్చు. అదే ఎండిన అంజీరా అయితే 3 కంటే ఎక్కువ తీసుకోకూడదు. రాత్రంతా నానబెట్టకుండా వీటిని అసలు తినకూడదు. రాత్రిపూట నానబెట్టిన తర్వాత తినడం చాలా మంచిది. ఇది శరీరంలోని పోషకాలను గ్రహించి జీర్ణం అయ్యేందుకు సహకరిస్తుంది.


గర్భిణీలు తినొచ్చా? 
గర్భిణీలు తప్పకుండా తినాల్సిన డ్రై ఫ్రూట్స్ లో ఇది కూడా ఉంది. పోషకాలతో నిండిన దీని తీసుకోవడం గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది. పిండం అభివృద్ధికి సహకరిస్తుంది. తల్లి ఎముకలు బలంగా ఉండేలా చూస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ లక్షణాలను తగ్గిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: ఇలా చేస్తే గుండె పోటు, మెదడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 70 శాతం తగ్గించుకోవచ్చు, ఏం చేయాలంటే


Also read: గుడ్డు కారం ఇలా చేసుకుని తింటే అదిరిపోతుంది