Walking Benefits for Heart : బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడంతో పాటు.. గుండె హెల్త్‌ని మెరుగుపరచుకోవాలని వాకింగ్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు పాటించాల్సిందే. అవును వాకింగ్ చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఫిట్నెస్ గోల్స్ రీచ్ అవ్వడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని అంటున్నారు నిపుణులు. వాకింగ్ చేసేప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? వాటివల్ల గుండె ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
నడక అనేది బరువు తగ్గడానికి అద్భుతమైన మార్గం. అంతేకాకుండా ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నడక హార్ట్ బీట్‌ని పెంచి.. రక్తాన్ని శరీరం అంతా ప్రవహించేలా చేస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే మీ మార్నింగ్ లేదా ఈవెనింగ్ వాక్‌లో కొన్ని పనులు యాడ్ చేయడం వల్ల అవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె కండరాలను బలపరచి.. ఒత్తిడిని తగ్గించి హెల్తీగా ఉంచుతాయి. మొత్తం గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి టిప్స్ అవ్వాలంటే..
బ్రేక్ తీసుకోండి..
మీరు వాకింగ్ లేదా ఫాస్ట్ వాకింగ్, జాగింగ్ చేసేప్పుడు హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది హృదయనాళ వ్యవస్థను సవాలు చేస్తుంది. సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే దీనికి అనుగుణంగా.. మీరు వాకింగ్ లేదా జాగింగ్‌లో బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. కాసేపు రిలాక్స్ అయి.. మరింత కొత్త ఎనర్జీతో వాకింగ్ చేయవచ్చు. ఇలా బ్రేక్స్ ఇస్తూ చేయడం వల్ల మీరు ఎక్కువసేపు నడవగలుగుతారు. అంతేకాకుండా కండరాలకు ఆక్సిజన్ పంపిణీ మరింత సమర్థవంతంగా అందుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది.
చేతులు ఊపడం..
నడక అంటే రోబోల్లా వాక్ చేయడం కాదు.. గుండె ఆరోగ్యం కోసం మీరు నడిచేప్పుడు పై శరీరభాగంపై దృష్టి పెట్టాలి. దీనిలో భాగంగా.. మీ చేతులను వాకింగ్‌కి అనుగుణంగా ఊపితే.. హార్ట్ బీట్ పెరిగి.. కేలరీలు బర్న్ అవుతాయి. పైగా ఇది వాకింగ్ స్పీడ్‌ని కూడా పెంచుతుంది. దీనివల్ల చేతులు, భుజాలు, వీపు కూడా బలపడతాయి.
శ్వాసపై కంట్రోల్..
వాకింగ్ చేస్తున్నప్పుడు మీరు గట్టిగా కాకుండా.. స్లోగా, డీప్ బ్రీత్ తీసుకునేలా ట్రై చేయండి. ముక్కు ద్వారా గాలి పీల్చుకుని.. నోటి ద్వారా నెమ్మదిగా వదలడం ట్రై చేయాలి. ఈ టెక్నిక్ వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా బీపీ కంట్రోల్ అవుతుంది. ఈ వాకింగ్ రొటీన్ ఫాలో అయితే గుండె ఆరోగ్యం కూడా మెరుగవతుంది. మైండ్‌ఫుల్‌గా ఉంటారు.
బాడీ స్ట్రెచ్..
వాకింగ్ చేసేముందు బాడీ స్ట్రెచ్‌లు చేస్తే గుండె ఆరోగ్యానికి చాలామంచిది. అలాగే రక్తప్రసరణను పెంచి.. శరీరాన్ని యాక్టివ్ చేస్తాయి. నడుస్తున్నప్పుడు ఎలాంటి కండరాలు పట్టేయడం వంటి సమస్యలు లేకుండా హెల్ప్ చేస్తాయి. రక్తప్రవాహం మెరుగవుతుంది. పైగా ఇది మీ మొత్తం శరీరాన్ని సమర్థవంతంగా వార్మ్ చేస్తుంది. దీనివల్ల మీరు మరింత మెరుగ్గా, ఎక్కువ దూరం నడవగలుగుతారు.
ఎత్తులు ఎక్కితే..
వాకింగ్ రొటీన్లో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు చిన్న చిన్న కొండలు లేదా పైకి నడవడం వంటివి చేయాలి. ఎత్తు ఎక్కిందేంకు మీరు మరింత ఎక్కువ ఎనర్జీని ఉపయోగిస్తారు. ఆ సమయంలో గుండె శరీరమంతా రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. దీనివల్ల హృదయనాళ వ్యవస్థ మెరుగవుతుంది. గుండె జబ్బులు తగ్గుతాయి. ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలుగుతారు.
పార్క్‌లో నడిస్తే..
నడక ఎప్పుడూ ఓపెన్ ప్లేస్‌లో చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఫ్రెష్ ఎయిర్ అందుతుంది. ఇది ప్రశాంతతను ఇస్తుంది. మీ రొటీన్లో నడకను ఉంచుకోవాలనుకుంటే.. పార్క్ లేదా ప్రకృతిలో వాక్ చేసేలా ప్లాన్ చేసుకోండి. గోల్స్ మరింత త్వరగా రీచ్ అవుతారు.
వీటితో పాటు ఓ వాకింగ్ పార్టనర్‌ని మీ లిస్ట్‌లో యాడ్ చేయండి. దీనివల్ల మీరు ఇద్దరూ కలిసి కొన్ని గోల్స్ సెట్ చేసుకోవచ్చు. రిలాక్స్ అయ్యే సమయంలో ఇద్దరు కలిసి హాయిగా నవ్వుకుని.. మరింత ఎనర్జీతో వాకింగ్పై ఎఫర్ట్స్ పెడతారు. ఇది స్ట్రెస్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా మీరు రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తూ ఈ టిప్స్ ఫాలో అయితే హార్ట్ హెల్త్‌లో కచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫిట్నెస్ గోల్స్ కూడా రీచ్ అవుతారు.
Also Read : బరువు తగ్గడం కోసం ఏ వయసువారు ఎన్ని నిమిషాలు వాకింగ్ చేయాలో తెలుసా? నిపుణుల సలహాలివే