kuja Pushya Yoga: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జాతక చక్రంలో కుజుడి సంచారం చాలా ప్రధానం. కుజుడు పుష్యమి నక్షత్రంలో కలిసే సమయాన్ని కుజపుష్య యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్న కుజుడు ఏప్రిల్  12 నుంచి పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఏర్పడే కుజపుష్యయోగం అత్యంత శక్తివంతమైనది. కొన్ని రాశులవారికి అదృష్టాన్ని మోసుకొస్తోంది. 

Continues below advertisement


భూమిపుత్రుడు అని చెప్పే కుజుడు రాశి మారినా, నక్షత్రం మారినా ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. ముఖ్యంగా పుష్యమితో కలిసినప్పుడు కొన్ని రాశులవారికి సంపద పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులతో మంచి లాభాలు పొందుతారు. కెరీర్లో మంచి అవకాశాలకోసం ఎదురుచూస్తున్న వారికి ఇదే మంచి సమయం.  


Also Read:  శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!


మంగళ్ పుష్యయోగం వల్ల లాభపడే రాశులివే


వృషభ రాశి


పుష్య నక్షత్రంలో కుజుడి సంచారం వృషభ రాశివారికి అదృష్టాన్ని తీసుకొస్తోంది. చేపట్టిన ప్రతి పని సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత పురోగతి ఉంటుంది. ఉద్యోగులు ఆశించిన ప్రమోషన్ పొందుతారు. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్లాన్ చేసుకుంటారు. 



కర్కాటక రాశి


కుజపుష్య యోగం  కర్కాటక రాశివారి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. సంఘంలో గౌరవం పెంచుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలతో మాధుర్యం ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. సాధారణ దినచర్యలో మార్పులు వద్దు.   


Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే


కన్యా రాశి


కన్యారాశి వారికి కుజ పుష్యయోగం సమయంలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. మీరున్న రంగంలో విజయం సాధిస్తారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. 


వృశ్చిక రాశి


వృశ్చిక రాశివారు కుజ పుష్య యోగంతో సానుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. మీరున్న రంగాల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. 


Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే


కుంభ రాశి


కుజపుష్య యోగం కుంభరాశివారి ఆర్థిక ఇబ్బందులను తీర్చేస్తుంది. డబ్బు సంపాదించేందుకు ఇదే మంచి సమయం. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్దిస్తారు. వాహనం లేదంటే ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.