తల్లి కావడం అనేది ఒక వరం. తొలి సారి గర్భం ధరించిన ఆ క్షణాలు ప్రతి మహిళకి ఓ మధురమైన జ్ఞాపకమే. గర్భం ధరించిన దగ్గర నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. శరీరంలో కూడా అనేక మార్పులకు లోనవుతుంది. హార్మోన్ల స్థాయిల వల్ల ఇది జరుగుతుంది. అయితే శరీరం ఒక్కతే కాదు మన నిద్ర, ఆహార విధానాలలో కూడా మార్పులు వచ్చేస్తాయి. కొంతమందికి అతిగా నిద్ర వచ్చేస్తుంది. ఎక్కువసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది, బాగా తినాలని అనిపిస్తుంది. మరి కొంతమందికి మాత్రం ఆహారం చూస్తేనే వాంతులు అయిపోతాయి. ఏది తినాలన్నా నోటికి సహించదు. ఒక్కొక్కరికి ఒక్కో ఫీలింగ్ ఉంటుంది. ఒక్కోసారి ఇవి సాధారణ పరిస్థితిలుగా అనిపించినప్పటికి వైద్యులని సంప్రదించడం కూడా ముఖ్యమే.  


గర్భిణులు ఆకలి కోల్పోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు తినకుండా ఉంటే అది తల్లికి, కడుపులోని బిడ్డకి ప్రమాదమే. అందుకే మీరు ఇప్పుడు తినాల్సింది ఒకరి కోసం కాదు ఇద్దరి కోసం. ఇద్దరికీ కలిపి తినాలి అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు అని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే కూడా. గర్భవతులు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అంత హెల్తీగా ఉంటారు. అయితే గర్భిణీల్లో ఆకలి లేకపోవడానికి కారణాలు ఉన్నాయి. అవేంటంటే..


వాంతులు: గర్భధారణ సమయంలో కొంతమందికి విపరీతంగా వాంతులు అవుతాయి. ఏది తిన్నా చూసినా వాంతులు అవుతూనే ఉంటాయి. ఇది మీ ఆకలిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు ఇది సాధారణ లక్షణం అయినప్పటికీ వికారం, వాంతులు వారి ఆహారం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అటువంటి సమయంలో మసాలా ఆహారాన్ని తీసుకోవడం నివారించాలి. తీసుకునే ఆహారం కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. సమయం ఇచ్చి తింటూ ఉండాలి.


ఆందోళన: తొలిసారి గర్భం దాల్చిన ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య ఇదే. ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఏవేవో ఆలోచిస్తు టెన్షన్ పడతారు. ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు ఆకలి మీద ప్రభావం చూపిస్తాయి. చాలా సార్లు గర్భిణీలు తమ ఆందోళన బయట పెట్టారు. అలా చేయడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే వాళ్ళు తమ ఆందోళన ఏంటో బయటకి చెప్పాలి, అప్పుడే వారికి మనసుకి ప్రశాంతత ఉంటుంది.


ఆకలి రుగ్మతలు: కొంతమంది గర్భిణీ స్త్రీలు గరబాధరం సమయంలో ఆకలి కోల్పోవడానికి ఇది కూడా ఇక కారణం కావచ్చు. అనోరెక్సియా, బులిమియా వంటి రుగ్మతలు కూడా ఆకలిని కోల్పోయేలా చేస్తాయి.


మందులు: గర్భిణీలకి సూచించిన కొన్ని మందులు కూడా వారి ఆకలిని కోల్పోయేలా చేస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 



Also read: ఈ భారీ థాలీని పూర్తిగా తింటే రూ.8.5 లక్షల బహుమతి, మోడీ పుట్టినరోజు స్పెషల్


Also read: వేడి వేడి ఆహారంపై నిమ్మకాయ రసాన్ని పిండి తప్పు చేస్తున్నాం - చెబుతున్న పోషకాహార నిపుణులు