Legends League Cricket:


లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రత్యేక మ్యాచులో ఇండియా మహారాజాస్ వరల్డ్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహారాజాస్ బ్యాటర్ యూసుఫ్ పఠాన్ (50) అజేయ అర్థశతకంతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనితోపాటు తన్మయ్ శ్రీవాత్సవ (54) రాణించాడు.


కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ (52) అర్థశతకం చేయగా.. రామ్ దిన్ (42), తిషారా (25) రాణించారు. మహారాజాస్ బౌలర్లలో పంకజ్ సింగ్ 5 వికెట్లతో మెరిశాడు. 


అనంతరం 171 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా మహారాజాస్ పవర్ ప్లే ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన భారత మాజీ బ్యాట్స్ మెన్ యూసుఫ్ పఠాన్ దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అతనికి మరో ఎండ్ లో తన్మయ్ శ్రీవాత్సవ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 20) ధనాధన్ బ్యాటింగ్ తో మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఇండియా మహారాజాస్ విజయాన్ని అందుకుంది. జెయింట్స్ బౌలర్ బ్రెస్నన్ 3 వికెట్లు తీశాడు. 


ఈరోజు ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మ్యాచ్ జరగనుంది. 


 


లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 పూర్తి షెడ్యూల్


శుక్రవారం, 16 సెప్టెంబర్- ప్రత్యేక మ్యాచ్: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
శనివారం, 17 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
ఆదివారం, 18 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (7:30 pm; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
సోమవారం, 19 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
బుధవారం, 21 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
గురువారం, 22 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
శనివారం, 24 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
ఆదివారం, 25 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (సాయంత్రం 4:00; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
సోమవారం, 26 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
మంగళవారం, 27 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
గురువారం, 29 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
శుక్రవారం, 30 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30 బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
శనివారం, 1 అక్టోబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
ఆదివారం, 2 అక్టోబర్- క్వాలిఫైయర్ (ర్యాంక్ 1 vs ర్యాంక్ 2) (రాత్రి 4 గంటలకు; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
సోమవారం, 3 అక్టోబర్- ఎలిమినేటర్ (ర్యాంక్ 3 vs లూజర్ ఆఫ్ Q1) ( రాత్రి 7:30 , వేదిక ప్రకటించాల్సి ఉంది.)
బుధవారం, 5 అక్టోబర్- ఫైనల్ (క్వాలిఫైయర్ విజేత vs ఎలిమినేటర్ విజేత) (రాత్రి 7:30 వేదిక ప్రకటించాల్సి ఉంది.)