చాలా వంటల్లో మనం నిమ్మకాయను భాగం చేసుకుంటాం. పులిహోర, బిర్యానీ, చికెన్, చేపల కూర... ఇలా చాలా వంటలపై నిమ్మరసాన్ని పిండుతాం. రుచిని పెంచేందుకే ఇలా నిమ్మరసాన్ని కలుపుతాం. ఇది మంచి పద్ధతే కానీ ఆహారం వేడిగా ఉన్నప్పుడు మాత్రం నిమ్మకాయ రసాన్ని పిండకూడదు. ఈ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య పోషకాలు అందుతాయి. కానీ మీరు ఆహారం వేడిగా ఉన్నప్పుడు రసాన్ని కలపడం అందే పోషకాలు సున్నా. ఇన్నాళ్లు మనం వేడి ఆహారంలో నిమ్మరసాన్ని కలిపి తప్పుచేశామంటున్నారు పోషకాహార నిపుణులు. 


ఎందుకు పిండకూడదు?
వేడి వేడి ఆహారంపై నిమ్మకాయ ఎందుకు పిండకూడదు? నిమ్మకాయ అనేది విటమిన్ సితో నిండి ఉంటుంది. ఇది మనకు అత్యవసరమైన విటమిన్. కానీ వేడి వేడి ఆహారంపై వేయడం విటమిన్ సిలోని గుణాలన్నీ నాశనం అయిపోతాయి. విటమిన్ సిను ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. ఇది ఉష్ణోగ్రత, కాంతి... రెండింటికీ స్పందిస్తుంది. నిమ్మరసం అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు సహజగుణాలను కోల్పోతుంది. వేడి నీటిలో లేదా వేడి ఆహారంలో ఈ రసం కలవగానే దాని ఎంజైమ్‌లు నాశనం అయిపోతాయి. నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఉత్తమ మొక్కల సమ్మేళనాలు. వీటికి వేడి తగిలితే అవి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వవు. 


అలా తాగడం వేస్టు 
చాలా మంది ఉదయాన వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. అలా తగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవంటున్నారు పోషకాహార నిపుణులు. నీటిలో వేడి నిమ్మరసంలోని సుగణాలను నాశనం చేస్తుందని, ఇక తాగి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. సాధారణ నీటిలో కలుపుకుని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. 


విటమిన్ సి మన శరీరానికి రోజూ తగినంత మోతాదులో అందాలి. లేకుంటే అనేక ఆరోగ్యసమస్యలు దాడి చేస్తాయి.ఇది శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. జుట్టు, చర్మం సున్నితంగా, మృదువుగా మారేలా చేస్తుంది. శరీర కణాలను ఆక్సీకరణానికి గురికాకుండా అడ్డుకుంటుంది. 


Also read: పీరియడ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతున్నాయా? ఇది అనారోగ్యానికి సంకేతం


Also read: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు


























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.