స్త్రీ జీవితంలో రుతుచక్రం చాలా ముఖ్యమైనది. ఆమె పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును సూచిస్తాయి పీరియడ్స్. ఆడపిల్లలు 9 నుంచి 14 ఏళ్ల వయసు మధ్యలో తొలిసారి పీరియడ్స్ అనుభవం అవుతాయి. అప్పట్నించి మళ్లీ మెనోపాజ్ వచ్చే వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా కనిష్టంగా మూడు రోజుల పాటూ, గరిష్టంగా అయిదు నుంచి ఏడు రోజుల వరకు రక్త స్రావం జరగుుతుంది. ఇలా జరిగితే ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. అలా కాకుండా కేవలం ఒకరోజు, లేదా రెండు రోజుల్లో పీరియడ్స్ ఆగిపోతున్నా, ఏడు రోజులకు మించి రక్తస్రావం అవుతున్నా కూడా పట్టించుకోవాల్సిన అంశమే. ముఖ్యంగా చాలా మంది ఒకటి లేదా రెండు రోజులకు పీరియడ్స్ ఆగిపోగానే త్వరగా అయిపోయినందుకు సంతోషిస్తారు.కానీ ఇది మంచి పద్ధతి కాదు. అలా ఒకటి రెండు రోజుల్లో పీరియడ్స్ ఆగిపోతున్నాయంటే ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్టే. ఇలా తక్కువ కాలం పాటూ పీరియడ్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇవిగో...
1. అండోత్సర్గము సమయంలో హార్మోన్ విడుదలకు ఆటంకం కలిగించే అతి వ్యాయామాలు
2. హార్మోన్ల అసమతుల్యత
3. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)
4. థైరాయిడ్ రుగ్మతలు
5. గర్భాశయం ఆరోగ్య సమస్యలు
6. అండోత్సర్గము సరిగా లేకపోవడం
7. రక్తాన్ని పలుచన చేసే మందులు వాడడం
8. స్టెరాయిడ్స్ వంటి మందులు వాడడం
ఇలా పీరియడ్స్ ఒకట్రెండు రోజులకు ఆగిపోతే కచ్చితంగా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. గర్భాశయం లైనింగ్ పొరను ఎండో మెట్రియం అంటారు. దీన్ని నిర్మించే హార్మోన్ ఈస్ట్రోజెన్. శరీరం ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని కావాల్సినంతగా ఉత్పత్తి చేయడం ఆపివేస్తే ఇలా పీరియడ్స్ ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతాయి. ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఎండోమెట్రియం పొర తగినంత మందంగా ఉందు. అప్పుడు రక్త ప్రవాహం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని నెలలుగా ఇలా తక్కువ కాలంలోనే పీరియడ్స్ ముగిసిపోతుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. పీరియడ్స్ నాలుగు నుంచి ఎనిమిది రోజుల్లోపు ముగిస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: రోజుకు 10,000 అడుగులు వేస్తే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశమే ఉండదు, మొదలుపెట్టండి మరి
Also read: జాక్ అంటే ఎవరు? పనసపండు పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా