అదొక నేలమాళిగ... అక్కడికి వెళ్లి ఓ నిమిషం పాటూ నిల్చుంటే చాలు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాసేపటికే మరణిస్తారు. అందుకే దాన్ని ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన ప్రదేశంగా పిలుస్తున్నారు. ఈ ప్రదేశం పేరు ‘ఎలిఫెంట్ ఫుట్ ఆఫ్ చెర్నోబిల్’. ఇది ఉక్రెయిన్లో ఓ నేలమాళిగ. దీని చుట్టుపక్కలకి ఎవరూ వెళ్లరు. ఇప్పటికీ ఆ ప్రదేశం ఉన్న ఊరు ఎడారిలా మారిపోయింది. ఊరంతా ఎప్పుడో ఖాళీ అయిపోయింది. దాదాపు 50,000 మంది ప్రజలు ఎక్కడికో వెళ్లిపోయారు. కొంతమంది క్యాన్సర్ వంటి రోగాలబారిన పడి చనిపోయారు. ఇప్పటికే ఆ ప్రాంతంమంతా ఓ ఘోస్ట్ సిటీలా ఉంటుంది. 


ఎక్కుడుంది?
ఉక్రెయిన్లోని ప్రీప్యాట్ అనే ఊరిలో జరిగింది ఇదంతా. 1986 నుంచి ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. అప్పట్నించి ఆ ఊరు మనుషులు లేని ఎడారిలా అయిపోయింది. అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. దాన్ని కూడా వదిలేసి అందరూ వెళ్లిపోయారు. 


ఎందుకలా?
1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ డిజాస్టర్ జరిగింది. అదొక న్యూక్లియర్ ప్రమాదం. ప్రీప్యాట్ గ్రామానికి దగ్గర్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ లోనే ఇది జరిగింది. దీంతో అక్కడ ఎప్పుడు చాలా ఎక్కువ రేడియేషన్ స్థాయిలు ఉంటాయి. ఇక్కడే ఉంది ‘ఎలిఫెండ్ ఫుట్ ఆఫ్ చెర్నోబిల్’ అని పిలిచే నేలమాళిగ. చెర్నోబిల్ అణు విపత్తు తరువాత ఇది చాలా ప్రమాదకరంగా మారింది. ఆ గదిలో రేడియో ధార్మిక ద్రవ్యరాశి చాలా అధిక మొత్తంలో ఉంటుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇంకా నేల మాళిక విషపూరితమైన వాయువులతోనే నిండి ఉంది. ఈ నేలమాళిగ అణు విపత్తు సమయంలో పేలిన రియాక్టర్ కు  దగ్గర్లోనే ఉంది. ఇందులో అణు ఇంధనం, కాంక్రీటు, ఇసుకతో కలిసి రేడియోధార్మిక బురదగా మారింది. అది దాదాపు రెండు మీటర్ల ఎత్తున పేరుకుపోయింది. దాని దగ్గర నిల్చుంటే చాలు మనుషులను చంపేసేంత విషపూరితంగా ఉంటుంది అక్కడి వాతావరణం. అణు విపత్తు జరిగాక పదేళ్ల వరకు ఎవరూ అక్కడికి వెళ్లలేకపోయారు. తరువాత 1996లో ఒక వ్యక్తి మాత్రం అతి జాగ్రత్తలు తీసుకుని ఇలా వెళ్లి అలా ఫోటో తీసి వచ్చేశాడు. అక్కడికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరు. 


అక్కడున్న రేడియోధార్మికత శక్తి తగ్గాలంటే పదివేల ఏళ్లు పడుతుంది. అప్పుడు కానీ ఆ ప్రాంతం మళ్లీ జనాలతో కళకళలాడదు. ఆ అణు ప్లాంట్ కు దగ్గరలో ఉన్న ప్రీప్యాట్ గ్రామం కూడా జనాలతో నిండాలంటే ఇంకా సమయం పడుతుంది. కారణంగా అక్కడున్న గాలిలో రేడియోధార్మికత నిండిపోయింది. దీంతో ప్రజలు చనిపోవడం, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడి తక్కువ కాలంలోనే మరణించడం జరుగుతోంది. పెద్ద భవంతులతో నిండిన నగరం ఒక్క మనిషి కూడా లేక దెయ్యాల నగరంగా పేరు పొందింది. ఆస్తులు, ఇళ్లు వదిలేసి ప్రజలు పక్క నగరాలకు పారిపోయారు.


Also read: పీరియడ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతున్నాయా? ఇది అనారోగ్యానికి సంకేతం


Also read: రోజుకు 10,000 అడుగులు వేస్తే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశమే ఉండదు, మొదలుపెట్టండి మరి