Trending
NTR Neel Movie Release Date: 'ఎన్టీఆర్ - నీల్' మూవీ రిలీజ్ డేట్... వచ్చే ఏడాది సమ్మర్‌లో 'డ్రాగన్'తో రచ్చ రచ్చే!?
NTRNeel Movie Release Date : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తన డైరెక్టర్ ప్రశాంత్ నేను దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయబోతున్నారని టాక్.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ('డ్రాగన్') నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీని ఏప్రిల్ 9న రిలీజ్ చేయబోతున్నట్టు టాక్.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 'డ్రాగన్' రాక?
కేజిఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రీసెంట్‌గా 'దేవర' మూవీతో సూపర్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్. వీరిద్దరి సెన్సేషనల్ కాంబోలో మూవీ రాబోతుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపైనే అందరి కళ్ళూ ఉన్నాయి. గత ఏడాదే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి లో సెట్స్ పైకి తీసుకెళ్లారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా, ప్రశాంత్ నీల్ 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో కూడిన ఓ భారీ యాక్షన్ సీన్ తో చిత్రీకరణ మొదలుపెట్టారు. నెక్స్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు.
ఇక ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. కానీ తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని మార్చడం హాట్ టాపిక్ గా మారింది. 'ఎన్టీఆర్ - నీల్' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. అందులో ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా 2026 ఏప్రిల్ 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోందని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. జనవరిలోనే రిలీజ్ అవుతుంది అనుకున్న మూవీ ఏప్రిల్ కి వాయిదా పడడం అన్నది నందమూరి అభిమానులను డిజప్పాయింట్ చేస్తోంది.
ఇదిలా ఉండగా ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించగా, ఇందులో టాప్ టెక్నీషియన్స్ భాగం అవుతుండడం విశేషం.
దళపతి విజయ్ సినిమాకు లైన్ క్లియర్
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కెరియర్లో చివరి సినిమాగా రూపొందుతోంది 'జననాయగన్'. వచ్చే ఏడాది ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తానని క్లారిటీ ఇచ్చారు విజయ్. ఆయన చివరి సినిమా 'జననాయగన్'ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్వహిస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో అప్పటికే 'దేవర' మూవీని ఇదే డేట్ కి రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేయడంతో రెండు సినిమాల మధ్య క్లాష్ జరగబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు 'జననాయగన్' లైన్ క్లియర్ అయినట్టు అయ్యిందని అనుకోవాలి.