Cherasaala Telugu Movie: ఈ వారమే థియేటర్లలోకి 'చెరసాల'... రిలేషన్షిప్స్ మీద తీసిన సినిమా బ్రో
Cherasaala Movie Release Date: హ్యూమన్ రిలేషన్షిప్స్, కపుల్ గోల్స్, మోడ్రన్ లైఫ్ స్టైల్ మీద తీసిన సినిమా 'చెరశాల'. ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా గురించి టీమ్ ఏం చెప్పిందంటే?
''ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్షిప్‌లో పార్ట్నర్స్ ఇద్దరూ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే అంశాలను మా సినిమాలో చూపించాం. ఇందులో మంచి భావోద్వేగాలతో పాటు వినోదం కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా 'చెరసాల'ను తీశాం'' అని కథానాయకుడు కమ్ దర్శకుడు రామ్ ప్రకాష్ గున్నం చెప్పారు. ఆయన హీరోగా నటించిన, దర్శకత్వం వహించిన సినిమా 'చెరసాల'. ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మించిన సినిమా 'చెరసాల'. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వస్తోంది. ఇందులో శ్రీజిత్, నిష్కల, రమ్య నటించారు.
మంచి కాన్సెప్ట్... మంచి టీంతో తీశాం!
''మంచి కాన్సెప్ట్, మంచి టీంతో తీసిన సినిమా 'చెరసాల'. కథ చెప్పిన వెంటనే మా నిర్మాతలు ఒప్పుకొన్నారు. శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించారు. మంచి టీం ఉంటేనే మనం మంచి సినిమా తీయగలం. ఈ సినిమాతో అది తెలిసింది. మా సినిమాను ప్రేక్షకులంతా థియేటర్లలో చూడండి'' అని అన్నారు. ఓ అమ్మాయి తన భర్తను, మాంగల్యాన్ని కాపాడుకునేందుకు తపన పడిన కథతో సినిమా తీశారట. సినిమాలో మరో హీరో శ్రీజిత్ మాట్లాడుతూ... ''ఇందులో మంచి క్యారెక్టర్ చేశా. నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా. కానీ కుదరలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది. మా దర్శకుడు నాలుగేళ్ల పాటు ఈ సినిమా మీద ఫోకస్ పెట్టారు. ఈ సినిమా చేసేటప్పుడు వేరే ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. నేను కన్నడలో చాలా సినిమాలు చేశాను. తెలుగులో నా తొలి చిత్రమిది'' అన్నారు.
Just In
హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ... ''నాకు ఈ 'చెరసాల'లో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. తెలుగులో నాకు తొలి చిత్రమిది. ఈ సినిమాలో ప్రియ అనే అద్భుతమైన పాత్రలో నటించా. మా దర్శకుడు రామ్ ప్రకాష్ సినిమాను అద్భుతంగా తీశారు. మేమంతా కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాం'' అని అన్నారు. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నటి రమ్య చెప్పారు. కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్, ఎడిటర్ భాను నాగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.