నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా 'ది పారడైజ్' (The Paradise Movie). శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'దసరా' తర్వాత హీరో, దర్శక - నిర్మాతల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ నటుడు ఒకరు కీలక పాత్ర చేస్తున్నారు. 

'ది ప్యారడైజ్'లో రాఘవ్ జ్యూయల్!Raghav Juyal Birthday Special, The Paradise Movie Update: రాఘవ్ జ్యూయల్... ఈ పేరు విన్నారా? బాలీవుడ్ హిట్ 'కిల్'లో నటించారు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'లోనూ నటించారు. ఈ రోజు (జూలై 10న) అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా 'ది ప్యారడైజ్'లో రాఘవ్ నటిస్తున్నట్లు తెలిపారు. 

రాఘవ్ జ్యూయల్ పుట్టినరోజు సందర్భంగా 'ది ప్యారడైజ్'లో నటిస్తున్న విషయం చెప్పడం మాత్రమే కాదు... మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. రాఘవ్ లుక్ టెస్ట్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో అది. అయితే ఆయన లుక్ రిలీజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మరి, నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు... బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'కింగ్'లోనూ రాఘవ్ నటిస్తున్నట్లు సమాచారం.  

రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్!ప్రస్తుతం 'ది ప్యారడైజ్' షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నారు. దీని కోసం 'రియల్' సతీష్ మాస్టర్‌తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. సినిమాకు ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అవుతుందట.

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

'ది పారడైజ్'ను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్... మొత్తం ఎనిమిది భాషలలో విడుదల చేయనున్నారు. మార్చి 26, 2026న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?