సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'కూలీ' (Coolie). ఇందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ప్రోమో విడుదల అయింది.

బుట్ట బొమ్మ కాదు... మోనిక!Pooja Hegde as Monica In Coolie: రజనీకాంత్ సినిమా అంటే సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఎక్కువ కేర్ తీసుకుంటారు. సూపర్ స్టార్ సినిమాలకు ఆయన ఇచ్చే సంగీతం స్పెషల్ అన్నట్టు ఉంటుంది. అందులోనూ స్పెషల్ సాంగ్ కావడంతో మరింత కేర్ తీసుకున్నారని ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.

మోనికా... అంటూ సాగే పాటలో పూజా హెగ్డే సందడి చేయనున్నారు ఈ సాంగ్ కోసం మ్యూజిక్ విషయంలో రెట్రో స్టైల్ ఫాలో అయ్యారు అనిరుద్. పోర్ట్ ఏరియాలో సాంగ్ పిక్చరైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ విడుదల చేసిన ప్రోమోలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కనిపించారు. అయితే ఈ పాటలో కింగ్ అక్కినేని నాగార్జునతో బుట్ట బొమ్మ స్టెప్పులు వేశారని తెలిసింది. 

మోనిక పాట విడుదల ఎప్పుడంటే?Coolie Second Single Release Date Time: 'కూలీ' సినిమా నుంచి ఒక సాంగ్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదల కానున్న 'మోనిక...' రెండో పాట. ఈ శుక్రవారం అంటే జూలై 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ విడుదలైన ప్రోమో పాట మీద అంచనాలు పెంచింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలలో పాట విడుదల చేస్తున్నారు.

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ 'కూలీ' సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. నాగార్జున విలన్ రోల్ చేశారు. ఆగస్టు 14న థియేటర్లలో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?