Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ దగ్గరకు విహారి వెళ్తాడు. లక్ష్మీ విహారితో నా వల్ల మీరు చాలా నష్టపోయారని ఏడుస్తుంది. యమునమ్మ కూడా ఏం మాట్లాడటం లేదని ముభావంగా ఉంటున్నారని ఎప్పుడూ నన్ను నమ్మే అమ్మగారు నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఇవన్నీ తట్టుకోలేకపోతున్నా దాని కంటే చచ్చిపోవడం బెటర్ అని పిస్తుందని అంటుంది.
విహారి లక్ష్మీతో అలాంటి మాటలు మాట్లాడొద్దు అని లక్ష్మీని హగ్ చేసుకుంటాడు. ఆ సీన్ యమున చూసేస్తుంది. లక్ష్మీ కన్నీటిని విహారి తుడవడం లక్ష్మీ విహారి చేయి పట్టుకోవడం చూసి యమున చిరాకుగా వెళ్లిపోతుంది. విహారి లక్ష్మీకి ధైర్యం చెప్తాడు. డబ్బులు తాను వెనక్కి తీసుకొస్తానని చెప్తాడు. ఇంతలో విహారికి ఆదికేశవ్ కాల్ చేస్తాడు. మీ పెళ్లి అయి సంవత్సరం కాబోతుందని మొదటి పెళ్లి రోజుకి మాతో ఉండాలని అనుకుంటున్నాం అని అంటే విహారి సరే అని తప్పకుండా వస్తామని అంటాడు.
విహారి మనసులో నీతో పెళ్లి అయి సంవత్సరం అవుతుందా ముందు ఈ సమస్య తీర్చిన తర్వాత నీపై ఇష్టాన్ని నీకు చెప్పాలి అని అనుకుంటాడు. యమున విహారి, లక్ష్మీల బంధం గురించి ఆలోచిస్తుంది. ఈ నిజం బయట పడితే ఇంట్లో అందరూ ఎలా రియాక్ట్ అవుతారు.. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి. విహారిని బతకనిస్తారా.. సహస్ర బతుకుతుందా అని బాధ పడుతుంది. ఇంతలో కొంత మంది విహారి డౌన్ డౌన్ అంటూ ఇంట్లోకి రాళ్లు విసురుతారు. విహారికి చెందిన వీ క్రాఫ్ట్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లకి న్యాయం చేయాలని అంటారు. విహారిని బయటకు రమ్మని అంటారు.
విహారి ఉన్నావా చచ్చావా అని అరుస్తారు. విహారి వెళ్తుంటే లక్ష్మీ ఆపుతుంది. వాళ్లు ఆవేశంగా ఉన్నారని అంటుంది. పద్మాక్షి పోలీసులకు చెప్పమని అంటుంది. విహారి వద్దని అంటాడు. విహారి బయటకు వెళ్తే రాళ్లు విసిరి కొడతారు. విహారికి రక్తం వస్తుంది. అందరూ కంగారు పడతారు. విహారి వాళ్లతో మీ బాధ నాకు తెలుసు అని అంటాడు. మీరే కాదు నేను నష్టపోయాను నా ఫ్యామిలీ నష్టపోయింది అని అంటాడు. వాళ్లంతా విహారితో మీకు ఎవరికీ నష్టం రాదు మొదటి నుంచి మొదలు పెడతా మళ్లీ కష్టపెడతా మీ నమ్మకాన్ని గెలుస్తా మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తానని అంటాడు.
పద్మాక్షి అందరితో మీరు నా మేనల్లుడిని నమ్మితేనే ఇంతకు పది రెట్లు పెంచుతాడని అంటుంది. సహస్ర, అంబిక, చారుకేశవ, అందరూ విహారిని నమ్మమని చెప్తారు. విహారి నెల రోజులు టైం ఇవ్వమని లేదంటే ఆస్తి మొత్తం అమ్మేసి మీకు డబ్బు ఇస్తానని అంటాడు. వాళ్లంతా సరే అంటారు. అంబిక మనసులో వంద కోట్లు తిరిగి రావని అనుకుంటుంది. సుభాష్‌ని వాళ్లందరినీ కలిసి భారీ నష్టపరిహారం అడగమని అంటాడు.
లక్ష్మీ విహారి గాయానికి మందు పెడతా అంటే పద్మాక్షి లాగి పెట్టి కొట్టి విసిరేస్తుంది. నువ్వేంటే చేసేది అంటుంది. విహారి అత్తయ్యా అంటే మధ్యలోకి నువ్వు రావొద్దు అని అంటుంది. అందరికీ లక్ష్మీ కామెర్లు వచ్చినట్లు ఉన్నాయని అంటుంది. విహారికి ఈ పరిస్థితి రావడానికి లక్ష్మీనే కదా కారణం అని అంటుంది. లక్ష్మీనే వంద కోట్లు మళ్లించిందని అంటుంది. దీన్ని నెత్తిన ఎక్కించుకోవడం వల్ల మన గతి ఇలా అయిందని అంబిక అంటుంది. లక్ష్మీ వాళ్లతో ఎలా అయినా ఆ ఫండ్ వెనక్కి తీసుకొస్తా అని అంటుంది. నాకేం తెలీదు నన్ను నమ్మండి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!