Chinni Serial Today Episode మహిని ఇరిటేట్ చేయడానికి కాలేజ్‌లో మధుమిత పెద్ద సౌండ్‌ బాక్స్ పెట్టి రాను ముంబాయికి రాను అని డ్యాన్స్ వేస్తుంది. మహి మధుని ఆపి చెత్త డ్యాన్స్‌ నువ్వు అని అంటాడు. దానికి మధు నీది మబ్బు ముఖం నీ ఫ్రెండ్స్‌ది చెత్త ముఖం అని అంటుంది. మా వాడిది మినిస్టర్ ఫ్యామిలీ అని మహి ఫ్రెండ్ అంటే మాది మీ కంటే పెద్ద ఫ్యామిలీ ఓటర్ల ఫ్యామిలీ.. మహా అయితే మీ ఇంట్లో ఒక మినిస్టర్ ఉంటాడు. మా ఇంట్లో ముగ్గురు ఓటర్లు ఉన్నారని అంటుంది. డ్యాన్స్ వేసుకుంటూ మహిని ఉడికించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

మహి కోపంతో తొందర్లోనే దీని మెంటల్ పూర్తిగా తగ్గిస్తా అనుకుంటాడు. మధు తన ఫ్రెండ్‌తో వెళ్తుంటే లోహిత ఎదురు వెళ్లి బుద్ధుందా నీకు అని అంటుంది. మధు పక్కన ఉన్న ఇద్దరి అమ్మాయిలతో మనం ఏంటి మన రేంజ్‌ ఏంటి? క్యాంటీన్‌లో మనం తిన్న ప్లేట్స్‌లో మిగిలినవి తినే వారు ఇటు రండి అని వాళ్లని పిలుస్తుంది. మధుకి చాలా కోపం వస్తుంది. మా రేంజ్ వాళ్లు పొలాల్లో పండిస్తేనే మీ ప్లేట్‌కి వస్తుంది లేదంటే మాడిపోతావ్ అని మా రేంజ్‌ని తక్కువ చేస్తే నీ పని పడతా అని మధు వార్నింగ్ ఇస్తుంది. నా పక్క ఉన్న వాళ్లని నీ పక్కకి తిప్పుకోవడం కాదు సాయంత్రానికి నీ వాళ్లని నా వైపు తిప్పుకుంటానని  అంటుంది. ఎవరు ఓడిపోతే వాళ్లు క్యాంటీన్ బిల్ కట్టాలి అనుకుంటారు. 

వసంత కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే ప్రమీల వచ్చి నీ పని బాగుంది వసంత నీతో పాటు నీ కొడుకు కూతుర్ని అన్నా వదినలు తెచ్చుకొని సంతోషంగా పెంచుకుంటున్నారు అని అంటుంది. దాంతో వసంత నాకు కష్టాలు ఎందుకు లేవు వదినా అని సీరియల్ లిస్ట్ మొత్తం చెప్తేస్తుంది. ఇక కూతురి పెళ్లి గురించి టెన్షన్ అవసరం లేదని అల్లుడు ఇంట్లోనే ఉన్నాడని అంటుంది. ఇక కాలేజ్‌లో మీ బావ ఎలా ఉన్నాడు అని అంటే సూపర్ అని కానీ ఓ చెత్త ఫెలో ఇరిటేట్ చేస్తుందని అంటుంది. ఇక వసంత, ప్రమీల ఇద్దరూ శ్రియకి బావని పెళ్లికి రెడీ చేసుకో అంటే అత్త వాళ్ల చూసుకుంటారులే అని శ్రియ వెళ్లిపోతుంది. నీ కూతురే ఈ ఇంటి కోడలు అవుతుందని ప్రమీల అంటుంది. 

మహి వాళ్ల కాలేజ్‌లో వాలీబాల్ అడుతుంటారు. మధు కోసం చంటి కాలేజ్‌కి క్యారేజ్ పట్టుకొని వస్తాడు. బాక్స్ ఇవ్వడానికి అంత దూరం వచ్చావేంట్రా అని అంటే నీ ఆరోగ్యం బాగుంటేనే మేం కూడా ఆరోగ్యంగా ఉంటామని మా అక్క అంటే మాకు ప్రాణం అని అంటాడు. మధు చంటిని హత్తుకొని ఏడుస్తుంది. నా కోసం అంత కష్టపడి నువ్వు తీసుకొచ్చినందుకు ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా తింటాను అంటుంది. చంటి వెళ్లిపోతాడు. మధు బాక్స్ పట్టుకొని వెళ్తుంటే మహి బాల్‌ తగిలి మధు బాక్స్ కింద పడిపోతుంది. మధు కోపంగా బాల్ తీసుకొని వస్తుంది. నీ బాల్ తగిలి నా కోసం 50 కిలోమీటర్లు నుంచి నా తమ్ముడు తీసుకొచ్చిన బాక్స్ పడిపోయిందని అంటుంది. 

మహి, మధు ఇద్దరూ గొడవ పడతారు. క్యాంటీన్‌లో తినమని మహి అంటే మధు డబ్బులు ఇవ్వమని అంటుంది. మధు ప్రిన్సిపల్ సార్ అని పిలవగానే మహి అటు తిరిగితే మధు మహి పర్స్‌లో డబ్బులు తీసుకుంటుంది. పర్స్‌లో  మధు అలియాస్ చిన్ని ఫొటో ఉంటుంది కానీ మధు చూడదు. తర్వాత మధు బాక్స్ దగ్గరకు వెళ్లి చాలా బాధ పడుతుంది. లోహిత వాళ్లు సాయంత్రం మధుమితని ఏడిపిస్తారు. నా గ్యాంగ్‌ని నీ వైపు తిప్పుకుంటా అని అన్నావ్ మర్చిపోయావా అంటుంది. ఇంకెప్పుడు నాతో ఛాలెంజ్ చేయకూడదని నీ చెప్పులతో చెంపలు వాయించుకో అని సెటైర్లు వేస్తుంది. ఎక్కువ చేస్తే నీ చెంపలు పగల గొడతా అని చిన్ని అంటుంది. ఇప్పుడే గెలిచి చూపిస్తా అని నేను వెళ్లి స్కూటీ స్టార్ట్ చేసే లోపు నీ ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకి వస్తారు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!