క్యాలెండర్‌లో ఏడు రోజులకు మారుతుంది. కానీ, టీఆర్పీ రేటింగ్ లిస్టులో ప్రతి వారం ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకునే సీరియల్ మాత్రం మారడం లేదు. నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'కార్తీక దీపం 2' ఈ వారం కూడా టీఆర్పీ రేటింగ్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. మరి, 'స్టార్ మా'లో మిగతా సీరియల్స్ పరిస్థితి ఏంటి? 'జీ తెలుగు'లో ఏయే సీరియల్స్ ఎంత రేటింగ్ సాధించాయి? టీఆర్పీలో టాప్ 10 ప్లేసుల్లో ఏయే సీరియల్స్ ఉన్నాయి? అనేది చూడండి. 

స్టార్ మా ఛానల్‌లో టాప్ 10 లిస్టు...కార్తీక దీపం తర్వాత ప్లేస్ ఎవరిదంటే?'కార్తీక దీపం 2' సీరియల్ ఈ వారం 14.40 రేటింగ్ సాధించింది.‌ దాని దరిదాపుల్లో మరొక సీరియల్ లేదు. దీపం తర్వాత 13.03 టీఆర్పీతో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు', 12.92 టీఆర్పీతో 'ఇంటింటి రామాయణం', 12.41 టీఆర్పీతో 'గుండె నిండా గుడి గంటలు', 8.70 టీఆర్పీ 'చిన్ని' సీరియల్స్ ఉన్నాయి. స్టార్ మా మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'నువ్వుంటే నా జతగా' (7.99), 'బ్రహ్మముడి' (6.89), 'పలుకే బంగారమాయెనా' (6.05), 'నిన్ను కోరి' (5.77), 'మామగారు' (5.74), 'వంటలక్క' (5.33), 'మగువా ఓ మగువా' (5.16), 'పాపే మా జీవన జ్యోతి' (5.12) రేటింగ్ సాధించాయి. టైమింగ్ మారినా టీఆర్పీ రేటింగ్స్ రేసులోకి దూసుకు వచ్చిన బ్రహ్మముడి, ఈసారి స్టార్ మా ఛానల్ లెక్కలు చూస్తే ఏడో స్థానానికి పడింది. ఓవరాల్ లెక్కలు చూస్తే, 'జీ తెలుగు' సీరియల్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే... పదో స్థానంలో ఉంది. 

మళ్లీ మొదటికి 'మేఘ సందేశం'జీ తెలుగులో ఈ వారం 'మేఘ సందేశం' సీరియల్ 7.60 టీఆర్పీ సాధించింది. ఆ తర్వాత 'చామంతి' 7.51 టీఆర్పీ, 'జగద్ధాత్రి' 7.50 టీఆర్పీ సాధించాయి. ఓవరాల్ టీఆర్పీ లెక్కల్లో జీ తెలుగు ఛానల్ సీరియల్స్ నంబర్ ఏడో స్థానం నుంచి మొదలు అయ్యాయి. మొదటి ఆరు స్థానాల్లో స్టార్ మా సీరియల్స్ ఉన్నాయి. ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో పైన చెప్పిన మూడు సీరియల్స్ ఉన్నాయి. 

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'అమ్మాయి గారు', (5.72) 'లక్ష్మీ నివాసం' (6.80), 'అమ్మాయి గారు' (5.72), 'గుండమ్మ కథ' (4.57), 'ఉమ్మడి కుటుంబం' (4.21), 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' (4.41), 'పడమటి సంధ్యారాగం' (5.43), 'దీర్ఘ సుమంగళీభవ' (4.23) టీఆర్పీ సాధించాయి.

ఈటీవీ సీరియల్స్ టీఆర్పీ ఈ మధ్య కాస్త మెరుగైంది. ముఖ్యంగా 'మనసంతా నువ్వే' రేటింగ్ ప్రతి వారం పెరుగుతోంది. ఈ వారం ఆ సీరియల్ 3.98 రేటింగ్ సాధించి సత్తా చాటింది. మరోసారి ఈటీవీలో మొదటి స్థానంలో నిలవగా...  ఆ తర్వాత 3.18 టీఆర్పీతో 'రంగుల రాట్నం', 2.98 టీఆర్పీతో 'బొమ్మరిల్లు', 2.67 టీఆర్పీతో 'ఝాన్సీ', 2.13తో 'అందాల రాక్షసి' టాప్ 5లో నిలిచాయి. 'భైరవి' (1.39), 'సివంగి' (1.09), 'కొత్తగా రెక్కలొచ్చానా' (1.08)... జెమినీ టీవీలో ఈ వారం మూడు సీరియల్ ఒకటి కంటే ఎక్కువ టీఆర్పీ సాధించాయి.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?