బ్రిటీషర్లు భారతీయులను ఎంతగా హింసించారో తెలిసిందే. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతోమంది భారతీయులను బలితీసుకున్న బ్రిటీష్ పాలకులకు.. 1756 సంవత్సరంలో ఎదురైన చేదు అనుభవమే ‘బ్లాక్ హోల్’ ఘటన. మన హిస్టరీలో దీనికి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. బ్రిటీష్ దేశీయులకు మాత్రం ఇది అతిపెద్ద దుర్ఘటన. అదే పెద్ద అమానవీయ ఘటన. కానీ, ‘బ్లాక్ హోల్’ విషాదం బ్రిటీష్ పాలకులను మరింత పుంజుకొనేలా చేసింది. మన దేశంపై దండెత్తి.. దురాక్రమణకు పాల్పడేలా చేసింది. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది?
అది 1756 సంవత్సరం. బ్రిటీషర్లు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా.. వ్యాపార లావాదేవీలు సాగిస్తున్న రోజులు. అప్పటికే దేశంలోని పలు తీర ప్రాంతాల్లో బ్రిటీషర్లు వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని కోటలు, భవనాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక పాలకులతో స్నేహంగా ఉంటూ.. ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలు చేసుకొనేవారు. మరోవైపు తమ స్థావరాలకు రక్షణ కోసం సొంత సైన్యాన్ని కూడా వెంట తెచ్చుకొనేవారు. అయితే.. వారికి కోల్‌కతాలో ఫ్రెంచ్ వ్యాపారులు పెద్ద తలనొప్పిగా మారారు. అది క్రమేనా ఆధిపత్యపోరుకు దారి తీసింది. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ కోల్‌కతాలోని తమ ఫోర్ట్ విలయం కోటకు భద్రత పెంచాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా బ్రిటీష్ సైన్యం కోల్‌కతాలోకి ప్రవేశించింది.
ఫోర్ట్ విలయంలో సైనికీకరణ గురించి తెలుసుకున్న బెంగాల్ సిరాజ్ ఉద్-దౌలా జూన్ 19, 1756న దాదాపు 50,000 మంది సైనికులు, యాభై ఫిరంగులు, 500 ఏనుగులను సమీకరించి కలకత్తాలో భారీ కవాతు చేశాడు. ఈ విషయం తెలిసి స్థానిక బ్రిటీష్ సిబ్బందిలో చాలా మంది నౌకాశ్రయంలోని తమ కంపెనీకి చెందిన ఓడల్లో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు నవాబ్ దళం ఫోర్ట్ విలియంను చుట్టుముట్టింది. అయితే, వారిని ఎదుర్కొనేంత శక్తి, ఆయుధాలు.. బ్రిటీష్ సైన్యం వద్ద లేవు. పెద్దగా సైనిక అనుభవం లేని గవర్నర్, మోర్టార్ల కోసం వాడే గన్ పౌడర్ తేమగా ఉండటంతో సైన్యం చేతులెత్తేశారు. వేరే మార్గం లేకపోవడంతో బ్రిటీష్ సైన్యం కమాండర్ జాన్ జెఫానియా హోల్వెల్ 145 మంది సైన్యంతో 20వ తేదీన నవాబుకు లొంగిపోయారు.
నవాబు వారిని తమతో తీసుకెళ్లకుండా అదే కోటలో గల అతి చిన్న గది(5.2 X 4.2 మీటర్లు)లో వారిని బంధించాడు. 20 మంది కంటే ఎక్కువ మంది పట్టని ఆ గదిలో 146 మందిని లోపలికి కుక్కికుక్కి మరీ తలుపులు మూశారు. ఆ ఇరుకుగదిలో నిలుచోడానికి కూడా చోటులేకపోవడంతో ఒకరిపై ఒకరు నిలబడాల్సి వచ్చింది. తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. అప్పటికే అక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. పైగా తీవ్రమైన ఉక్కపోత. దీంతో చాలామంది ఉక్కిరిబిక్కిరయ్యారు. సాధారణంగా అది చిన్న చిన్న నేరస్థులను బంధించడం కోసం నిర్మించిన జైలు.
కమాండర్ హెల్వెల్ ఓ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘‘రాత్రివేళ మమ్మల్ని ఆ జైల్లో బంధించారు. కొన్ని గంటల తర్వాత వందల మంది తొక్కిసలాటలో చనిపోయారు. మరికొందరు ఊపిరాడక చనిపోయారు. కరుణించాలని వేడుకున్నా.. హేళన చేశారు. మమ్మల్ని చూసి నవ్వుకున్నారు. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఉదయం 6 గంటల సమయంలో సెల్ తలుపులు తెరిచారు. అప్పటికే ఆ గది మొత్తం మృతదేహాల దిబ్బలా మారిపోయింది. 146 మందిలో కేవలం 23 మందే ప్రాణాలతో బయటపడ్డారు.
Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్
భారీ తిరుగుబాటు: ‘బ్లాక్ హోల్’ విషాదం వార్త లండన్‌కు చేరింది. ఆగ్రహంతో ఊగిపోయిన బ్రిటీష్ పాలకులు సహాయక బృందం పేరుతో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని సైన్యాన్ని కోల్‌కతాకు పంపారు. సుదీర్ఘ ముట్టడి తర్వాత 1757లో బ్రిటీషర్లు ఫోర్ట్ విలియాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఏడాది జూన్ నెలలో రాబర్ట్ క్లైవ్ కేవలం 3,000 మంది సైన్యంతో కలిసి ప్లాసీ యుద్ధంలో నవాబ్‌కు చెందిన 50 వేల బలమైన సైన్యాన్ని ఓడించాడు. ప్లాసీలో బ్రిటీష్ వారి విజయం.. ఇండియాలో పెద్ద ఎత్తున వలస పాలనకు బీజం వేసింది. అది 1947లో స్వాతంత్ర్యం వచ్చే వరకు నిరంతరాయంగా కొనసాగింది.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి.
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి