Lack of Sleep Leads to Weight Gain : బరువు తగ్గేందుకు చాలామంది ఫుడ్​ని కంట్రోల్ చేస్తారు. అంతేకాకుండా వ్యాయామాలు చేస్తారు. అయితే రెగ్యూలర్​గా ఏది ఫాలో అయినా కొందరు బరువు తగ్గరు. దానికి గల ప్రధానకారణమే నిద్ర అంటారు. అవును సరైన నిద్ర లేకుంటే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బరువు తగ్గడం కష్టమని చెప్తున్నారు. నిద్ర లేకపోతే.. అది శరీరంలో బరువు తగ్గించే ప్రాసెస్​కి ఆటంకం కలిగిస్తోందని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా బరువు పెరిగేలా చేస్తుంది అంటున్నారు. దాని గురించి అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


సరైన నిద్రలేకుంటే..


ఫిట్​గా ఉండేందుకు అందరూ ప్రయత్నిస్తారు కానీ.. చిన్న విషయాలే కదా అని ఇగ్నేర్ చేసేవే.. మీ ఫిట్​నెస్​ గోల్స్​ని రీచ్​కాకుండా అడ్డుకుంటాయి. వాటిలో నిద్ర ఒకటి. మీరు బరువు తగ్గాలి అనుకుంటే.. ఫుడ్, వ్యాయామ రోటీన్ ఫాలో అవ్వాలి. అయితే మీరు బరువు తగ్గేందుకు నిద్రను అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తోంది. తక్కువ నిద్ర ఉంటే నెగిటివ్​గా, సరైన నిద్ర ఉంటే.. మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి నిద్ర అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి అవసరం. సరైన నిద్రలేదంటే.. మీరు బరువు తగ్గడం కాకుండా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. 


బరువును ప్రభావితం ఎలా చేస్తుందంటే.. 


నిద్రలేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు బాగా పెరుగుతాయి.  ఇది బరువు పెరగడాన్ని బాగా ప్రోత్సాహిస్తుంది. కార్టిసాల్ బరువును పెంచే ప్రధాన హార్మోన్​గా చెప్తారు. కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్​. నిద్రలేకపోవడం వల్ల శరీరంలో  కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. అధిక కార్టిసాల్ స్థాయిలు బరువు తగ్గించే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు వినియోగించేలా చేస్తుంది. 


మెటబాలీజం తగ్గిపోతుంది..


నిద్రలేనప్పుడు శరీరానికి కొవ్వును కాల్చే సామర్థ్యం తగ్గిపోతుంది. దానివల్ల కొవ్వు కరగదు. వ్యాయామం చేస్తున్నా.. మెటబాలీజం పెరగదు కాబట్టి.. కొవ్వు తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు రోజులో కష్టపడుతున్నా.. తక్కువ కేలరీలే బర్న్ చేయగలుగుతారు. 
మెటబాలీజం అనేది కేలరీలను బర్న్ చేయడంలో సహాయం చేస్తుంది. అందుకే బరువు తగ్గే ప్రతి ఒక్కరు మెటబాలీజం పెరిగేందుకు కృషి చేస్తారు. మెటబాలీజం రేటు బాగుంటే.. మీరు ఒకే ప్లేస్​లో కదలకుండా కూర్చొన్నా.. కేలరీలు బర్న్ అవుతూ ఉంటాయి. అందుకే మెటబాలీజం సరిగ్గా ఉండాలి అంటారు. జీవక్రియ వేగంగా ఉంటే.. బరువు వేగంగా తగ్గుతారు. అయితే తక్కువ నిద్ర అనేది జీవక్రియ రేటును తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. 


అంతేకాకుండా సరైన నిద్ర లేకుండా బరువు తగ్గడం అటుంచి.. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. శరీరానికి సరైన విశ్రాంతి అందినప్పుడే.. ఆరోగ్యం బాగుంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా.. అవి నిద్రలో హీల్ అవ్వడానికి సహాయం చేస్తుంది. సరైన నిద్రలేకపోతే.. ఆరోగ్య సమస్యలు త్వరగా తగ్గవు. అందుకే కంటి నిండా నిద్రపోవాలి అంటున్నారు. 


Also Read : బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో బరువుతో పాటు ఆ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.. కాకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్​ కూడా ఉంటాయట