Side Effects of Bulletproof Coffee : చాలామంది కాఫీని ఎక్కువగా తాగుతారు. అయితే హెల్తీగా ఉండాలనుకునేవారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎక్కువగా తాగుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎక్కువ తాగేందుకు చూస్తారు. దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని డైటీషియన్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొందరు దానిని తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు. ఇంతకీ ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. 


బుల్లెట్ ప్రూఫ్ కాఫీనిని కీటో కాఫీ లేదా బటర్ కాఫీ అని కూడా అంటారు. దీనిలో హెల్తీ ఫ్యాట్స్​తో తయారు చేస్తారు. అందుకే దీనిని ఎనర్జీ డ్రింక్​గా తీసుకుంటారు. ఇది శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలు, కొవ్వులను అందిస్తుంది. ఇది ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచి.. అన్ హెల్తీ స్నాక్ తీసుకోకుండా చేస్తుంది. ఆకలిని తగ్గించి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని చెడు కొవ్వును బయటకు పంపేస్తుంది. 


బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు 


బుల్లెట్ ప్రూఫ్ కాఫీ రోజంతా మీకు శక్తిని అందిస్తూ.. రక్తంలోని చక్కెర స్థాయులను కంట్రోల్ చేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కిటోసిన్​ను ప్రేరేపిస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి.. శక్తి వనరుగా మార్చి.. ఎనర్జీగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరిచేరవు. వేగంగా, హెల్తీగా బరువు తగ్గే అవకాశముంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో ఉపయోగించే బటర్, నెయ్యి వంటి పదార్థాలు కీటోసిన్​ను ప్రేరేపించి.. ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహమున్నవారు కూడా దీనిని తాగవచ్చు. 


ఈ కాఫీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరోటిన్, విటమిన్ ఏ,డి,ఈ, కె వంటి విటమిన్​లు పోషకాలను శరీరానికి అందజేస్తాయి. అంతేకాకుండా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గట్ ఆరోగ్యం మెదడుపై మంచి ప్రభావం చూపిస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల కూడా అదే జరుగుతుంది. గట్ ఆరోగ్యంగా ఉండడం వల్ల పని చేయడంలో ఫోకస్ పెరుగుతుందట. కొన్ని రకాల కాలేయ వ్యాధులను, టైప్ 2 డయాబెటిస్ వంటి వాటిని దూరం చేస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. 


సైడ్ ఎఫెక్ట్స్ ఇవే


బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవడం వల్ల చాలామంది కడుపు నిండుగా ఫీలవుతారు. దానివల్ల బ్రేక్​ఫాస్ట్ తీసుకోరు. గంటల తరబడి మీరు నిండుగా ఉన్నా.. సాధారణ శరీర పనితీరుకు అవసరమయ్యే పోషకాలు పొందలేకపోవచ్చు. రోజువారి కంటే ఎక్కువ కొవ్వు తీసుకునే అవకాశం కూడా ఉంది. కెఫీన్​ను రెగ్యూలర్​గా తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. పైగా ఎక్కువగా తీసుకుంటే హార్మోన్లపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశముంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీని.. ఉదయాన్నే ఓ కప్పు తీసుకుంటే సరిపోతుంది. అంతకుమించి తీసుకుంటే మంచి ప్రభావాలు కంటే.. చెడు ప్రభావాలే ఎక్కువ అవుతాయి. 


Also Read : ఎముక విరిగినప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది.. ఆ ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదట




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.