Jackie Shroff seeks court to protection from misuse of name word Bhidu: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బి-టౌన్‌లో అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి స్టైల్, మ్యానరిజం, డైలాగ్ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెరపై ఆయన ఎంట్రీ సీన్‌కు వచ్చిందంటే థియేటర్లో ఈళలు పడాల్సిందే. అంతగా తన యాక్టింగ్ స్కిల్, స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరు విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి, పేరుకు రక్షణ కల్పించాలని కోరుతూ మంగళవారం (మే 14) హైకోర్టులో పిటిషన్ వేశారు.
అనుమతి లేకుండా కొన్ని సంస్థలు తన పేరును వాడుకుంటున్నారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పటిషన్ ప్రకారం.. తన ముద్దు భీడు పేరుకు రక్షణ కల్పించాలని, అనధికారికాంగా తన పేరు వాడుకుంటున్న పలు సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పటిషన్‌లో డిమాండ్ చేశారు. "కొందరు నా పేరు, వాయిస్, పర్సనాలిటి వాడుకుంటున్నారు. కొన్ని అనాధికారికంగా కొన్ని సంస్థలు నాపేరు భీడు, వాయిస్, ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నాయి. కొందరైతే నా వాయిస్‌ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక పర్సనాలిటీపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇది నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నా గుర్తింపుకు రక్షణ కల్పించాలి" అని జాకీ ష్రాఫ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అలాగే ఇలా చేయడం వల్ల జాకీ ష్రాఫ్ ప్రతిష్ట ఎలా దెబ్బతింటుంది, దాని వల్ల ఆయన వ్యక్తిత్వంపై చూపే ప్రభావాలపై జాకీ తరపు లాయర్ ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు వివరించారు. తమ హక్కులకు భంగం కలగకుండా దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టు కోరారు. ఈ మేరకు హైకోర్టు సదరు సంస్థలకు లీగల్ నోటిజులు జారీ చేసింది. అలాగే ఆయన వ్యక్తిగత హక్కులు ఉల్లంఘించిన సదరు సంస్థలకు సంబంధించిన అన్ని లింక్‌లను తొలగించాలని MEITY (టెక్నాలజీ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ)ని కోర్టు ఆదేశించింది. ఈ పటిషన్‌కు సంబంధించిన విచారణను రేపు మే 15వ తేదీకి పొడగిస్తూ తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.