Yoga Techniques to Reduce Anxiety and Depression : వేగంగా మారుతున్న ప్రపంచంలో మానసిక ఆరోగ్యం కూడా వేగంగా దెబ్బతింటుంది. దీనివల్లే చాలామందిలో డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే ఆగండి. కాస్త బ్రేక్ తీసుకుని.. బ్రీత్ తీసుకోండి. ఇది మీరు ఒత్తిడిని తగ్గించుకుని.. మీతో మీరు తిరిగి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ధ్యానం, సింపుల్ యోగా టెక్నిక్స్‌తో డిప్రెషన్‌ను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు యోగా నిపుణులు. కొత్త సంవత్సరంలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే.. ఫాలో అవ్వాల్సిన సింపుల్ యోగా టెక్నిక్స్ (Yoga Practices to Reduce Depression) ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ధ్యానంతో డిప్రెషన్ ఎలా దూరమవుతుందంటే..
డిప్రెషన్ అనేది మనస్సును ఒకే విషయంపై మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేస్తుంది. వ్యక్తిగత విమర్శకు దారి తీస్తుంది. ఎమోషనల్‌గా వీక్ చేసి.. అదే లూప్‌లో ఉండేలా చేస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిదని చెప్తున్నారు యోగా నిపుణులు. ఇది గతం, లేదా ఫ్యూచర్ గురించి కాకుండా ప్రెజంట్లో ఉండేలా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. శ్వాస తీసుకోవడం, శరీర అనుభూతులు.. కదలిక లేదా ధ్వనిపై దృష్టి సారించడం ద్వారా.. మనస్సులోని ప్రతికూల ఆలోచనలు దూరం అవుతూ ఉంటాయి. రెగ్యులర్‌గా చేస్తే మానసిక స్థితి మెరుగవ్వడం, ఒత్తిడి తగ్గడం జరుగుతుంది. మెరుగైన నిద్రకు హెల్ప్ చేస్తుంది. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌గా ఉండగలుగుతారు.
డిప్రెషన్‌ను దూరం చేసే టెక్నిక్స్
యోగా అనేది శారీరక కదలిక, శ్వాస నియంత్రణ, ధ్యానాన్ని మిళితం చేస్తుంది. కొన్ని టెక్నిక్స్ భావోద్వేగ విడుదల అంతర్గత సమతుల్యత, నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తాయి. సరైన పద్ధతిలో అవలంభిస్తే యోగా ద్వారా మానసిక, శారీరక శ్రేయస్సు మెరుగవుతుంది.
- శ్వాసపై అవగాహన : శ్వాసపై అవగాహన ముఖ్యం. ధ్యానం చేసేప్పుడు శ్వాస, ఉచ్ఛ్వాసపై దృష్టి సారించాలి. మీరు ఓ చోట కూర్చోని బ్రీత్ తీసుకోలేకపోతున్నప్పుడు.. మీరు రోజువారి పనులు చేసేప్పుడు మీ బ్రీతింగ్‌పై ఫోకస్ చేయండి. కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు మీరు ఎలా బ్రీత్ తీసుకుంటున్నారనే దానిపై ఫోకస్ చేయండి. దానికి మీ శరీరం ఎలా రెస్పాండ్ అవుతుందో తెలుసుకోండి. దీనివల్ల మీకు తెలియకుండానే నెగిటివ్ థాట్స్ దూరమవుతాయి. ప్రశాంతంత పెరుగుతుందని చెప్తున్నారు.
- ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ : ఈ టెక్నిక్‌లో శ్వాసపై దృష్టి పెట్టడానికి బదులుగా.. మనస్సును శాంతపరచడానికి పునరావృతమయ్యే ధ్వని లేదా మంత్రాన్ని ఉపయోగిస్తారు. లయబద్ధమైన మ్యూజిక్ లేదా మంత్రం మానసిక గందరగోళాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. లోతైన విశ్రాంతిని అందిస్తుంది. కాలక్రమేణా ఒత్తిడి తగ్గడానికి, మానసిక స్థితి మెరుగుపడటానికి హెల్ప్ చేస్తుంది.
- నడిచేప్పుడు ధ్యానం : నడకతో చేసే ధ్యానం సున్నితమైన కదలికతో మైండ్‌ఫుల్ అవగాహనను పెంచుతుంది. ప్రతి అడుగు వేసేప్పుడు.. శ్వాస, శారీరక అనుభూతిపై శ్రద్ధ చూపించాలి. ఇది మనస్సును శాంతపరిచే ధ్యాన లయను సృష్టిస్తుంది. ఇది మిమ్మల్ని ప్రెజెంట్లో ఉండేలా చేస్తుంది.
- మైండ్‌ఫుల్ వర్క్స్ : ఇంటిని శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం లేదా తోటపని వంటి పనులు శరీరాన్ని పూర్తిగా కదలికలో ఉండేలా హెల్ప్ చేస్తాయి. ఇవి మనస్సును శాంతపరచగలవు. ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.
- జపం : జపం దృష్టిని కేంద్రీకరించడానికి, మనస్సును శాంతపరచడానికి హెల్ప్ చేస్తుంది. పదాలు లేదా శబ్దాలను పునరావృతం చేయడం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు. లేదా నెంబర్స్ లెక్కపెట్టవచ్చు.
ఈ టెక్నిక్స్ అన్ని మిమ్మల్ని ఆందోళనకు దూరం చేయడంలో, ప్రెజెంట్లో మైండ్ ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అయితే పరిస్థితి తీవ్రతను బట్టి మెడికల్ హెల్ప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్‌గా యోగా చేయడం వల్ల సమస్యను చాలావరకు దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.