శృంగారాన్ని తప్పుగా భావించే రోజులు పోయాయి. కానీ, ఇప్పటికీ కొందరిలో బిడియం, భయం లైంగిక జీవితాన్ని దూరం చేస్తోంది. చెప్పాలంటే శృంగారం అనేది శారీరక అవసరం కాదు, అది నిత్యవసరం. జీవించేందుకు ఆహారం, నీరు, ఆరోగ్యానికి వ్యాయామం, యోగా వంటివి ఎంత అవసరమో లైంగిక ఆనందం కూడా అంతే అవసరం. ఎందుకంటే.. శృంగారమనేది మనిషిని శరీరకంగానే కాదు, మానసికంగానూ దృఢంగా ఉంచుతుంది. అయితే, ఈ విషయం మీద ఎవరికీ పెద్ద అవగాహన లేదు. ఆలు మగల కలయికను కేవలం ఒక కోరికగానే పరిగణిస్తున్నారు. అందుకే ఏటా ఫ్రిబవరి 12న సెక్స్, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు లైంగిక, ఆరోగ్య పునరుత్పత్తి అవగాహన దినం(Sexual and Reproductive Health Awareness Day) నిర్వహిస్తున్నారు.  


చాలామందికి లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STD) మీద అవగాహన లేదు. అలాగే స్త్రీ, పురుషుల్లో ఏర్పడే జననేంద్రియ సమస్యలు గురించి కూడా పెద్దగా తెలియదు. కారణం.. వీటి గురించి ఎక్కువగా తెలుసుకోకపోవడం లేదా తగిన సమాచారం లేకపోవడం. అందకే మీకు ఇప్పటివరకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. 


ఒత్తిడి వల్లే కలయికకు దూరం: వైద్య నిపుణులు, వివిధ అధ్యయనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎక్కువ మంది ఒత్తిడికి గురికావడానికి కారణం తక్కువ కలయికకు దూరం కావడం. ఈ సమస్యను హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్ యాక్సిస్ (HPA యాక్సిస్) అని అంటారు. హైపోథాలమస్ అనేది మీ మెదడులో హార్మోన్లను నియంత్రించే ఒక గ్రంథి. ఇది మెదడులోని పిట్యూటరీ గ్రంధికి హార్మోన్లను విడుదల చేస్తుంది. అక్కడి నుంచి శరీరంలోని వివిధ అవయవాలకు హార్మోన్లు సరఫరా అవుతాయి. ఒత్తిడి సమయంలో ఇది సమతుల్యతను మారుస్తుంది. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా సెరోటోనిన్‌ను తగ్గిస్తుంది. కార్టిసాల్ పెరిగినప్పుడు, లైంగిక హార్మోన్లతో సహా హార్మోన్లు తగ్గుతాయి లేదా అసమతుల్యత చెందుతాయి. ఇది టెస్టోస్టెరాన్ను ప్రభావితం చేస్తుంది. తక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల సెక్స్ మీద ఆసక్తి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో వారం కనీసం రెండు లేదా మూడు సార్లు లైంగిక కలయిక అవసరం. దీనివల్ల శరీరానికి అవసరమైన హార్మోన్లు ఉత్తత్తి జరిగి ఒత్తిడి తగ్గుతుంది. అందుకే దీన్ని స్ట్రెస్ బస్టర్ అని కూడా అంటారు. అలాగే.. ఒత్తిడి వల్ల కలయిక మీద ఆసక్తి తగ్గిపోయే అవకాశాలు కూడా తగ్గుతాయి. అయితే, కోవిడ్ కలిగించిన ఒత్తిడి వల్ల చాలామందిలో శృంగారం మీద ఆసక్తి తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే.. కేవలం శృంగారం మాత్రమే మందు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


ఒత్తిడి దూరమై.. లైంగిక ఆనందాన్ని పొందాలంటే.. 


❤ కలయికలో ఆనందం పొందాలంటే ముందుగా ఒత్తిడి దూరం చేసుకోవాలి. ఇందుకు శరరీంలో ‘సెరోటోనిన్’ అనే హార్మోన్‌ను యాక్టీవ్ చేయాలి. 
❤ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కోసం మంచి ఆహారం, నిద్ర అవసరం. తగినంత నీరు తాగాలి. 
❤ బంధువులు, స్నేహితులను కలవడం, వారితో సరదాగా గడపడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. 
❤ ఒంటరిగా ఉంటూ ఆలోచనలతో గడిపేయొద్దు. ఆ సమయాన్ని వీలైతే నిద్రపోవడానికి కేటాయించండి. 
❤ ఆల్కహాల్, స్మోకింగ్ మానేయండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. 
❤ తక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్, తక్కువ షుగర్ ఉండే ఆహారాన్నే తీసుకోండి. 
❤ వ్యాయమం కూడా లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తుంది.
❤ రోజుకు 30 నిమిషాల కంటే ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌ను ఉత్పత్తవుతాయి. 
❤ మంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శరీరారానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.


శృంగారం ఆపేయడం వల్ల కలిగే సమస్యలు ఏమిటీ?


❂ కలయిక వల్ల నిమిషానికి 5 క్యాలరీలు కరుగుతాయి. ఇది దాదాపు రోజూ వాకింగ్ చేయడంతో సమానం. 
❂ శృంగారం తక్కువగా చేసేవారిలో జ్ణాపకశక్తి తగ్గిపోతుందట. 
❂ తక్కువ లైంగిక కోరికలు ఉండే పురుషుల్లో అంగ స్థంభన సమస్యలు పెరుగుతాయట.
❂ లైంగికంగా కలవడం ఆపేస్తే బీపీ పెరుగుతుంది.  
❂ శృంగారం చేయకపోవడం వల్ల శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. 
❂ కలయిక వల్ల శరీరంలో వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే ఇమ్యునోగ్లోబిన్-ఏ పెరుగుతుంది. శృంగారం ఆపేస్తే అది క్షీణిస్తుంది. 
❂ నెలలో సుమారు 20 రోజులు స్కలనం చేసే వారితో పోలిస్తే.. నెలకు ఏడు సార్లు కన్నా తక్కువ స్కలనం చేసే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. శృంగారం చేయకపోయినా కనీసం హస్త ప్రయోగం చేయడం బెటర్ అని సూచిస్తున్నాయి.
❂ కలయిక మీ శరీరంలో ఒత్తిడి తగ్గించే హార్మోన్ల విడుదలను తగ్గిస్తుంది. శృంగారానికి దూరమైనప్పుడు.. వాటి ఉత్పత్తి తగ్గి ఒత్తిడికి గురవ్వుతారు.
❂ వారంలో 2 లేదా 3 సార్లు సెక్స్ చేసేవారితో పోల్చితే నెలలో ఒకటి లేదా, రెండు సార్లు చేసేవారిలో గుండె జబ్బులు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
❂ కలయిక వల్ల శరీరానికి వ్యాయమం లభిస్తుంది. దాని వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. 
❂ శృంగారం ఆపేయడం వల్ల శృంగార సమస్యలు వస్తాయి. స్త్రీలలో రుతుక్రమం ఆగిపోతుంది. యోని కణజాలం సన్నగా మారడమే కాకుండా పొడిబారిపోతుంది. ఎప్పుడైనా శృంగారం చేయడానికి ప్రయత్నిస్తే నొప్పితో విలవిల్లాడతారు. ఫలితంగా కలయికకు మరింత దూరమవుతారు. 
❂ శృంగారం ఆపేస్తే నిద్ర పట్టేందుకు అవసరమైన ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదల కావు. మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. 


Also Read: అరే ఏంట్రా ఇదీ, బోరుకొడుతోందని రూ.7 కోట్ల పెయింటింగ్‌తో సెక్యూరిటీ గార్డు చిలిపి పని!
Also Read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?