తూర్పు గోదావరి జిల్లా (East Godavari)లో  ప్రముఖ పుణ్య క్షేత్రం  అయిన అంతర్వేది () లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి  కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు సాగిన కల్యాణ మహోత్సవాల్లో భాగంగా భీష్మ ఏకాదశి రోజున కీలక ఘట్టమైన స్వామి వారి కల్యాణోత్సవాన్ని (Sri Lakshmi Narasimha swamy Kalyanam) జరిపించారు. శుక్రవారం అర్ధరాత్రి 12గంటల35 నిమిషాలకు మృగశిర నక్షత్ర వృశ్చిక లఘ్నంలో శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణంజరిపించారు.


కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులతో అంతర్వేది కిక్కిరిసింది. ఈ మహోత్సవానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు వరప్రసాద్‌, కూడిపూడి చిట్టిబాబు వేడుకలో పాల్గొన్నారు.  తీర్ధ మహోత్సవాలకు వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 2:35 ని.లకు రథోత్సవం నిర్వహించనున్నారు.


Also Read: త్యాగం, శీలం, శౌర్యం, నీతి, నియమం, నిష్టలో భీష్ముడికి సరిలేరెవ్వరూ
అంతర్వేది గురించి మరిన్ని విషయాలు



  • సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పారట. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు.

  • వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.

  • త్రేతాయుగంలో... శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తుంది.

  • ద్వాపర యుగంలో పాండవ మధ్యముడు అర్జనుడు తీర్ధయాత్రలు చేస్తూ 'అంతర్వేది' దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన 'విజయయ విలాసము'లోను, శ్రీనాధ కవిసార్వభౌముడు 'హరివిలాసం'లోను వర్ణించారు.

  •  ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీస్తుశకం  300 ఏళ్ళకు పూర్వం నిర్మించారట. మొదట్లో మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేఈ ఆలయం ప్రస్తుతం ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తోంది.

  • ఏటా మాఘమాసంశుద్ధ సప్తమి నుంచి బపుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం, ఏకాదశినాడు స్వామివారి రధోత్సవం జరుగుతాయి.

  • వైశాఖమాసంలో శుద్ధ చతుర్దశినాడు లక్ష్మీనృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి.

  • సంతానం లేని వారు స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. ఇక్కడ వుండి, రాత్రి తడి బట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. 


Also Read: తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడిన హిడింబి