మధ్య కాలంలో నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. చాలామంది త్వరగా నిద్ర పట్టడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ కరణా రాజన్ తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. తాను డాక్టర్‌గా వృత్తి మొదలు పెట్టిన కొత్తలో నిద్రలేమితో బాధపడ్డానని చెప్పారు. అయితే ఆ సందర్బంలో తాను కాస్త ప్రతికూలమైన హ్యాక్ ఒకదాన్ని ట్రై చేశానని, అది రివర్స్ సైకాలజి లాంటి లేదా పారాడాక్సికల్ ఇంటెన్స్ తో కూడిందని తెలిపారు. అది పనిచేస్తుందని తాను అనుకోలేదని, కానీ ఆశ్చర్యంగా అది తనకు చాలా త్వరగా నిద్రలోకి జారుకునేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నారు.


‘‘నిద్ర రావడం లేదు అని అనిపించగానే.. ‘ఇక నేను నిద్రపోను’ అనుకోండి. అలా అని బుక్ చదడమో, టీవీ చూడడమో, ఫోన్ స్క్రోల్ చెయ్యడం లాంటివేవీ చెయ్యకూడదు. సింపుల్ గా నేను నిద్రపోను అని అనుకోవాలి అంతే. ఇదెలా అంటే మంచం మీద పడుకొని మిమ్మల్ని మీరు ఇక నిద్ర పోకూడదు అని బలవంత పెట్టడం లాంటిదన్న మాట. నిద్రపోవద్దు పోవద్దు అని మీకు చెప్పుకుంటూ ఉండండి. చాలా సార్లు మీరు అలసి పోయి ఉంటారు.. నిద్రపోవద్దు అని చెప్పడం ద్వారా పదేపదే నిద్రను గుర్తు చేస్తుంటారు. నిద్ర పోవద్దు అనే సూచన ఇచ్చిఇచ్చి అలసిపోయి.. మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు’’ అని డాక్టర్ రాజన్ తెలిపారు.


‘‘ఎవరైనా మీకు దేని గురించైనా ఆలోచించవద్దు అని చెబితే.. ముందుగా మీ ఆలోచనలోకి వచ్చేది ఏమిటి? దేని గురించి ఆలోచించకూడదో అదే కదా. అలాంటిదే ఈ రివర్స్ సైకాలజీ కూడా’’ అని తెలిపారు. త్వరగా నిద్రలోకి జారుకునేందుకు మరో చిన్న చిట్కా కూడా ఆయన ఆ వీడియోలో పంచుకున్నారు. దానికి ఆయన 10- 3-2-1 మెథడ్ అని పేరుపెట్టారు. నిద్రకు ఉపక్రమించేందుకు 10 గంటల ముందు నుంచి కెఫిన్ వాడకూడదు. పడుకోవడానికి 3 గంటల ముందు నుంచే లార్జ్ మీల్స్ కి గుడ్ బై చెప్పాలి.


మీరు నిజంగా నిద్రలేమితో బాధ పడుతున్నారో తెలుసుకోవాలనుకుంటే కింది లక్షణాల్లో ఏవైనా మీకు ఉన్నాయోమో పరిశీలించి చూసుకుంటే మంచిది.



  • నిద్ర పోవడానికి కష్ట పడడం

  • రాత్రి చాలా సార్లు మెలకువ వచ్చి తిరిగి నిద్ర పట్టేందుకు సమయం పట్టడం

  • మంచి మీద కళ్లు తెరచుకుని నిద్ర కోసం వేచి ఉండడం

  • ఉదయం త్వరగా మేల్కొన్నప్పటికీ రాత్రి త్వరగా నిద్రపోలేక పోవడం

  • అలసి పోయినా సరే నిద్ర కోసం వేచి ఉండాల్సి రావడం

  • పొద్దున్న నిద్ర లేచినపుడు కూడా తాజాగా అనిపించకపోవడం

  • పగటి పూట అలసటగా చికాకుగా అనిపించడం


ఈ లక్షణాలతో పాటు పని మీద ఏకాగ్రత కుదరకపోవడం, ఎప్పుడూ మూడ్ సరిలేకపోవడం, విసుగ్గా అనిపించడం, చేసే పని నాణ్యత తగ్గడం ఇలా రకరకాల సమస్యలు నిద్ర లేమి వల్ల కలుగుతాయి. ఈ డాక్టర్ సూచించిన చిట్కాలు తప్పకుండా పనిచేస్తున్నాయని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు. మీరూ ట్రై చేసి చూడండి.


Also read : మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.