Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఎప్పటికప్పుడు డయాలసిస్ చేయించుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడు ప్రసాద్. మధ్యలో ఒకటి రెండు సార్లు ఆరోగ్యం కాస్త సహకరించడంతో జబర్దస్త్ లో కొన్ని స్కిట్ లలో కనిపించాడు. మళ్లీ ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. అసలు పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఇంతలా పావడానికి గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు ప్రసాద్. 


బిపి ఉందని నాకు తెలియదు, అదే కారణం: పంచ్ ప్రసాద్


పంచ్ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చాడు. తనకు ముందు నుంచీ బిపీ(బ్లడ్ ప్లెజర్) ఉందని. బీపీ ఉన్న సంగతి తనకు తెలియలేదని అన్నాడు. అసలు వయసులో ఉన్న వాళ్లకు బీపీ ఎందుకు వస్తుంది అనే భ్రమలో ఉండేవాడినని అన్నాడు. స్కిట్ లు చేస్తున్నపుడు కూడా తనకు కోపం ఎక్కువగా వచ్చేదని, అయితే స్కిట్ లలో టెన్షన్ ల వల్ల అలా వస్తుంది అని అనుకునేవాడినని చెప్పాడు. తనకు అప్పుడప్పుడు ముక్కులోనుంచి కూడా రక్తం వచ్చేదని అయితే అలా చాలా సార్లు వచ్చిందని ఇది మామూలుగానే వస్తుందని అనుకున్నానని అన్నాడు. అయితే సునీతతో ఎంగెజ్మెంట్ అయిన తర్వాత ఓ సారి ముక్కులోనుంచి రక్తం వచ్చిందని, అది సునీత భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లిందని, తర్వాత అసలు విషయం బయటపడిందని చెప్పాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని డాక్టర్లు చెప్పారని చెప్పాడు. తర్వాత తన ఆరోగ్యం బాగా పాడైందని చెప్పుకొచ్చాడు ప్రసాద్. అయితే పెళ్లికి ముందే తనకు ఈ సమస్య ఉందని తెలిసినా కూడా సునీత తనను పెళ్లి చేసుకుందని, ఇప్పటికీ తనకు అండగా ఉంటూ వస్తుందని అన్నాడు. తన వల్ల తన భార్య చాలా కష్టాలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.


సర్జరీ చేయకపోతే కష్టం..


పంచ్ ప్రసాద్ కు ఎప్పటికప్పుడు డయాలసిస్ చేస్తూ వస్తున్నారు. డయాలసిస్ చేయించుకుంటూనే పలు సార్లు స్కిట్ లు కూడా చేశాడు ప్రసాద్. అయితే ఇప్పుడు పంచ్ ప్రసాద్ ఆరోగ్యం పూర్తిగా పాడైందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని ఇటీవల కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మధ్య కాలంలో ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని ప్రసాద్ కు వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయాలని చెప్పారని చెప్పాడు. ఆపరేషన్ చేయకపోతే ఏ క్షణం ఏమైనా జరగవచ్చని డాక్టర్లు చెప్పినట్టు తెలిపాడు. దీంతో పంచ్ ప్రసాద్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు.


పంచ్ ప్రసాద్ కు అండగా ఏపీ ప్రభుత్వం..


పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కోసం చాలా డబ్బు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని నూకరాజు చెప్పాడు. అందుకే దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. కిడ్నీలు పూర్తిగా పాడవడంతో కొత్త సమస్యలు కూడా వస్తున్నాయని ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ప్రయోజనం లేదని అన్నాడు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాలను పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ట్యాగ్ చేశాడు. దీనిపై హరికృష్ణ స్పందించారు. ఇప్పటికే తమ టీమ్ పంచ్ ప్రసాద్ ఫ్యామిలీ తో మాట్లాడుతుందని వెల్లడించారు. అతని ఫ్యామిలీతో  లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పారు. దీంతో పంచ్ ప్రసాద్ కు ఆ సాయం అంది త్వరలోనే ఆపరేషన్ జరిగి ఆయన పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు నెటిజన్స్.