Pregnancy Complications with Lack of Sleep : నిద్ర ప్రతి ఒక్కరికి అవసరమైన అతి ముఖ్యమైన చర్య. ముఖ్యంగా అమ్మాయిలు కంటినిండా నిద్రపోవాలని చెప్తున్నారు నిపుణులు. తాజా అధ్యయనాలు కూడా ఆడవారి నిద్రపై అనేక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. మగవారి కంటే ఆడవారు ఎక్కువ సేపు నిద్రపోవాలని ఓ అధ్యయనం తేలిస్తే.. ఆడవారిలో నిద్ర తక్కువైతే ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది మరో అధ్యయనం. దాని గురించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లేట్‌గా పడుకుంటే..
అమ్మాయిలు రాత్రుళ్లు లేట్‌గా పడుకుంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ విషయంలో పెద్ద సమస్యలు వస్తాయని తెలిపింది తాజా అధ్యయనం. రీసెంట్గా చేసిన ఓ స్టడీలో 61 శాతం ఇండియన్స్‌లో రాత్రి నిద్ర తక్కువగా ఉన్నట్లు తేలింది. దాదాపు 61 శాతం మంది ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు గుర్తించారు. అయితే వీరిలో మగవారి కంటే ఆడవారి సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలా లేట్ నైట్ పడుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు.. అమ్మతనానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.
అసలు కారణాలు ఇవే..
రాత్రుళ్లు అమ్మాయిల్లో నిద్రలేకపోవడానికి అత్యంత ప్రధానకారణాలు ఇవేనంటూ కొన్ని విషయాలు తెలిపారు. అధిక ఒత్తిడి, యాంగ్జైటీకి గురికావడం ఒక రీజన్ అయితే.. పని భారం ఎక్కువ అవ్వడం మరోసమస్యగా చెప్తున్నారు. ఈ రెండిటి వల్ల చాలామంది అమ్మాయిలు తమ నిద్రకు దూరమవుతున్నారని తెలిపారు నిపుణులు.
పెరుగుతోన్న మొబైల్ వాడకం
ఇలా నిద్రకు దూరమవుతున్న సమయంలో మొబైల్‌ని ఎక్కువగా వాడేస్తున్నారు. దీనివల్ల వారి నిద్ర మరింత తక్కువ అవుతుంది. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోకపోతే.. మెదడు, గుండె సమస్యలతోపాటు ఇమ్యూనిటీపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గి.. వివిధ ఆరోగ్య సమస్యలు, ప్రాణాంతక సమస్యలు పెరుగుతాయి. వాటిలో ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా ఒకటి.
ప్రెగ్నెన్సీ సమస్యలు
అవును నిద్ర తక్కువ కావడం వల్ల ఆడవారిలో ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయట. కొందరు తల్లి అనే పదానికి దూరమయ్యే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. టీనేజర్స్‌లో పీరియడ్స్ సమస్యలు పెరుగుతాయట. ఇర్రెగ్యూలర్ పీరియడ్స్, బ్లడ్ డిశ్చార్జ్ ఎక్కువ లేదా తక్కువ కావడం వంటి సమస్యలు పెరుగుతాయట. ప్రధానంగా ఇవి పీసీఓఎస్, పీసీఓడి వంటి సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు ఇవి క్రమంగా ప్రెగ్నెన్సీ సమస్యలను పెంచుతాయని తెలిపింది తాజా అధ్యయనం.
ఫాలో అవ్వాల్సిన టిప్స్
దీనికి పరిష్కారం కావాలనుకుంటే రోజూ కచ్చితంగా 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు దూరమై.. ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా తగ్గుతాయి. ఆడవారే కాకుండా మగవారు కూడా నిద్ర విషయంలో ఎలాంటి రాజీపడకూడదని సూచిస్తున్నారు. అయితే మహిళలు మాత్రం వివిధ కారణాలతో నిద్రకు దూరం పెట్టొద్దని.. రాత్రుళ్లు కంటినిండా నిద్రపోవాలని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.