Understanding Egg Freezing : ఈ మధ్యకాలంలో ఎగ్ ఫ్రీజింగ్(Egg Freezing) అనే వర్డ్ బాగా ఎక్కువగా వినిపిస్తుంది. సెలబ్రెటీలు ఈ ట్రెండ్​ని ఎక్కువగా ఫాలో అవుతుండడంతో దీని గురించి తెలుసుకోవాలన్నా క్యూరియాసిటీ ప్రజల్లో పెరుగుతుంది. అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్​ని పెళ్లికాకముందే చేసుకోవచ్చా? దీనివల్ల ఉపయోగమేమిటి? ఏ వయసు వరకు ఈ తరహా ఎగ్ ఫ్రీజింగ్​ని చేసుకోవచ్చు? దీనికి ఎక్స్​పైయిరీ డేట్ ఏమైనా ఉంటుందా? అసలు ఎగ్​ ఫ్రీజింగ్ అంటే ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఎగ్ ఫ్రీజింగ్ అంటే..


ఎగ్ ఫ్రీజింగ్​ని ఓసైట్ క్రయోప్రెజర్వేషన్ (oocyte cryopreservation) అని కూడా అంటారు. అంటే ఫ్యూచర్​కోసం మహిళలు తమ ఎగ్​ని ఫ్రీజ్ చేసుకోవడం. ప్రెగ్నెన్సీని వయసులో ఉన్నప్పుడు కాకుండా.. కాస్త లేట్​గా ప్లాన్ చేసుకోవాలనుకునేవారికోసం ఈ ప్రక్రియ ఉంది. దీనిని ఎందుకు చేస్తారంటే.. 30 దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. కానీ ఎర్లీ 30లలో ఎగ్ క్వాలిటీ బాగుంటుంది. అందుకే 30 కంటే ముందే క్వాలిటీ ఎగ్​ను ప్రిజర్వ్ చేసుకుంటారు. దీనిని ఫ్యూచర్​లో ప్రెగ్నెన్సీకోసం వాడుకుంటారు. లేట్ 30, 40 ఏళ్లలో ఈ ఎగ్​ని వాడుకోవచ్చు. 


ఏ వయసులో..


ఎగ్ ఫ్రీజింగ్​ని లేట్ 20 ఏళ్ల నుంచి ఎర్లీ 30లలో చేసుకోవచ్చు. ఈ సమయంలో ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి డాక్టర్లు అప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలని సూచిస్తారు. అయితే ఈ ఎగ్​ని పదేళ్లు వరకు ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు 29లో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే.. దానిని మీరు 39 వరకు స్టోర్ చేసుకుని.. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి లీగల్ ఏజ్ 21. పెళ్లి అయినా కాకున్నా.. 21 ఏళ్ల తర్వాత ఏ మహిళ అయినా తన ఎగ్​ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. 



ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఇదే..


ఎగ్ ఫ్రీజింగ్ అనేది స్టిమ్యూలేషన్ (Ovarian Stimulation) చేసి.. హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. పది నుంచి పన్నెండు రోజులు ప్రాసెస్​కి సంబంధించిన ఇంజెక్షన్స్​ని కడుపు దగ్గర చేస్తారు. ఈ ప్రక్రియలో ఎగ్​లో పెరుగుదల ఉంటుంది. అలా డెవలప్​ అయిన ఎగ్​ని శస్త్రచికిత్స ద్వారా రిట్రైవ్ (Egg Retrieval) చేసి ఫ్రీజ్ చేస్తారు. ఈ ప్రక్రియను ఓక్టే విట్రిఫికేషన్ (vitrification) అంటారు. రాపిడ్ ఫ్రీజింగ్ అని కూడా అంటారు. ఈ ఎగ్స్​ని క్రయోబ్యాంక్​లో స్టోర్ చేస్తారు. దీనిని పదేళ్లవరకు ఉపయోగించుకోవచ్చని.. ఎలాంటి క్రోమోజోమ్​లు ఎఫెక్ట్​ దీనిపై ఉండదని పలు అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి. దీని సక్సెస్​ రేటు (Egg Survival Rate) 90 నుంచి 95 శాతముంటుంది.



ఎవరు చేయించుకుంటారంటే.. 


వయసురీత్యా సంతానోత్పత్తి క్షీణత ఉన్నవారు.. క్యాన్సర్ చికిత్స చేయించుకునేవారు, సంతానోత్పత్తిని ప్రభావితం చేసే మెడికల్ సమస్యలు, కెరీర్​లో ముందుకు వెళ్లాలనుకునేవారు ఇలా వివిధ కారణాలతో చాలా మంది ఎగ్​ ఫ్రీజింగ్ చేయించుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్, మెహ్రీన్ వంటి హీరోయిన్స్ తమ ఎగ్స్​ని ఫ్రీజ్ చేసుకున్నట్లు బహిరంగాగానే చెప్పారు. మరికొందరు వ్యక్తిగత, ఆర్థిక కారణాలతో కూడా ఈ ప్రక్రియను ఫాలో అవుతున్నారు. 



Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పనులు అస్సలు చేయొద్దట.. మొదటి మూడు నెలల్లో ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలట