Vishnupriya Tasty teja Fun and Nayani Pavani Gets Emotional: బిగ్ బాస్ ఇంట్లో వైల్డ్ కార్డుల ఎంట్రీతో కళకళలాడుతోంది. ఆరో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. రాయల్ క్లాన్ సభ్యులంతా కలిసి చేసిన నామినేషన్లోంచి... యష్మీ, విష్ణు, సీత, పృథ్వీలు నామినేట్ అయినట్టుగా బిగ్ బాస్ తెలిపాడు. ఓజీ క్లాన్ అంతా కలిసి రాయల్ క్లాన్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయమని అన్నాడు. రాయల్ క్లాన్ వద్ద ఉన్న నామినేషన్ షీల్డ్ ఉపయోగాన్ని చెప్పాడు బిగ్ బాస్. ఆ షీల్డ్ ఉన్న కంటెస్టెంట్‌ను నామినేట్ చేస్తే ప్రైజ్ మనీ నుంచి లక్ష కట్ అవుతుందని అన్నాడు. రాయల్ క్లాన్ అంతా చర్చించుకుని ఆ షీల్డుని నయనిపావనికి ఇచ్చారు. దీంతో ఓజీ క్లాన్ అంతా చర్చించుకుని మెహబూబ్, గంగవ్వలను నామినేట్ చేశారు. అలా ఈ వారానికి యష్మీ, విష్ణు, సీత, పృథ్వీ, మెహబూబ్, గంగవ్వలు నామినేట్ అయ్యారు.


ఈ నామినేషన్ ప్రాసెస్‌లో యష్మీకి బయట జరుగుతున్న నెగెటివిటీని చెప్పే ప్రయత్నం చేశారు. రోహిణి, అవినాష్ ఇలా అందరూ కలిసి యష్మీకి హింట్లు ఇచ్చారు. మణిని టార్గెట్ చేయడం ఆపేయమని, మాటలు మాట్లాడే విధానాన్ని మార్చుకోమని, కొన్ని చోట్ల అనవసరపు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నావ్ అని ఆపమని హింట్లు ఇచ్చారు. ఇక విష్ణు ప్రియకు అయితే చాలా మంది హింట్లు ఇచ్చారు. ఆట మీద దృష్టి పెట్టు.. పృథ్వీ వెనకాల తిరగొద్దు అంటూ హింట్లు ఇచ్చారు. కానీ విష్ణు ప్రియ మాత్రం వాటిని క్యాచ్ చేసే పరిస్థితుల్లో లేదనిపిస్తోంది.


నామినేషన్ ప్రాసెస్ అయిన తరువాత  యష్మీకి మణి గురించి ఓ సూచన ఇచ్చాడు గౌతమ్. బయటకు వేరేలా వెళ్తుందని, పదే పదే అదే గొడవను పొడగించుకోవద్దని సలహా ఇచ్చాడు. మణి పద్దతి మారిందని, ఓవర్ చేస్తున్నాడంటుగా నిఖిల్, పృథ్వీ, యష్మీ ఇలా అందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు. మణిని నెక్ట్స్ వదిలేయండని, నామినేట్ చేయొద్దని అన్నాడు. ఇక గంగవ్వతో విష్ణు, తేజ ఫన్నీ ముచ్చట్లు అందరినీ నవ్వించాయి. పెళ్లి టాపిక్ వస్తే.. తేజని చేసుకోవచ్చు కదా అని విష్ణుకి సూచించింది గంగవ్వ.


Also Read: బిగ్ బాస్ తెలుగు 8 డే 36 రివ్యూ... మణి సింపతీ గేమ్‌‌పై హింట్ ఇచ్చిన రాయల్ క్లాన్.. నామినేషన్స్‌లో రఫ్పాడించిన టేస్టీ తేజ



నాలా డ్యాన్స్ చేస్తాడా? కనీసం పుష్ అప్స్ చేస్తాడా? అని తేజ పరువు తీసింది. కనీసం హగ్ చేసుకుందామంటే కూడా సరిగ్గా సరిపోడు అంటూ.. పక్కనే ఉన్న పృథ్వీ పిలిపించుకుని మరీ హగ్ చేసుకుంది విష్ణు ప్రియ. ఇలా ఉండాలి అంటూ విష్ణు తన మనసులోని మాటని చెప్పకనే చెప్పేసింది. చివరకు తేజ అక్కడ బక్రా అయిపోయాడు. ఇక ప్రతీ సారి నోటీసులు చదివేందుకు గౌతమ్ దూరుతున్నాడు. ఈ విషయంలో మెగా చీఫ్ నబిల్ హర్ట్ అవుతున్నాడు. ఆయనే మెగా చీఫ్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడని నబిల్ అనుకుంటున్నాడు.


రేషన్ కోసం నబిల్, నిఖిల్ వెళ్తే... అన్నీ తీసుకొచ్చి ఉప్పు ప్యాకెట్‌ని మర్చిపోయారు. ఉప్పు ప్యాకెట్ కావాలంటే... ప్రైజ్ మనీ నుంచి యాభై వేలు కట్ అవుతాయని అన్నాడు. ఒక ఉప్పు ప్యాకెట్ కావాలని కంటెస్టెంట్లు కోరారు. సీత, అవినాష్, నయని కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. లాస్ట్ సీజన్లో ఎలా ఎలిమినేట్ అయ్యావ్.. నామినేట్ అయ్యావ్ అని నయనిని సీత అడిగింది. తేజ రివేంజ్ నామినేషన్ చేశాడు అని నయని చెప్పింది. నేను చేసింది కరెక్ట్.. నిన్నే బయట బండ బూతులు తిట్టారు అంటూ తేజ కాస్త నోరు జారాడు. దీంతో నయని వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు నయని వద్దకు వెళ్లి తేజ సారీ చెప్పాడు. నీకు ఎందుకు రా అంత నోటి దూల అని తనలో తాను అనుకుని తేజ బాధపడ్డాడు.


Also Readబిగ్ బాస్ 8 తెలుగు డే 35 రివ్యూ... ‘గేమ్ చేంజర్’ నిఖిల్ - ‘నకిలీ’ విష్ణు - ‘వెన్నుపోటు’ మణికంఠ... వెళ్తూ వెళ్తూ నైనిక ఏమేం చెప్పిందంటే?