Bigg Boss 8 Telugu Episode 37 Day 36  Tasty Teja Nominates Manikanta And Sita: బిగ్ బాస్ ఇంట్లో ఆరో వారం అదిరిపోయేలా ఉంది. నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ అన్నట్టుగా మారింది. రాయల్ క్లాన్ సభ్యులంతా కూడా ఓజీ క్లాన్‌లోని ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇక కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు మెంబర్లంతా కూడా బయట జరుగుతున్నది చెప్పే ప్రయత్నం చేశారు. మణికంఠను టార్గెట్ చేసినట్టు పోతోందని, హీరో అవుతున్నాడని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్నిఓజీ క్లాన్ సభ్యులు మాత్రం క్లియర్‌గా క్యాచ్ చేయలేదనిపిస్తోంది.


వైల్డ్ కార్డుల బలాలపై ఓల్డ్ కంటెస్టెంట్ల ముచ్చట్లు పెట్టుకున్నారు. మణికంఠ ఏడ్పులపై గంగవ్వ కౌంటర్లు వేసింది. ఎందుకు ఏడుస్తూనే ఉంటావ్.. మరి బయటకు పో.. అని కౌంటర్లు వేసింది. ఇంట్లో వాళ్లు గుర్తుకు వస్తుంటారు అని మణికంఠ అంటే... అయితే బయటకు వెళ్లిపో అని కౌంటర్లు వేసింది. చివరకు మణికంఠ నామినేషన్లోనే ఉంటున్నాడు.. మళ్లీ సేఫ్  అయి బయటకు వస్తున్నాడు అని విష్ణు ప్రియ చెప్పింది. సింపతీ గేమ్ వర్కౌట్ అవుతోందేమో అని నబిల్ అన్నాడు. అందరం కలిసి మణిని నామినేట్ చేస్తే.. అతనిదే తప్పున్నా కూడా.. జనాలు మాత్రం మణినే పాపం అంటారు అని నబిల్ వివరించాడు.


అవినాష్ తన నోటి ధూలతో చివరకు డిష్ వాషెస్ చేయాల్సి వచ్చింది. మణి, అవినాష్, హరితేజ కలిసి డిషెస్ క్లీన్ చేశారు. స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. టేస్టీ తేజే కావాలని విరగ్గొటారని అందరూ అబాండాలు వేశారు.నేను రేపు స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసి బికినీ వేసుకుని అక్కడ కూర్చుందామని అనుకున్నా అంటూ రోహిణి కామెడీ చేసింది. వామ్మో.. బిగ్ బాస్ నేను నిన్ను ఆపాడా? అని కౌంటర్లు వేశాడు టేస్టీ తేజ. మణి టాప్ 5కి వెళ్తాడు.. మనమంతా ఆయన్ను టార్గెట్ చేసినట్టుగా బయటకు వెళ్లిందని నబిల్, సీత ముచ్చట్లు పెట్టుకున్నారు.


పేలవమైన ఆట.. ఇంట్లో ఉండటానికి అనర్హులు అనుకునే వారిని నామినేట్ చేయమని రాయల్ క్లాన్‌కు బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హరితేజ ముందు వచ్చి యష్మీని నామినేట్ చేసింది. రివేంజ్ నామినేషన్లు.. నీకు నచ్చినవాళ్ల దగ్గర వేరే రూల్స్.. నచ్చని వాళ్ల దగ్గర వేరే రూల్స్ పెడుతుంటాడు.. పక్షపాతం చూపిస్తుంటావ్ అంటూ కారణాలు చెప్పాడు. పృథ్వీ గ్రూపు సాయంతోనే ఉంటున్నాడు.. బయటకు రావడం లేదు.. సొంతంగా ఆడు.. ప్రభావితం కాకుండా ఆడు అంటూ నామినేట్ చేసింది.


ఆ తరువాత గౌతమ్ వచ్చి.. విష్ణుని నామినేట్ చేశాడు. బిగ్ బాస్ అంటే ఇండివిడ్యుయల్ గేమ్..కానీ నీకు వేరే వ్యక్తి మీద శ్రద్ద ఉంది.. నువ్వే అనర్హురాలివి.. అంటూ విష్ణు చేష్టలపై బయట జనాలు ఏం అనుకుంటున్నారో హింట్ ఇచ్చాడు. ఆ తరువాత యష్మీని నామినేట్ చేస్తూ.. టార్గెట్ చేయడం, రివేంజ్ నామినేషన్లు వద్దు అని అన్నాడు. ఆ తరువాత నయని వచ్చి మళ్లీ విష్ణుని నామినేట్ చేసింది. ఆటలంటే సీరియస్ లేదు.. ఆటలు ఆడటం లేదు.. కేవలం ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నావ్ అని చెప్పింది. బిగ్ బాస్ ఇంటికి అలవాటు పడటానికి నాకు టైం పడుతుంది.. నాకు నచ్చినప్పుడు టాస్కులు ఆడతా.. చీఫ్ అవుతా.. గెలవాడినికే వచ్చా అని ప్రతీ సారి అందరికీ చెబుతూ తిరగను అంటూ కౌంటర్లు వేసింది. కానీ విష్ణు మాత్రం తన గురించి ఆడియెన్స్ ఏం అనుకుంటున్నారో తెలుసుకునే స్థితిలో లేదనిపిస్తోంది. సీత క్రై బేబీలా ఉందని, ప్రతీ దానికి ఏడుస్తూనే ఉందని నామినేట్ చేసింది.


ఆ తరువాత మెహబూబ్ వచ్చి మళ్లీ.. సీతని నామినేట్ చేశాడు. యాక్టివ్‌గా ఉండటం లేదు.. రెస్పాన్స్ సరిగ్గా లేదు అని అన్నాడు... యష్మీని నామినేట్ చేస్తూ.. మేం కొత్త వాళ్లమని, వీళ్లెందుకు వచ్చారు.. అని మా అందరినీ యాక్సెప్ట్ చేయడం లేదనిపిస్తోందంటూ కారణాలు చెప్పాడు. టేస్టీ తేజ వచ్చి అందరికీ కౌంటర్లు వేశాడు. ఉదయం పూట పాట వచ్చినప్పుడు కూడా ఎవ్వరూ డ్యాన్సులు వేయడం లేదు అని పరువు తీశాడు.


Also Readబిగ్ బాస్ 8 తెలుగు డే 35 రివ్యూ... ‘గేమ్ చేంజర్’ నిఖిల్ - ‘నకిలీ’ విష్ణు - ‘వెన్నుపోటు’ మణికంఠ... వెళ్తూ వెళ్తూ నైనిక ఏమేం చెప్పిందంటే?



సీతను తేజ నామినేట్ చేస్తూ.. చీఫ్‌గా గెలిచిన తరువాత.. సరిగ్గా ఆడలేదు.. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదని సూటిగా చెప్పేశాడు. మణికంఠను నామినేట్ చేస్తున్నాను అని తేజ అనడంతో.. యష్మీ తెగ సంబరపడిపోయింది. ప్రతీ సారి సింపతీ వర్కౌట్ కాదు అని అన్నాడు. నీకు తెలియకుండా చేస్తే మార్చుకో.. తెలిసి చేస్తే మాత్రం నువ్వు సూపర్ గేమర్‌వి అన్నట్టే అని చెప్పుకొచ్చాడు. ఇక మణికంఠ చాలా చోట్ల చేసిన తప్పుల్ని గుర్తు పెట్టుకుని మరీ ఒక్కో పాయింట్ చెప్పాడు. తేజ దెబ్బకు మణి తెల్లమొహం వేసినట్టుగా కనిపిస్తోంది. ఇక పూర్తి నామినేషన్ ప్రక్రియ అయితే సోమవారం నాటి ఎపిసోడ్లో పూర్తవ్వలేదు. మంగళవారం ఎపిసోడ్‌లో మిగిలిన నామినేషన్ ప్రాసెస్‌ను బిగ్ బాస్ చూపించనున్నాడు.


Also Readబిగ్ బాస్ తెలుగు 8 డే 34 రివ్యూ... నాగ్ చురకలకు మాడిపోయిన మణికంఠ మొహం... ఒక్కొక్కరి గురించి ఆదిత్య ఏం చెప్పాడంటే?