క్కోసారి కొన్ని వస్తువులు మన ప్రమేయం లేకుండానే కదులుతూ ఉంటాయి. గాలివల్లో.. ఎలుకల తిరుగున్నాయేమో అని అనుకుంటాం. కానీ, కొందరు మాత్రం అవి తప్పకుండా దెయ్యాల పనే అని అనుకుంటారు. మరి, మీరు దెయ్యాలను నమ్ముతారా? అయితే, ఈ వీడియో చూసిన తర్వాత మీ ఓపినియన్ మారిపోవచ్చేమో.  


యూకేలోని ఓ పబ్బులో వస్తువులు వాటికవే కదులుతున్నాయి. ఇదేదో అర్ధరాత్రి మనుషుల్లేనప్పుడు జరుగుతోందని అనుకుంటే పర్వాలేదు. కానీ, మనుషులు ఉండగానే.. హర్రర్ సినిమాల్లో చూపించినట్లు.. అవి వస్తువులను కదుపుతున్నాయి. డార్లింగ్‌టన్‌లోని మార్పెత్‌లోని కొత్తగా ‘బ్లాక్ అండ్ గ్రే’ పబ్‌కు బాధ్యతలు స్వీకరించిన అక్కాచెల్లెల్లు రిచెల్ స్టాక్స్, ఆష్లీగ్ నైస్‌బిట్‌లు ఇటీవల భయాందోళనలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్‌లో వస్తువులు వాటికవే కదులుతున్నాయని తెలిపారు. ఇందుకు ఓ సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియోలను ఆధారంగా చూపించారు.


గతేడాది ఆగస్టు నెల నుంచి ఆ పబ్‌లో వింత వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు పోలీసులకు తెలిపారు. ఇటీవల వాటి ఆగడాలు బాగా పెరిగాయని, మనుషులు ఉన్నప్పుడే వస్తువులు వాటికవే కదులుతూ భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలు సీసీటీవీ కెమేరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోలు చూసిన తర్వాత సిబ్బంది ఆ పబ్‌లో పనిచేయాలంటేనే హడలిపోతున్నారు. 


2021 సెప్టెంబర్ నెలలో రిచెల్ స్టాక్స్, ఆష్లీగ్ నైస్‌బిట్‌‌ పబ్ పై అంతస్తులో ఉండగా.. కింది ఫ్లోర్‌ నుంచి పెద్ద శబ్దం వినిపించింది. కిందికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు. దొంగలు పడ్డారనే భయంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ వీడియోలను పరిశీలించగా.. బార్ ఏరియాలో మనిషి రూపంలో ఉన్న నీడలు కదులుతున్నట్లు కనిపించాయి. ఆ నీడ దేనివల్ల ఏర్పడిందో తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ, ఆ నీడను సృష్టించే ఒక్క వస్తువు కూడా పరిసరాల్లో కనిపించలేదు. దీంతో రిచెల్.. దెయ్యాలను గుర్తించే పాల్ అనే మహిళను పబ్‌కు పిలిచింది. ఈ సందర్భంగా రిచెల్ తన అర చేతిలో పెన్ పెట్టుకుంది. ఆ దెయ్యాన్ని తన చేతిలో ఉన్న పెన్‌ను కదిలించాలని చెప్పమంది. ఆ మరుక్షణమే ఆమె చేతిలో పెన్ను ఎవరి ప్రమేయం లేకుండా గిరగిరా తిరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇటీవల పబ్‌లో ఫ్లోర్ క్లీనింగ్ చేసే బ్రష్ ఒకటి దానంతట అదే కదిలింది. ఈ వీడియోలు చూసిన తర్వాత సిబ్బంది అంతా గుంపులుగా పనిచేస్తున్నారు. రాత్రివేళ ఒంటరిగా అక్కడ పనిచేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో కస్టమర్లు సైతం ఆ పబ్‌కు రావడం తగ్గించేశారు. పైగా.. పబ్‌లో ఎవరూలేని సమయంలో వస్తువులు చెల్లాచెదురు అవుతున్నాయని యజమానులు తెలిపారు. క్రమేనా సిబ్బంది కూడా పనిచేయడానికి రావడం లేదు. దీంతో ఆ పబ్‌ను నడపలేక, మూయలేక అక్కాచెల్లెల్లు ఇద్దరూ.. గందరగోళానికి గురవ్వుతున్నారు.


ఇవి కూడా చదవండి: 


ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
ఈ దేశంలో గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు.. ఇందుకో కారణం ఉంది!
సరసాలతో సంపాదన.. అమ్మాయిలతో ‘పులిహోర’ కలపడమే ఇతడి ఉద్యోగం
కోవిడ్ వ్యాక్సిన్‌ - బూస్టర్ డోస్‌‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?


వ్యాక్సిన్ వద్దంటూ.. చెట్టెక్కి కూర్చున్నాడు, వీడియో వైరల్
‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం