చాలా మందికి పొగతాగే అలవాటు ఉండదు. అయినా ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారు. దానికి కారణం పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. అంటే స్నేహితులు కాలుస్తుంటే పక్కన నిల్చుంటే.... ఆ పొగ మీ ముక్కు నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇది నిజం చెప్పాలంటే మరింత ప్రమాదకరం. పొగ తాగిన వ్యక్తి కంటే పాసివ్ స్మోకింగ్ లో పొగ పీల్చీన వ్యక్తికే అధిక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇప్పుడు మరో కొత్త అధ్యయనం సిగరెట్ అధికంగా పీల్చిన వారిలో కీళ్ల నొప్పులు లేదా రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా చిన్న వయసులో సిగరెట్ పీల్చిన వారిలో పెద్దయ్యాక ఈ రుమటాయిడ్ ఆర్ధరైటిస్ తలెత్తే ముప్పు అధికం.రుమటాయిడ్ ఆర్ధరైటిస్ కు, ధూమపానానికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్టు చెప్పిన తొలి అధ్యయనం ఇదే. 


నాలుగు వేల రకాలు...
సిగరెట్ కాల్చి వదిలిన పొగలో 4000 రకాల ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. అవి గాలిలో కలిసి మరింత ప్రమాదకరంగా మారతాయి.వాటిని పీల్చుకున్న వ్యక్తిలో ఇవి ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఊపరితిత్తులు క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కేవలం ధూమపానం వల్ల కలిగే రోగాల వల్లే ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో పది లక్షల మంది పొగ తాగని వారే.కేవలం పొగ తాగే వారి పక్కన నిల్చోవడమే వారి పాపం. అందుకే పొగ తాగే స్నేహితులను దూరంగా ఉంచండి. ముఖ్యంగా వారు సిగరెట్ కాల్చేటప్పుడు పక్కన నిల్చోవద్దు. 


ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
కేవలం సిగరెట్ తాగడం, పొగాకు నమలడం, పొగాకు కాల్చడం వంటి వాటి వల్ల ఎన్ని రకాల జబ్బులు వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయో తెలుసా? వీటి గురించి తెలుసుకుంటే సిగరెట్ ముట్టుకోవాలంటేనే భయపడతారు. 
1. ధూమపానం చేసేవారిలో ఎప్పుడైనా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. 
2. ధమనులు పూడుకుపోయి గుండె ఆగిపోయే ఛాన్సులు ఎక్కువ. 
3. దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు. 
4. మూత్రాశయం, రక్తం, నోరు, ముక్కు, గొంతు ప్రాంతాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 
5. దగ్గు ఆగకుండా వచ్చి వేధిస్తుంటుంది. 
6. మానసిక ఆందోళనలు పెరిగిపోతాయి. 
7. గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
8. రోగినిరోధక శక్తి తగ్గిపోతుంది.  


Also read: ఇచ్చిన బొమ్మలో మీ మెదడు మొదట ఏం గమనించింది? దాన్ని బట్టి మీ మనసు ఎలాంటిదో చెప్పవచ్చు


Also read: అల్యూమినియం పాత్రల్లో వండితే మతిమరుపు త్వరగా వచ్చేస్తుందా? అవునంటోంది ఈ అధ్యయనం