చుక్కల మధ్య అందమైన చంద్రుడు. అందులోనూ మీసాలతో ముద్దొచ్చేలా ఉన్నాడు. ఈ మీసాలా చంద్రుడు మీరెలాంటి వారో చెప్పేస్తాడు. ఈ బొమ్మను చూడగానే మీరు ఏం గుర్తించారో చెబితే దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో, మీ మనసు ఎలాంటిదో చెప్పేయచ్చు. చూడగానే చంద్రడి ముఖమే కనిపిస్తే ఒక వ్యక్తిత్వం, చంద్రడిలో దాక్కున్న రెండు జంట పక్షులు కనిపిస్తే ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇది మీకు మీరు నిజాయితీగా చేసుకోవాల్సిన వ్యక్తిత్వ పరీక్ష. ఇచ్చిన బొమ్మలో మొదట మీకు ఏం కనిపించిందో ఓసారి గమనించండి.
చంద్రుడి ముఖం
మీకు చంద్రుడి ముఖమే కనిపిస్తే మీరు కచ్చితంగా సున్నితమైన వ్యక్తి. దయగల వ్యక్తి. మీ మనసు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మీరు ఎవరితో కూడా గొడవలు రాకుండా చూసుకుంటారు. ఒకవేళ విబేధాలు వచ్చినా కామ్ గా ఉండిపోతారు. అందరితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని చూస్తారు. మీ బంధాలను, స్నేహాలను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు. మీకు చాలా బలమైన అంతర్ దృష్టి ఉంది. అయితే మీకు ఎప్పుడైనా కష్టమైన పరిస్థితులు, అసౌకర్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని అర్థం కూడా.
రెండు పక్షులు
చంద్రుడు మీసాల దగ్గర ఉన్న రెండు జంట పక్షులు మీరు గుర్తిస్తే మీ వ్యక్తిత్వం డిఫరెంట్ గా ఉంటుంంది. మీరు చాలా ప్రేమగల వ్యక్తి. మీరు హృదయపూర్వకంగా ఉంటారు. సాహసోపేతమైన వ్యక్తిత్వం కలవారు. గొప్ప నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎవరికైనా మీరు మంచి స్నేహితులుగా ఉండగల కెపాసిటీ ఉంది. మీది వినోదాత్మక వ్యక్తిత్వం కలవారు. అందుకే మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు.
ఈ రెండింటిలో మీకు ఏది కనిపించిందో చెక్ చేసుకుని మీ వ్యక్తిత్వాన్ని మీరే పరీక్షించుకోండి.
ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి. పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తాయి. ఇవి కొన్ని వందల ఏళ్లుగా పాశ్చాత్య దేశాల్లో అమలులో ఉన్నాయి. వీటిని ఎవరు, ఎందుకు మొదలుపెట్టారో తెలియదు కానీ, బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు వీటిదే హవా. ఇన్ స్టా నుంచి ఫేస్ బుక్ వరకు రకరకాల సోషల్ మీడియాలలో ఇవి ప్రత్యక్షమవుతున్నాయి. ఇది కంటి చూపు, మెదడు సమన్వయంగా పనిచేస్తుందో లేదో కూడా ఆప్టికల్ ఇల్యూషన్లు చెప్పేస్తాయి.
Also read: అల్యూమినియం పాత్రల్లో వండితే మతిమరుపు త్వరగా వచ్చేస్తుందా? అవునంటోంది ఈ అధ్యయనం