మామిది కాయలను ఎండబెట్టి పొడి చేసుకుని దాచుకోవాలి. దీన్నే మార్కెట్లో ఆమ్‌చూర్ పౌడర్ అన్న పేరుతో అమ్ముతారు. పూర్వం మన మసాలాలలో ఇది కూడా ఒకటి. కాలక్రమేణా దీని వాడకం తగ్గిపోయింది. పండు నుంచి తయారుచేసే ఏకైక మసాలా ఇదే. ఇది ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. మామిడి పండ్లు దొరకని సీజన్లలో కూడా ఆ పండులోని పోషకాలు అందాలంటే మామిడి పొడి వల్లే సాధ్యం.దీన్ని ఒక్కసారి తయారుచేసుకుంటే ఏడాదంతా ఉంటుంది. 


క్యాన్సర్‌కు చెక్
మామిడి కాయ పొడి వంటల్లో భాగం చేసుకుని రోజూ తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఇందలో గ్యాలిక్ యాసిడ్, ఫిసెటిన్, డైటరీ ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్‌తో పోరాడటానికి అవసరమైన ఎంజైమ్‌లను అందిస్తాయి.


మధుమేహులకు మంచిది
డయాబెటిస్‌తో బాధపడేవారికి మామిడికాయ పొడి చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 


జ్ఞాపకశక్తిని పెంచుతుంది
చదువుకునే పిల్లలకు  మామిది పొడి చాలా మేలు చేస్తుంది. ఏకాగ్రతలను పెంచుతుంది, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే గ్లూటామైన్ యాసిడ్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 


కంటి చూపు
కల్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుంటుంది మామిడి పొడి. కంటి చూపును పదునుగా  మారుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ దురద, మంట, రేచీకటిని నివారిస్తుంది. 


ఎసిడిటీ రాకుండా
మామిడి పొడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఇది జీర్ణ క్రియకు సహాయపడుతుంది. ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి సులువుగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతే కాదు మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. 


గుండెకు మంచిది
మామిడి పొడిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే సెలీనియం గుండె జబ్బులతో పోరాడుతుంది. కాబట్టి రోజూ వండే కూరల్లో ఓ స్పూను పొడిని వేసి కలపండి. 


ఎముకలు బలంగా
మామిడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక బలాన్ని పెంచుతుంది. అందుకే పిల్లలకు, మహిళలకు మామిడి పొడి పెట్టడం చాలా మంచిది. దీన్నీ తినే ఆహారాల్లో కలుపుకుంటే చాలు. 


Also read: ఈ ఆరు అలవాట్లు వదలకపోతే, త్వరగా ముసలివాళ్లవ్వడం ఖాయం


Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి


Also read: కేజీయఫ్‌ను మించి పోయిన బంగారు గని, ఇదే ప్రపంచంలో అతి పెద్దది, ఎక్కడుందో తెలుసా?