వెరైటీ దుస్తులను ధరించి ఎప్పుడూ వార్తల్లో ఉండే సెలబ్రిటీ ఉర్ఫీ జావెద్. ఛాన్సు దొరికితే.. చెత్త కుప్పను కూడా డ్రెస్‌గా ధరించే సత్తా ఆమెది. ఇటీవల గోనె సంచి డ్రెస్ ధరించి అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది ఉర్ఫీ. కొద్ది రోజుల కిందట టాప్ లేకుండా కేవలం పువ్వులను మాత్రమే అడ్డు పెట్టుకుని కుర్రాళ్లుకు నిద్రలేకుండా చేసింది. తాజాగా ఆమె.. బ్లేడ్ డ్రెస్ ధరించింది.
సాధారణంగా జేబు దొంగలను బ్లేడ్ బాబ్జీలని అంటారు. మరి ఒళ్లంతా బ్లేడ్‌లతో కప్పేసుకున్న ఉర్ఫీని మనం ‘బ్లేడ్ బేబీ’ అనడమే కరెక్ట్. అయితే, ఈ డ్రెస్ ధరించడం అంత ఈజీ కాదు. కొంచెం అంటూ ఇటూ అయినా.. శరీరం కోసుకుపోతుంది. అన్నట్లుగా.. ఉర్ఫీ తన డ్రెస్‌లను తానే డిజైన్ చేసుకుంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ కూడా ఉంది. దాచుకోవల్సిన అందాలను.. కనీకనిపించనట్లుగా చూపిస్తూ ఊరించడం ఉర్ఫీకి అలవాటు. ఒక్కోసారి బోల్డ్‌గా.. మరోసారి క్రియేటివ్‌గా, ఇంకోసారి చెత్త చెత్తగా డ్రెస్‌లు ధరించడం ఉర్ఫీ ప్రత్యేకత.
ఇటీవల బరువైన గాజు పెంకుల డ్రెస్ వేసుకుని గాయపడింది. ఆ తర్వాత ఇనుప గొలుసులతో తన అందాలను కప్పేస్తూ మరో డ్రెస్ ధరించింది. ఇనుప గొలుసుల బరువుకు ఆమె మెడ వాచిపోయింది. దీన్ని మనం పిచ్చి అనుకున్నా.. ఉర్ఫీ మాత్రం.. ఫ్యాషన్ కోసం ప్రాణాలు ఇచ్చే రకమని ఆమె అభిమానులు పొగిడేస్తుంటారు. అందుకే, ఆమె ఏ మాత్రం తగ్గకుండా ఇలా రోజుకో వెరైటీ డ్రెస్ ధరిస్తూ నిత్యం వార్తల్లో ఉంటోంది. అన్నట్లు ఉర్ఫీ ఎప్పుడూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూనే ఉంటుంది. అయితే, విమానం ఎక్కేందుకు మాత్రం కాదండోయ్.. అక్కడ ఉండే ఫొటోగ్రాఫర్ల కంట్లో పడటానికి. మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా ఆమె కనిపించగానే ఫొటోలు తీసేందుకు ఎగబడుతుంటారు. దీనివల్ల ఉర్ఫీ జావెద్‌కు ఫొటోషూట్ డబ్బులు బాగా మిగులుతున్నాయి.