Sai Pallavi: రియల్‌ లైఫ్‌లో లవ్ లెటర్ రాసిన సాయి పల్లవి- చితకబాదిన పేరెంట్స్

'విరాటపర్వం' సినిమా ఓటీటీ ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సాయిపల్లవి.

Continues below advertisement

నటి సాయిపల్లవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆమెని అభిమానులు లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి రీసెంట్ గా 'విరాటపర్వం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నక్సలైట్ వెన్నెల పాత్రలో సాయిపల్లవి ప్రేక్షకులను ఫిదా చేసింది. అయినప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా.. జూలై 15న ఈ బ్యూటీ నటించిన 'గార్గి' అనే సినిమా రిలీజ్ కానుంది. 

Continues below advertisement

తండ్రి కోసం న్యాయపోరాటం చేసే కూతురి కథే ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది సాయిపల్లవి. ఇదిలా ఉండగా.. 'విరాటపర్వం' సినిమా ఓటీటీ ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సాయిపల్లవి. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని తన తల్లిదండ్రులు బాగా కొట్టారని చెప్పింది సాయిపల్లవి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సమర్పించిన విలేజ్ షో అనే టాక్ షోలో సాయిపల్లవి పాల్గొంది. 

ఆ టాక్ షోని గంగవ్వ నిర్వహిస్తోంది. అందులో సాయిపల్లవితో పాటు రానా కూడా పాల్గొన్నారు. 'విరాటపర్వం' సినిమా రవన్న పాత్రకు లవ్ లెటర్ రాసినట్లు.. రియల్ లైఫ్ లో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా..? అని గంగవ్వ.. సాయిపల్లవిని అడిగింది. దానికి ఆమె సమాధానమిచ్చింది. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని.. ఆ లెటర్ తన తల్లిదండ్రుల కంట పడడంతో బాగా కొట్టారని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఇదే ప్రశ్న రానాని అడగ్గా.. చిన్నప్పుడు తన తాతయ్యకి ఒక లెటర్ రాశానని, ఆ తరువాత ఇప్పటివరకు ఎవరికీ లెటర్స్ రాయలేదని చెప్పుకొచ్చారు.  

Continues below advertisement
Sponsored Links by Taboola