ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌ దేశవిదేశాల్లోని భారతీయులను దృష్టిలో ఉంచుకుని వారు జరుపుకొనే సాంప్రదాయ పండగలకు, పూజల నిమిత్తం ఆవు పేడ పిడకలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ‘కౌవ్‌ డంగ్‌ కేక్‌’ అనే పేరుతో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.


Also Read: Salt for Vastu: ఉప్పుతో వాస్తు దోషాలను తొలగించవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?



ఈ రోజుల్లో చాలా మంది కావాల్సిన వస్తువులను కొనుక్కునేది ఈఎంఐలోనే. ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఇ-కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్శించేదుకు ఈఎంఐ ఆప్షన్ ఇస్తుంటాయి. ఒకవేళ మన దగ్గర సరిపడా మనీ లేకుంటే.. ఈఎంఐలో కొనుగోలు చేసుకోవచ్చు. 


Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?


అయితే.. ఇంట్లో జరిగో హోమాలు, పూజలకు ఇప్పుడు ఇ-కామర్స్ వెబ్ సైట్లతో ఆవు పేడ పిడకలు, మామిడి ఆకులు, బెల్ పత్రా ఆకులు ఆన్ లైన్ కొనేసుకోవచ్చు. అయితే డబ్బులు లేవని ఆలోచిస్తున్నారా? ఏం కాదు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుంటే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈ కామర్స్ దిగ్గజం కొన్ని రోజుల నుంచి వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందిస్తోంది.


మామిడి ఆకులను అమెజాన్‌లో రూ .199, (డిస్కౌంట్ తర్వాత రూ.78) కు విక్రయిస్తున్నారు.  పిడకలు 500 ముక్కలకు రూ .2,100 చొప్పున విక్రయిస్తున్నారు. అదేవిధంగా పూజలో  ఉపయోగించే.. మనకు కావాల్సిన ఐటమ్స్ చాలానే ఉంటాయి.


Also Read: Himalayan Salt: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?


ఆవు పేడ పీడకలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో, మామిడి ఆకులను పూజలో కూడా ఉపయోగిస్తారు. శివుడిని పూజించడానికి తప్పనిసరిగా బెల్ పత్రా ఉండాలి. ఒకవేళ డబ్బులు తక్కువగా ఉన్నవాళ్లు వాటిని ఈఎంఐలో కొనుకోలు చేసుకోవచ్చు.  మీరు కార్డు ద్వారా చెల్లిస్తే వాటి ధరపై డిస్కౌంట్లు కూడా ఉంటాయి.


గతంలో కేక్ అనుకుని పిడకలు తిన్న కస్టమర్


గతంలో అమెజాన్‍లో పిడకలు కొని ఓ కస్టమర్ దానిని టేస్ట్ చేశాడు. అది తిన్న తర్వాత అతను దానికి అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు.  'నేను దీన్ని తిన్నాను. టేస్ట్ అస్సలు బాగోలేదు. దీని రుచి గడ్డి,బురద కలిసినట్లుగా ఉంది. తిన్న తర్వాత నాకు విరోచనాలు పట్టుకున్నాయి. దయచేసి తీని తయారి సమయంలో పరిశుభ్రత విధానాలు పాటించండి. అంతేకాకుండా దీని టేస్ట్ మీద కూడా సరైన దృష్టి పెట్టండి' అంటూ రివ్యూలో  చెప్పాడు.  అయితే ఇందులో అమెజాన్ తప్పేమి లేదు. అందులో పిడకలను దేనికి ఉపయోగిస్తారనే విషయాన్ని వివరంగా తెలిపారు. వాటిని కేవలం పూజలు, హోమాల కోసం వాడతారని.. వాటిని కాల్చడం ద్వారా గాలిలోని కలుషితాలు నాశనమవుతాయని, అంతేకాకుండా అవి బాగా మండుతాయని చెప్పారు.


Also Read: రియల్ పక్షిరాజా.. వీడియో తీస్తుంటే ఫోన్ ఎత్తుకెళ్లిపోయిన చిలుక, కెమేరాకు చిక్కిన ‘బర్డ్ వ్యూ’


Kolkata Chinese Kali Temple: ఈ దేవాలయంలో న్యూడిల్స్, సూప్ ప్రసాదం.. అసలు కథేంటంటే!