ఆగస్టు 27 శుక్రవారం రాశిఫలాలు


మేషం


మేషరాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. కొందరితో విభేదాలుంటాయి. మీ సమస్య పెరుగుతుంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది.  కార్యాలయ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరింత బాధ్యత పెరుగుతుంది.  జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. 


వృషభం


ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు.  బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామి  నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. ఈరోజు ఖర్చులు అధికంగా ఉండొచ్చు.


మిథునం


ఏ పనిని వాయిదా వేయవద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన పత్రాలను వెంట తీసుకెళ్లండి. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి.  మీ మాటపై సంయమనం పాటించండి.   మీ దినచర్యను మార్చుకోండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  తెలియని వ్యక్తులతో ఎక్కువ చర్చలు వద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 


కర్కాటక రాశి


కుటుంబ సభ్యులోతో వివాదాలు ఉండొచ్చు. ఒత్తిడికి గురవుతారు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. సామాజిక పని కోసం ఆర్థిక సహాయం అందిస్తారు. బంధువు నుంచి దుర్వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సమయం అంత అనుకూలంగా లేదు.  తల్లిదండ్రులకు సేవ చేయండి.


Also Read: ఈ రాశులవారు గతవారం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు... స్థిరాస్తి కొనుగోలుకి వారికి శుభ సమయం


సింహం


మరింత బాధ్యత పెరుగుతుంది. కార్యాలయంలో పని సమయానికి పూర్తవుతుంది.  అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.  దినచర్యలో మార్పులు చేయవచ్చు. మీ స్నేహితుడి నుంచి మంచి సమాచారాన్ని పొందుతారు. పిల్లల వైపు సమస్యలు తొలగిపోతాయి.  కొంతమంది ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఒకరి  మాటలు విని మీ ప్రియమైన వారిని అనుమానించవద్దు.


కన్య


రిస్క్ తీసుకోకండి. వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్దలు ఆశీస్సులు పొందుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అవసరమైన వారికి సహాయం చేయండి.


తులారాశి


మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు.  విద్యార్థులకు శుభసమయం. సహోద్యోగులు స్నేహపూర్వకంగా ఉంటారు. పని బాగా సాగుతుంది. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి. అపరిచితులతో పరిచయం పెంచుకోవద్దు.  మీ మాటపై సంయమనం పాటించండి. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. పిల్లలతో సమయం గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 


వృశ్చికరాశి


ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోండి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.  బంధువుతో సమావేశం ఉండొచ్చు. ఖర్చులను నియంత్రించండి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. 


Also Read: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….


ధనుస్సు


ఈరోజు మీకు కలిసొచ్చే రోజవుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి పని పూర్తవుతుంది. అవసరమైన వారికి సహాయం చేయండి. జీవిత భాగస్వామిపై ప ప్రేమ చెక్కుచెదరదు.  ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్త వింటారు.


మకరం


మీరు మంచి సమాచారాన్ని పొందుతారు. ఆకస్మిక లాభాలు పొందే సూచనలున్నాయి.  రోజంతా సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగిపొందుతారు. పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వొద్దు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. 


కుంభం


ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. రుణాలు తీసుకోవడం మానుకోండి.  ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. పూర్వీకుల వ్యవహారాలు కొనసాగుతాయి. కుటుంబ అవసరాలను తీర్చగలుగుతారు.  ఖర్చులు నియంత్రించగలుగుతారు.


మీనం


మీకు హాని జరిగే అవకాశం ఉంది ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.  ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి. ఆస్తి విషయాల్లో పురోగతి  ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.  స్నేహితులను కలుస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండండి.


Also Read: ఇదింతే అనే ఆలోచన మార్చుకోకుంటే ఏమవుద్ది.. వచ్చే సమస్యలేంటి? కేరీర్ గ్రోత్‌కి దీనికి లింకేంటి


Also read: నువ్వే రాజు - నువ్వే మంత్రి… ఎవరికోసం నువ్వు మారవద్దు: శ్రీశ్రీ రవిశంకర్


Also Read: ఒంటరితనం పోగొట్టుకోవాలంటే ఒంటరిగానే ఉండాలి: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్