చాలామందికి వేడి నీళ్లతో స్నానం చేస్తేనే హాయిగా ఉంటుంది. చన్నీళ్లతో స్నానం పెద్దగా నచ్చదు. పైగా ఉదయం వేళల్లో చన్నీటి స్నానమంటే చాలు.. గజగజా వణికిపోతారు. మరి, వేడి నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయాన్ని తెలుసుకోడానికి పలు అధ్యయన సంస్థ వాటర్ ఇమ్మర్షన్ థెరపీ విధానాన్ని పాటించాయి. వేడి లేదా చన్నీళ్ల వల్ల శరీరంలో కలిగే మార్పులు, ప్రభావం గురించి తెలుసుకొనేందుకు వ్యక్తులను నిర్దిష్ట సమయంలో ఆ నీటిలో మునగమని చెబుతారు. మరి, ఆ పరిశీలనల్లో ఏం తేలింది? ఏయే నీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు శరీరానికి చేకూరతాయో తెలుసుకుందామా. 


చల్లని నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:  
⦿ చల్లని నీటితో స్నానం వల్ల శరీవ వాపు తగ్గుతుంది.
⦿ కండరాల నొప్పులు తగ్గుతాయి
⦿ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. 
⦿ న్యూరోకెమికల్స్ డోపామైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ స్థాయిలు పెరుగుతాయి.
⦿ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చన్నీటి స్నానం మంచిది. 
⦿ వ్యాయామం తర్వాత చల్లని స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీని వల్ల హైడ్రేషన్ మెరుగుపడుతుంది.
⦿ శరీర కణజాలాలలో రక్త నాళాలు మరింత విస్తరించి.. ప్రసరణను మెరుగుపరుస్తుంది.
⦿ శరీరంలో కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.  
⦿ క్రీడాకారులు ఎక్కువగా చన్నీటి స్నానం చేయడమే ఉత్తమం అని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి.
⦿ చన్నీళ్లు శరీరంలో అనారోగ్యాలతో పోరాడే తెల్ల రక్తకణాలు సంఖ్యను పెంచుతాయట. 
⦿ అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. 


వేడి నీటి వల్ల కలిగే ప్రయోజనాలు: 
⦿ వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
⦿ గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుంది. 
⦿ దీర్ఘకాలిక గుండె సమస్యలతో బాధపడేవారు నిత్యం వేడి నీటి స్నానం చేయడం ఉత్తమం. 
⦿ శరీరం అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు రక్తనాళాలు విస్తరిస్తాయి. ఫలితంగా రక్త ప్రవాహం మెరుగుపడుతుంది.
⦿ కీళ్ళు, కండరాలకు వేడి నీళ్లు ఉపశమనం కలిగిస్తాయి.
⦿ వేడి నీటి వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. 
⦿ వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో క్యాలరీలు కూడా తగ్గుతాయి. 
⦿ బరువు తగ్గాలనుకొనేవారు వేడి నీటి స్నానం చేయడం మంచిదే. 
⦿ నిత్యం వేడి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతరాత్ర గుండె సమస్యల ముప్పు తగ్గినట్లు ఓ తాజా పరిశోధనలో తేలింది. 
⦿ వేడి నీటితో స్నానం చేసేవారిలో 10 శాతం షుగర్ లెవల్స్ కూడా తగ్గాయని తెలిసింది. 
⦿ మరిగిన నీటితో స్నానం చేయడం కంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్లే ప్రయోజనాలే ఎక్కువ. 
⦿ వేడి నీటితో స్నానం వల్ల హాయిగా నిద్రపడుతుంది. 
⦿ వేడి నీటి స్నానం వల్ల శరీరంపై ఉండే ఏమైనా బ్యాక్టీరియా, క్రిములు ఉంటే బయటకు పోతాయి. 


Also Read: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ 5 ఆహారాలను తప్పక తీసుకోవాలి


చూశారుగా.. వేడి నీళ్లు, చన్నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు. మరి, వీటిలో ఏ నీటితో స్నానం చేయాలనేది మీరే నిర్ణయం తీసుకోండి. ఇకపై ఏది మంచిదా అనే గందరగోళానికి గురికావద్దు. రోజుకు కనీసం ఒకసారి స్నానం చేస్తే చాలు. పదే పదే స్నానం చేయడం వల్ల శరీరం నిర్జీవంగా మారుతుండి. పోడిబారిపోయి మంట పుడుతుంది. శరీరానికి సబ్బు, షాంపులు తగిలితే అలర్జీలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి.. కేవలం చికాకు, ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడో.. బయట తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే స్నానం చేయడండి. బాగా వేడిగా ఉండే నీరు లేదా బాగా చల్లగా ఉండే నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. 


Also Read: చర్మం ఇలా మారుతుందా? జాగ్రత్త, అది డయాబెటిస్ వల్ల కావచ్చు!


గమనిక: పైన పేర్కొన్న వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. వివిధ పరిశోధనల్లో తెలిపిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించామని గమనించగలరు. ఈ కథనానికి ‘ఏబీపీ దేశం’ ఎటువంటి బాధ్యత వహించదు. 


Also Read: మనుషుల కంటే ముందే అంతరిక్షానికి వెళ్లిన ఆ కుక్క, కోతులు ఏమయ్యాయి?