భారత్ లో దేవాలయాలు ప్రసిద్ధి. దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు ప్రసాదాలు ఇస్తుంటారు. కొన్ని దేవాలయాల్లో ప్రసాదం భక్తులకు అమిత ప్రియం. తిరుపతి, అన్నవరం, కేరళ అయ్యప్ప స్వామి దేవాలయాల ప్రసాదాలు చాలా ప్రసిద్ధి. కానీ కోల్ కతాలోని ఓ దేవాలయంలో వింత ఆచారం ఉంది. అక్కడ న్యూడిల్స్, సూప్ ప్రసాదంగా అందజేస్తారు.
Also Read: Odisha News: చావైనా నీతోనే... భార్య చితిలో దూకిన భర్త... ఒడిశాలో పతీసహగమనం
చైనీస్ టౌన్...
కోల్ కతా కాళీమాత గుడిని ప్రతిరోజు వందల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూజా కార్యక్రమం అనంతరం సూప్, నూడిల్స్ ప్రసాదంగా ఇస్తారు. పశ్చిమ బంగాల్లోని కోల్‌కతా మహానగరంలో భిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ చైనీస్ టౌన్‌గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో కాళీమాత ఆలయం ఉంది. దీన్ని 'చైనీస్ కాళీ టెంపుల్' అని పిలుస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రసాదంగా సూప్, నూడిల్స్, స్టిక్కీ రైస్ లాంటివి ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. చైనా, జపాన్, హాంకాంగ్ దేశాలను పోలినట్లు ఉండే ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
బాలుడి కథ...
చైనీయులు ఈ ప్రాంతంలో చాలా ఏళ్లగా నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కాళీ టెంపుల్ లో భారత-చైనీస్ సంప్రదాయలు పాటిస్తుంటారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ నెలకొన్న ప్రత్యేక సంస్కృతి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న చైనీస్ పిల్లాడికి అనారోగ్యం చేసింది. అతడి తల్లిదండ్రులు ఎంతో మంది వైద్యులకు చూపించిన ఫలితం లేదు. ఆ సమయంలో ఈ దేవాలయంలో కాళీమాతకు పూజ చేశాక కొన్నిరోజుల తర్వాత ఆ పిల్లాడి ఆరోగ్యం కుదుటపడిందని ఓ కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి నమ్మకం ఏర్పడి, ఈ గుడిని వలస వచ్చిన చైనీయులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
Also Read: Afganisthan Crisis: అఫ్గాన్ పరిస్థితులపై అఖిలపక్ష భేటీ.. హాజరైన పలువురు నేతలు
Also Read: Afghanistan Crisis: అఫ్గాన్ లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. రిపోర్టర్ పై విచక్షణారహితంగా దాడి