సతీసహగమనం వినే ఉంటారు... భర్త చనిపోతే భార్య కూడా ఆ చితిలో తనను తాను దహనం చేసుకునే ప్రక్రియ. కానీ ఒడిశాలో పతీసహగమనం జరిగింది.  భార్య చనిపోయిందన్న నిజాన్ని విని తట్టుకోలేకపోయాడు. ఇక తనతో ఉండదనే బాధను దిగమింగలేకపోయాడు. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. మూడు ముళ్ల బంధానికి మృత్యువే ముగింపు అనుకున్నాడు. భార్య మృతదేహం కాలుతున్న చితిలో అమాంతం దూకేశాడు. 


Also Read: Supreme Court: కొలీజియం సిఫార్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 9 మంది జడ్జీలు


గుండె పోటుతో మృతి


భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిలోకి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలోని సియాల్జోడి గ్రామంలో గత మంగళవారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని నీలమణి సబర్‌ (65)గా పోలీసులు గుర్తించారు. అతని భార్య రైబారి (60)  మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలకు తన నలుగురు కుమారులతో పాటు నీలమణి సబర్ హాజరయ్యారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో సబర్ చితిలో దూకేశాడు. 


Also Read: Khammam: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి నీచపు పని.. ఇంట్లోకి తీసుకెళ్లి దారుణం


చితిలో దూకి


చితికి నిప్పంటించాక పక్కనే ఉన్న నీటి మడుగు వద్దకు నలుగురు కుమారులు, బంధువులు స్నానానికి వెళ్లిన సమయంలో ఆయన చితిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయన చితిలో కాలిపోయి మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇనాళ్లు కష్టసుఖాలు పంచుకున్న భార్య లేదనే నిజాన్ని నమ్మలేక ఆ వృద్ధుడు ఈ పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇద్దరూ చితిలోనే కాలిపోయారు. బతుకైనా, చావునై నీతోనే అన్న మాటను అక్షరాల నిజం చేశారు. 


Also Read: Prakasam: సొంత బాబాయినే చంపిన కొడుకు.. శవం దగ్గరే బహిరంగంగా అరిచి చెప్పి బీభత్సం!


కేసు నమోదు


'వృద్ధుడి అసహజ మృతిపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేశాము. గ్రామస్థుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం భార్య చనిపోయిందన్న బాధను తట్టుకోలేక బలన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. '- దాము పుజారా, ఇన్స్ఫెక్టర్, కేగావ్న్ పోలీసు స్టేషన్ 


 


Also Read: Tank Bund No Entry: ట్యాంక్‌ బండ్‌పైకి ఈ టైంలో నో ఎంట్రీ, ఇక పర్మినెంట్‌గా ఇంతే.. సీపీ వెల్లడి