New Year Celebrations in India : జనవరి 1, 2025. కొద్ది గంటల్లోనే ఈరోజు వచ్చేస్తుంది. 2024కి బాయ్ చెప్పి 2025ని స్వాగతించేందుకు అందరూ సిద్ధమైపోతున్నారు. అయితే అసలు ఈ న్యూ ఇయర్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఇండియాకి వచ్చిందో తెలుసా? కొత్త సంవత్సరాన్ని దానికి ముందు ఎలా జరుపుకునేవారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్​ని ఎలా చేసుకుంటారు? జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్​గా ఇండియాలో ఎందుకు చేసుకుంటున్నారు? వంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 


న్యూ ఇయర్ చరిత్ర ఇదే.. 


ఇండియాలో బ్రిటిష్ పాలన సమయంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవారు. దీనిని అంతర్జాతీయంగా ఫాలో అవుతారు. దానిలో భాగంగా ఇండియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా 1947 నుంచి జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరం ప్రారంభంగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి భారతదేశంలో జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరంగా చేసుకుంటున్నారు. 


సాంప్రదాయ వేడుకలు మాత్రం అప్పుడే.. 


భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి వారి సంప్రదాయాలు, క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. తెలుగు, కన్నడ వారు ఉగాదిని నూతన సంవత్సరంగా చెప్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మొదటి రోజున దీనిని చేసుకుంటారు. ఇది మార్చి లేదా ఏప్రిల్​లో వస్తుంది. మరాఠీ వారు గుడి పడ్వాను నూతన సంవత్సరంగా చేసుకుంటారు. తమిళులు పుతాండును తమిళ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. 


ప్రాచీన కాలంలో ఎలా చేసుకునేవారంటే.. 


భారతదేశంలో పాతకాలంలో అంటే స్వాతంత్య్రానికి ముందు.. నూతన సంవత్సరాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారమే జరుపుకునేవారు. ఈ క్యాలెండర్​ను చాంద్రమానం, చంద్ర చక్రాల ఆధారంగా రూపొందించి.. వాటిలోని నెలలను సౌర సంవత్సరంతో సమానం చేయడానికి.. ప్రతి 2-3 సంవత్సరాలకు అదనంగా ఓ నెలను చేర్చారు. అందుకే జనవరి 1వ తేదీన చేసుకునే న్యూ ఇయర్​ని కొందరు జరుపుకోరు. ఇది పాశ్చాత్య దేశాల ప్రభావం అంటూ కొందరు చెప్తూ ఉంటారు. 


Also Read : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా


ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే.. 


ఇండియాలో నూతన సంవత్సరం వేడుకలు డిసెంబర్ 31వ తేదీనుంచే మొదలైపోతాయి. యూత్ ఎక్కువగా దీనిని జరుపుకుంటారు. పార్టీలు చేసుకుంటూ.. ఫ్రెండ్స్​తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఫ్యామిలీతో కలిసి గేమ్స్ ఆడుతూ, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాంగ్స్, డ్యాన్స్​లతో న్యూ ఇయర్​ని ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గోవా వంటి నగరాల్లో న్యూయర్​ను బాగా ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ట్రిప్స్​కి, సినిమాలకి వెళ్తారు. 


జనవరి 1వ తేదీన కొందరు గుడికి వెళ్తారు. క్రిస్టియన్స్ చర్చ్​లలో ప్రేయర్స్ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన ఎంత తాగినా, పార్టీల్లో ఎంత ఎంజాయ్ చేసినా.. కొత్త సంవత్సరంలో ఉదయాన్నే మాత్రం దేవుడిని చూసి.. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటారు. 2025లో కొత్త ఏడాది మిడ్​ వీక్​(బుధవారం)లో వస్తుంది. 



Also Read : ఈ సింపుల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీ జీవితంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి