Prema Entha Madhuram Serial Today Episode: రాకేస్ తన లాయర్‌తో శంకర్‌కు లోకేషన్ షేర్ చేయించి అక్కడకు రమ్మని చెప్పిస్తాడు. లాయర్ లోకేషన్ సెండ్ చేసి శంకర్‌కు ఫోన్ చేసి చెప్తాడు. గౌరి సేఫ్‌గానే ఉంది కదా అని శంకర్ అడగ్గానే ముందు మీరు అక్కడికి రండి అన్ని మాట్లాడుకుందామని చెప్తాడు లాయర్. ఏమైందని జెండే అడగ్గానే ఆ రాకేష్ గాడు మనల్ని నమ్మడం లేదని చెప్తాడు శంకర్. గౌరిని వారితో తీసుకురావడం లేదని అనిపిస్తుంది అంటాడు శంకర్. ఓనరును తీసుకుని వస్తున్న యాదగిరి బైకు మద్యలో ఆగిపోతుంది.
ఓనరు: ఏంటయ్యా యాదగిరి ఎటూ కాకుండా మధ్యలో ఆపేశావు. నేను ముందే చెప్పాను. ఈ డొక్కు బండి వేసుకురావొద్దని. అందుకే ఎక్కనన్నాను. అదే నా అశ్వం ఉండి ఉంటేనా..?
యాదగిరి: మీ గాడిద ముఖానికి గుర్రాలు తక్కువయ్యాయి.
ఓనరు: ఏంటి ఏమో అంటున్నావు..
యాదగిరి: ఏం లేదు మీకు గుర్రాల కన్నా.. ఏనుగులు అయితే బాగుంటుందని అన్నాను.
ఓనరు: భలే చెప్పావయ్యా మన ఫామ్ హౌస్ ఉంది కదా..? రెండు ఏనుగులు కొని పెట్టు..
యాదగిరి: రెండు ఎందుకండి.. ఒకటి చాలు కదా..?
ఓనరు: మరి ఇంకోటి..?
యాదగిరి: ఇంకోటి ఎందుకండి.. మీరు ఉన్నారు కదా…?
అనగానే ఓనరు యాదగిరిని తిడతారు. ఇంతలో బండి స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ కలిసి శంకర్ వాళ్ల దగ్గరకు వెళ్తారు. ఓనరు ను తీసుకుని శంకర్, జెండే, యాదగిరి అక్కడి నుంచి రాకేష్ పంపించిన లోకేషన్‌కు వెళ్తారు. ఇంతలో రాకేష్, తన లాయర్ తో వస్తాడు. లాయర్, శంకర్ దగ్గరకు వెళ్తాడు.
లాయర్: సంతకం పెట్టండి..
శంకర్: ఏంటీ పేపర్స్..
లాయర్: మీరు రాకేష్ మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకుంటూ మీకు మీ ఫ్యామిలీకి రాకేష్‌తో ఎలాంటి శత్రుత్వం లేదని సంతకం పెట్టండి.
జెండే: ముందు గౌరి ఎక్కడుందో చూపించండి.
లాయర్: గౌరి సేఫ్‌గానే ఉంది. కానీ మాతో తీసుకురాలేదు. మీరు ఆ పేపర్స్ మీద సంతకం పెట్టి ఆ ఓనరును మాకు అప్పగించండి..
యాదగిరి: సార్ మేడంను చూపించేంత వరకు మీరు సంతకం పెట్టకండి.
జెండే: అవును శంకర్ వీళ్లు ఏదో డ్రామా ప్లే చేస్తున్నారు.
లాయర్: మీ మంచి కోసమే చెప్తున్నాను. సంతకం పెట్టండి.
రాకేష్: ఆర్యవర్థన్ నీ అను నీకు ప్రాణాలతో దక్కాలి అంటే ఆ పేపరు మీద సంతకం చేసి వాణ్ని ఇటు పంపు. నీకు ఎక్కువ టైం కూడా లేదు.
అని వార్నింగ్ ఇస్తూ లాయర్‌కు సైగ చేయగానే లాయర్ వీడియో కాల్ చేసి గౌరిని చూపిస్తాడు. వీడియో కాల్ లో గౌరిని చూసిన శంకర్ పేపర్స్ మీద సంతకం పెడతాడు. ఓనరును తీసుకుని రాకేష్ వెళ్లిపోతుంటే.. గౌరి ఎక్కడ అని శంకర్ అడగ్గానే.. ఫ్యాక్టరీలో ఉంది వెళ్లి కాపాడుకో అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే శంకర్, జెండే, యాదగిరి ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లి గౌరి కోసం వెతుకుతుంటారు. మరోవైపు రాకేష్ కోపంగా ఓనరును చూస్తూ అక్కడ శంకర్, గౌరిని కాపాడాడో ఇక్కడ నిన్ను చంపేస్తాను అంటాడు. మరోవైపు శంకర్.. గౌరి దగ్గరకు వెళ్లి కాపాడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!