Brahmamudi Serial Today Episode:  ఇంట్లో జరిగే గొడవల్లోకి అపర్ణను కానీ, ఇందిరాదేవిని కానీ లాగితే మర్యాదగా ఉండదని వార్నింగ్‌ ఇస్తుంది కావ్య. రుద్రాణి కోసంగా రాజ్ కు నీ భార్య ఏం మాట్లాడుతుందో విన్నావా అంటుంది. రాజ్‌ విన్నాను. చూస్తున్నాను. కావ్య చెప్పింది నిజమే.. తను ఏం చేసినా ఇంటి కోసమే చేస్తుందని ఇంకా చెప్పాల్సి వస్తే మీ అందరూ ఉద్యోగాలు చేసుకుని బతకండి అంటూ కావ్యను తీసుకుని వెళ్లిపోతాడు రాజ్‌. అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్‌, ప్రకాష్‌ హ్యాపీగా చూస్తుంటారు. కావ్య మాటలకు ఫీలయిన స్వప్న తన రూంలో ఆలోచిస్తుంటే రాహుల్‌, రుద్రాణి వస్తారు.


రుద్రాణి: సొంత చెల్లి అని నెత్తిన పెట్టుకుని ఊరేగావు. ఇప్పుడేమయింది. కావ్య చేతిలోకి ఆస్తి వస్తే ఇలాగే చేస్తుందని నాకు ముందే తెలుసు కాబట్టే నిన్ను హెచ్చిరించాను. అసలు నీ చెల్లి ఏమైనా శివంగి అనుకుంటున్నావా..? మనమంతా ఆవిడ మాటలే వినాలి అనుకుంటున్నావా..? పెళ్లి అయిన తర్వాత కావ్య తన సొంత వాళ్లు అంటే తన మొగుడు, తన అత్తమామలే అనుకుంటుంది.


రాహుల్‌: ఇప్పటికైనా నువ్వు కూడా నీ మొగుడు, అత్తా అని ఆలోచించు


స్వప్న: మీరెన్ని చెప్పినా అది నా చెల్లి.. వయసులో నాకన్నా చిన్నదే అయినా బాధ్యతలు తీసుకోవడంలో నాకన్నా పెద్దది. అది నాకు తల్లి లాంటిది


రుద్రాణి: అయినా నీకు ఇంత చెప్పినా నీకు ఇంత అవమానం జరిగినా ఇంకా మారవా..?


స్వప్న: నేను మారను మారాల్సిన అవసరం లేదు. పుల్లలు పెట్టకుండా మీరు బతకలేరా..?


అంటూ కోపంగా స్వప్న వెళ్లిపోతుంది. మనసులో బాధ ఉంది కానీ బయటకు చెప్పడం లేదు. అది బయట పడేవరకు మనం ఇలాగే రెచ్చగొట్టాలి అని రుద్రాణి, రాహుల్‌కు చెప్తుంది. తర్వాత కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరకు స్వప్న వెళ్తుంది.


స్వప్న: కావ్య నేను కూడా నీకు పరాయిదానిలా కనిపిస్తున్నానా..?


కావ్య: సొంత అక్కను ఎవరైనా పరాయిది అనుకుంటారా..?


స్వప్న: మరి అలా అనుకుంటే నెక్లెస్‌ విషయంలో నన్ను ఎందుకు అందరి ముందు అలా అవమానించావు


కావ్య: అసలు ఇంటి కోసం ఇచ్చిన చెక్‌ ను వాడుకోవడమే తప్పు. అది ఎవరు చేసినా తప్పే అంటాను. ఇంట్లో ఏం జరిగిందో చూశావు కదా అక్కా లక్షలకు లక్షలు దుబారా ఖర్చు చేస్తున్నారు


స్వప్న: ఇంక ఆపు కావ్య..   మీ చిన్నత్త, మా అత్త అన్నట్టు.. ఆస్థి నీ  చేతికి వచ్చే సరికి నీకు స్వార్థం పెరిగింది.


కావ్య: అవును నేను ఇంతే వాళ్లకు చెప్పాను. నీకు చెప్తున్నాను. ఏదైనా కావాలంటే నీ ప్రాపర్టీ నుంచి ఖర్చు పెట్టుకో.. మీ అత్తకు నీకు తేడా ఉందనుకున్నాను. నీకు ఆవిడకు తేడా లేకుండా పోతుంది.


స్వప్న: కావ్య నువ్వు పూర్తిగా మారిపోయావు. ఆస్తులు రాగానే అక్కను కూడా పరాయిదాన్ని చేసేశావు.



 అంటూ స్వప్న ఏడుస్తూ  అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ కోపంగా ప్రకాష్‌ దగ్గరకు వెళ్లి ఇవాళ నాకు రుద్రాణికి జరిగిన అవమానమే రేపు నీకు మన కొడుక్కి జరగదని గ్యారంటీ ఏంటి అంటూ ప్రశ్నిస్తుంది. ధాన్యలక్ష్మీ మాటల టార్చర్‌ భరించలేక ప్రకాష్‌ రేపే ఈ విషయం అన్నయ్యతో మాట్లాడతాను అంటాడు ప్రకాష్‌.   స్వప్న విషయంలో కావ్య మాటలు తప్పుబడతాడు రాజ్‌. ఏది ఏమైనా నువ్వు అలా అవమానించకూడదు అని చెప్తాడు. కావ్య మాత్రం అలా చేసినందుకు తనుక తన తప్పేంటో అర్థం అవుతుంది అని చెప్తుంది. తాతయ్య మాట నిలబెట్టే వరకు నన్ను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని కావ్య చెప్తుంది. హాస్పిటల్‌ లో కట్టాల్సిన ఐదు లక్షల గురించి ఇద్దరూ ఆలోచిస్తారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!