Ammayi garu Serial Today Episode రూప కారు రిపేర్ అయితే రాజు గ్యారేజ్‌కి వస్తుంది. అక్కడ ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. రాజు కారు రిపేర్ చేయడానికి వెళ్తాడు. షాప్‌లో ఉన్న వారికి తన బాధ తెలీకూడదు అని రాజు అనుకుంటారు. ఇక రూప అయితే అంత టాలెంట్ ఉన్న రాజు మెకానిక్‌గా ఉండటం ఏంటి అని షాక్ అయిపోతుంది.


రూప: మనసులో.. రాజుకి ఇంకా నా మీద ప్రేమ తగ్గలేదు. మా మధ్య ఇంత దూరం పెరిగినా రాజు మనసులో స్థానం నాదే. రాజు ఏ పని చేసినా రూప లేనిదే నేను లేను అనేలా తన గ్యారేజ్‌కి కూడా రూప, రాజులు ఉండేలా ఆర్ ఆర్ అని పెట్టుకున్నాడు. రాజు, రూప గ్యారేజ్. రాజు కంటే ముందే జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి. రాజు కూడా సారీ చెప్పడానికే వస్తున్నాడు. అది..
రాజు: 2 వేలు అయింది. రూప షాక్ అయిపోతుంది. 
రూప: రాజుకి నా మీద కంటే డబ్బు మీదే ఇష్టం ఎక్కువ అనుకుంటా. అసలు రాజు మనసులో నేను లేను అనిపిస్తుంది. కోపంతో డబ్బులు తీసి రాజుకి ఇస్తుంది. డ్రైవర్ కారు తీయండి. కోపంగా చూస్తూ వెళ్లిపోతుంది.


రూప వెళ్లగానే రోహిణి గొడుగు పట్టుకొని ఫ్లాష్క్ తీసుకొని వస్తుంది. రాజు వర్షంలో తడవడం చూసి తన చున్నీతో తుడిచి గొడుగు పడుతుంది. వర్కర్స్‌ని తిడుతుంది. ఇక తన తండ్రితో వర్షంలో కూడా రాజుకి పని చెప్పాలా అని ఎమోషనల్ అయిపోతుంది. వర్క్‌ర్స్ రాజుని రోహిణి మొగుడిలా చూస్తుందని ఓవర్‌గా రియాక్ట్ అయిపోతుందని అంటుంది. రాజు రోహిణిని వెళ్లి నీ పని చూసుకో అని కోపంగా అనేస్తాడు. రాజు ప్రవర్తనకు రూప బాధ పడుతుంటుంది. రాజు వాళ్లు గతంలో ఉన్న ఇంటిలో సూర్యప్రతాప్ వాళ్లు ఉండటంలో రూప అక్కడికి చేరుకుంటుంది. రాజు మెమోరిసీ అన్నీ గుర్తు చేసుకుంటుంది. రాజు బండి ఉన్నట్లు ఊహించుకొని ఆనందపడుతుంది. ఇక సూర్యప్రతాప్‌తో పాటు అందరూ వచ్చి రూపకి స్వాగతం పలుకుతారు. గతంలో రాజు ఫొటో ఉన్న స్థానంలో తన తండ్రి ఫొటో చూసిన రూప రాజుని గుర్తు చేసుకుంటుంది. రూపతో విజయాంబిక నీకు, మీ నాన్నకి ఇష్టమైన ఇళ్లు అని ఎవరో కొనాలి అనుకుంటే చాలా కష్టం మీద నీ కోసం నేను కొన్నాను అని చెప్తుంది. రూప దగ్గర ఉన్న దీపు దీపక్, మందారంల బిడ్డ. దాంతో రూప ఆ బిడ్డని మందారం పొటో దగ్గరకు తీసుకెళ్లీ నీకు జన్మనిచ్చిన తల్లికి దండం పెట్టుకో అంటుంది. 


విజయాంబిక: రేయ్ దీపక్ చూడరా వాడు నీ కన్న కొడుకు అయినా ముందు ఇక్కడున్న తండ్రికి నానమ్మకి పరిచయం చేయకుండా రూప వాడిని నీ పెళ్లాం ఫొటో దగ్గరకు తీసుకెళ్లింది. వాడు నీ కొడుకు అయినా రూప కంట్రోల్‌లో ఉన్నాడు. మనవైపు వాడిని తిప్పుకోవాలిరా.
దీపక్: ఇప్పుడే వచ్చాడు కదమ్మా రెండు రోజులు ఆగని.
రూప: మందారం నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. తెలిసో తెలీకో నా వల్లో నీ కుటుంబానికి అన్యాయం జరిగింది. కొంత అయినా నీకు న్యాయం చేయాలి అని నీ కొడుకుకి నేను తల్లిని అయ్యాను. వాడికి అన్నీ నేనే అయి చూసుకుంటున్నాను. వాడిని మంచి ప్రయోజకుడిని చేస్తా.
పింకీ: అక్కా నువ్వు ఫ్రెష్ అయిరా అందరం కలిసి తిందాం.
దీపక్: బాబు దీపక్ మమ్మీ ఫ్రెష్ అవుతుంది. నీకు ఈ డాడీ రెడీ చేస్తాడు. రా వెళ్దాం.
దీపు: నేను రానుగా.
దీపక్: మమ్మీ ఫ్రెష్‌అప్ అవుతుందిలే రా. 
సూర్య: రూప ఎందుకు ఇంత డల్‌గా ఉంది ఏమై ఉంటుంది.


విరూపాక్షి మనవడు బంటితో హోం వర్క్ చేయిస్తుంది. అప్పలనాయుడు విరూపాక్షితో అమ్మగారు మీ అందరిలాగే బంటికీ కూడా పింక్ కలర్ పిచ్చి పట్టిందని అంటాడు. దానికి బంటి అందరికీ అంటే ఇంకెవరికైనా ఇష్టమా అని అడుగుతాడు. విరూపాక్షి ఏం చెప్పకుండా ముందు హోం వర్క్ చేయమని అంటుంది. ఇంతలో రాజు రావడంతో బంటి నాన్న అని వెళ్లి హగ్ చేసుకుంటాడు. రాజు డల్‌గా ఉంటాడు. సూర్య రూప దగ్గరకు వెళ్తాడు. ఏమైంది అని అడుగుతాడు. అందరూ రూప దగ్గరకు వస్తారు. రూప దీపుని చదువుకోమని అంటుంది. ఇక రాజుని అందరూ ఏమైందని అడిగితే రాజు బంటిని లోపలికి వెళ్లమంటాడు. రాజు కనిపించాడని రూప చెప్తే రూప కనిపించిందని రాజు చెప్తాడు. రెండు ఫ్యామిలీలు షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: ఆ గదిలో నయని దేహం - అమ్మవారి సాక్షిగా పెద్ద రిస్క్, ఒక శరీరాన్ని అలా మరొకటి ఇలా!