Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఫుడ్ ఆర్డర్ పెడతాను అన్నా లక్ష్మీ తాను వండుతానని చెప్పి వెళ్తుంది. లక్ష్మీ గొప్పతనం జయదేవ్ మిత్రకు చెప్తాడు. ఇక మనీషా జానుతో ఈ ప్రాబ్లమ్స్‌తో ముఖ్యంగా నువ్వు వివేక్ ఇబ్బంది పడుతున్నారని జానుతో అంటుంది. దానికి మనీషా మీ మధ్య నేను నలిగిపోతున్నాను అని అంటుంది. ఇక మిత్ర తండ్రితో ఈ గొడవలతో పిల్లలు నలిగిపోతున్నారు అని అంటాడు. లక్ష్మీ వాళ్లు నీ గురించి ఆలోచించడమే లేదని జానుని ఎక్కిస్తారు. ఇక మిత్ర ఈ సమస్యకు త్వరగా ఓ సొల్యూషన్‌ చూడాలి అంటాడు. దానికి జయదేవ్ మిత్ర ఫ్యామిలీ అంతా కలిసి ఉండేలా చూడు అని అంటాడు.


ఇక మనీషా జానుతో కలిసి ఉంటే కదురదు అని ఎవరి బిజినెస్ వాళ్లు చూసుకోవాలని అంటుంది. దానికి దేవయాని ఇందులో మా స్వార్థం లేదు జాను నువ్వు నా కోడలు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక అంటుంది. ఇంతలో మిత్ర ఇంటికి లక్ష్మీ, జానుల తాతయ్య పొలంలో పండిన పళ్లు కూరగాయలు తీసుకొని వస్తారు. ఇక లక్ష్మీ, మిత్రలు తాతయ్య గారితో మాట్లాడుతారు. జాను కూడా తాతయ్యని చూస్తుంది. సంతోషంగా కిందకి వెళ్లబోతే మనీషా చేయి పట్టుకొని ఆపుతుంది. ఆయన వచ్చి చాలా సేపు అయిందని కానీ నీ గురించి అడగలేదు మీ అక్క కోసమే మాట్లాడుతున్నారని చెప్తారు. తాతయ్యగారు కూడా లక్ష్మీని పొగడటంతో ఇద్దరూ జానుని ఇంకా ఎక్కిస్తారు. ఇక వివేక్ వెళ్లి పలకరిస్తాడు. తాత గారు జాను గురించి అడిగితే వివేక్ జానుని పిలస్తాడు. కానీ జాను రాదు. ఇక తాతగారు పంటలు అమ్మేసి ఆ లెక్కలు రాసి డబ్బు కూడా లక్ష్మీకి అప్పగిస్తారు. ఆ డబ్బు లక్ష్మీది అట అని లెక్కలు డబ్బు అంతా తనకే అప్పగిస్తున్నారని మనీషా, దేవయాని జానుకి ఎక్కిస్తారు. దాంతో జాను కోపంగా కిందకి వెళ్తుంది. 


జాను తాతగారితో ఇకపై అక్కకే కాదు నాకు లెక్కలు చెప్పాలి వచ్చే డబ్బులో సగం నాకు ఇవ్వాలి అని డబ్బులో సగం తీసుకుంటుంది. మీ అన్నగారికి ఈవిడ ఒక్కర్తే కాదు నేను మనవరాలిని అని ఊరి ఇంటిలో పొలంలో నాకు వాటా ఉందని చెప్పి వెళ్లిపోతుంది. మనీషా, దేవయానిలు పాచిక పారిందని అనుకుంటారు. లక్ష్మీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాతయ్య గారు ఏమైందని లక్ష్మీని అడుగుతారు. ఏం లేదు అని చిన్న గొడవ రాత్రి అయిందని లక్ష్మీ చెప్తుంది. దాంతో ఆయన చిన్నప్పటి నుంచి మీ మధ్య గొడవ చూడనేలేదు అంటారు. దాంతో లక్ష్మీ సరదాగా గొడవ పడ్డాం అని చెప్తుంది. లక్ష్మీ బాగానే కవర్ చేస్తుందని మనీషా, దేవయాని అనుకుంటారు. కాఫీ తీసుకొస్తా అని లక్ష్మీ జాను దగ్గరకు వెళ్తుంది.


లక్ష్మీ: జాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ చాలా కొత్తగా కనిపిస్తున్నావ్.
జాను: ఇక నుంచి ఇలాగే కనిపిస్తాను ఇలాగే ఉంటాను.
లక్ష్మీ: ఏమైంది నీకు అయినా తాతయ్య గారి ముందు అలా మాట్లాడొచ్చా నువ్వు ముందు తాతయ్య గారికి సారీ చెప్పు. 
జాను: ఎవరికి సారీ చెప్పాలి నేను అని అరుస్తుంది. ఆ మాటలు కిందకి వినిపిస్తాయి.
లక్ష్మీ: ఎందుకే అలా అరుస్తున్నావ్ నెమ్మదిగా మాట్లాడలేవా. మన తాతయ్య గారు ఎలాగో ఈయన అలాగే ఈ వయసులో ఆయన్ను ఇబ్బంది పెడతామా. ఈ వయసులో ఇంత దూరం ఆయన ఎవరి కోసం వచ్చారు మన కోసం కాదా. ఊరిలో ఆ తాతయ్య తప్ప మనకు ఇంకెవరు ఉన్నారు.
జాను: తాతయ్య తాతయ్య ఆయనకు మనకు తాతయ్య కాదు మన ఆస్తి పాస్తులు చూసుకునే గుమస్తా. ఆ గుమస్తాకి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు కావాలంటే నెలకి ఇంత అని జీతం ఇద్దాం. తాతగారు ఆ మాటలు విని బాధ పడతారు.
లక్ష్మీ: అలా అరవకు జాను తాతయ్య విని బాధ పడతారు. 
జాను: వినపడాలి అనే అరుస్తున్నాను నీకు అది అర్థం కాలేదా. నీకు గుమస్తాలతో పనివాళ్లతో మంచి అనిపించుకోవాలనే కోరిక నాకు అలాంటి కోరికలు లేవు. నేను మా ఆయన బాగుంటే చాలు.
లక్ష్మీ: చాలు జాను అసహ్యంగా మాట్లాడకు. 
జాను: వినడానికి అంత కష్టంగా ఉంటే వెళ్లి ఆ ముసలోడిని పంపించు. వెళ్లు.


పార్థసారధి గారు ఏడుస్తారు. మిత్ర, వివేక్, జయదేవ్ ఆయనను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. లక్ష్మీ కిందకి వచ్చే సరికి ఆయన వెళ్లిపోతారు. మీ అక్కాచెల్లెళ్లి చూడాలని ఆశతో వచ్చి వినకూడనివి విని చూడకూడనివి చూసి బరువెక్కిన గుండె బద్ధలైపోతుందని భయంతో వెళ్లిపోయారమ్మా అని జయదేవ్ లక్ష్మీతో చెప్తారు. లక్ష్మీ కూలబడి ఏడుస్తుంది. లక్ష్మని చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక మిత్ర ఆఫీస్‌కి టైం అయింది వెళ్లామంటే వివేక్ కారు తీసుకొస్తా అని అంటాడు. ఇంతలో జాను వచ్చి కారు తీయడానికి మీరు డ్రైవర్ కాదు ఆ పనికి వేరే వాళ్లు ఉన్నారని డ్రైవర్‌ని పిలిచి ఈ రోజు నుంచి ఆయనే డ్రైవింగ్ చేస్తారు వాళ్ల కారు కాదు మీ కారు అంటుంది. నాకు డ్రైవరా అని వివేక్ అంటే మీరు ఓనరే అని వివేక్‌కి కోట్ ఇచ్చి మీరు ఎవరి కారు ఎక్కకూడదు డ్రైవింగ్ చేయకూడదు అని చెప్తుంది. చాలా ఎక్కువ చేస్తున్నావ్ అని వివేక్ అంటే మనకు జరిగిన దానికంటే ఇదేం ఎక్కువ కాదు అంటుంది. మిత్ర, లక్ష్మీ కన్నీరు పెట్టుకొని ఏం మాట్లాడకుండా వెళ్లిపోతారు. తర్వాత వివేక్ వెళ్తాడు. మనీషా, దేవయానిలు జానుని సూపర్ అని పొగుడుతారు. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది నా కోడలు అనిపించావ్ అని దేవయాని అంటుంది. ఆఫీస్‌కి వెళ్లి మిత్ర, లక్ష్మీ జరిగింది తలచుకొని ఆలోచనలో పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: ఆ గదిలో నయని దేహం - అమ్మవారి సాక్షిగా పెద్ద రిస్క్, ఒక శరీరాన్ని అలా మరొకటి ఇలా!